Friday, November 22, 2024
Homeహెల్త్Honey is the best: సిల్కీ స్కిన్ కోసం స్వీట్ తేనె

Honey is the best: సిల్కీ స్కిన్ కోసం స్వీట్ తేనె

స్వచ్ఛమైన తేనెతోనే సత్ఫలితాలు వస్తాయి

చర్మానికి తేనె మాస్కులు…

- Advertisement -

చర్మానికి తేనె ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇదేమీ కొత్త విషయం కాదు. మన పూర్వకాలం నుంచీ తేనె కున్న ప్రాధాన్యం ఎంతో. తేనెలో యాంటిమైక్రోబియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. యాంటిసెప్టిక్ గా కూడా తేనె పనిచేస్తుంది. ఇన్ఫెక్షన్లేమీ చర్మానికి సోకకుండా తేనె ఒక రక్షణ పొరను చర్మంపై ఏర్పరుస్తుంది. తేనె యాక్నేను పోగొడుతుంది. మొటిమలను పోగొడుతుంది. అంతేకాదు మైక్రోబ్స్ వల్ల కలిగే ఎలాంటి దుష్ఫలితాలనైనా తేనె తగ్గిస్తుంది. తేనెలో పిహెచ్ ప్రమాణాలు తక్కువగా ఉంటాయి.

దీంతో బాక్టీరియా వల్ల చర్మంపై యాక్నే, బ్లాక్ హెడ్స్ వంటివి తలెత్తవు. చర్మంపై ఉండే రంధ్రాలను తేనె బాగా శుభ్రం చేస్తుంది. మృతకణాలను పోగొడుతుంది. అంతేకాదు ముందే చెప్పినట్టు చర్మంపై ఏర్పడ్డ బ్లాక్ హెడ్స్ సైతం పోతాయి. అంతేకాదు తేనెలోని యాంటిమైక్రోబియల్ గుణాల వల్ల ఎగ్జిమా, సొరియాసిస్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. చర్మం యొక్క రోగనిరోధకశక్తిని సైతం తేనె తగ్గిస్తుంది.

చాలామంది పొడిచర్మంతో బాధపడడానికి ప్రధాన కారణం పొటాషియం లోటు. పొటాషియం చర్మానికి కావలసిన మాయిశ్చరైజర్ ని అందిస్తుంది. శరీరం లోపల కూడా తేమను పరిరక్షిస్తుంది. అలాంటి పొటాషియం తేనెలో పుష్కలంగా ఉంది. పొడిచర్మం వాళ్లు తేనెను ముఖానికి రాసుకుంటే లోపలికంటా మాయిశ్చరైజర్ అందుతుంది. తేనెలో పలు ఎంజైములు కూడా ఉన్నాయి. ఇవి చర్మం లోపలికంటా వెళ్లి చర్మానికి కావలసిన కండిషనింగ్, మృదుత్వాన్ని అందిస్తాయి. తేనె సహజసిద్ధమైన యాంటిబయొటిక్ గుణాలను కలిగి ఉంది. ఇవి చర్మంపై ఉండే రంధ్రాల నుంచి మురికిని పోగొడుతుంది. బ్లాక్ హెడ్స్ ను నివారిస్తుంది. చర్మంపై ఉండే మృతకణాలను పోగొడుతుంది. నల్లమచ్చలను పోగొట్టి చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. చర్మాన్ని పట్టులా మలుస్తుంది.

సూర్యరశ్మి వల్ల చర్మం ముడతలు పడతాయి, నల్లని మచ్చలు ఏర్పడతాయి. చర్మం సాగుతుంది. చర్మం ఎలాస్టిసిటీ బాగా తగ్గుతుంది. సూర్యరశ్మి వల్ల కలిగే అలాంటి దుష్ఫలితాలన్నింటి నుంచి తేనె మనల్ని సంరక్షిస్తుంది. తేనెలోని యాంటాక్సిడెంట్ గుణాల వల్ల చర్మం బిగువుగా అవుతుంది. చర్మంపై పడిన ముడతలను పోగొడుతుంది. వయసుతో ఏర్పడ్డ గాట్లను పోగొడుతుంది. చర్మం లోపలికంటా ఏర్పడ్డ ముడతలను కనిపించకుండా చేస్తుంది. అతినీలలోహిత కిరణాలు చర్మానికి హాని కలిగించకుండా తేనె సంరక్షిస్తుంది. హనీ మాస్కు ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం ఎలాస్టిసిటీ పెరుగుతుంది. అలా చర్మాన్ని యంగ్ గా, మరింత బ్యూటీగా కనిపించేలా తేనె చేస్తుంది.


జిడ్డు చర్మం వారికి కూడా తేనె ఎంతగానో ఉపయోగపడుతుంది. చర్మంలోని అధిక నూనెను పీల్చేస్తుంది. ఎలాంటి స్కిన్ ఇన్ఫెక్షన్లు లేకుండా చేస్తుంది. రంధ్రాలు తగ్గేలా చేసే గుణం తేనెలో ఉంది. సెబమ్ ఉత్పత్తిని క్రమబద్ధీకరిస్తుంది. సున్నితమైన చర్మం ఉన్నవారికి తేనె ఎంతో సాంత్వననిస్తుంది. చర్మంపై ఏర్పడ్డ దద్దుర్లను పోగొడుతుంది. చర్మం సున్నితత్వాన్ని కాపాడుతుంది. గాట్లను కనిపించకుండా చేస్తుంది. నల్లమచ్చలను పోగొడుతుంది. దెబ్బతిన్న చర్మ కణాలను పునరుద్ధరిస్తుంది. చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. యాక్నే, మొటిమలను నివారించే యాంటిబయొటిక్ మల్లే తేనె పనిచేస్తుంది. అందమైన, ఆరోగ్యవంతమైన చర్మానికి ఇంట్లోనే తయారుచేసుకునే తేనె మాస్కులు చాలా ఉన్నాయి.

పొడి చర్మం ఉన్న వారికి తేనె, కొబ్బరినూనె ఫేస్ మాస్కు బాగా పనిచేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ తేనె, అరటేబుల్ స్పూన్ కొబ్బరినూనె తీసుకుని బాగా కలిపి పేస్టులా చేసి దాన్ని ముఖానికి లేదా చర్మానికి బాగా పట్టించాలి. ఇలా చేయడం వల్ల చర్మం బాగా శుభ్రమవుతుంది. ఈ మాస్కును ముఖానికి రాసుకుని అరగంట అలాగే ఉంచుకోవాలి. తర్వాత నీళ్లతో కడిగేసుకోవాలి. ఇందులో ఉపయోగించిన కొబ్బరినూనెలో ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి చర్మంకు మాయిశ్చరైజర్ తిరిగి అందేలా చేస్తాయి. అంతేకాదు చర్మం సిల్కీగా మెత్తగా ఉండేలా చేస్తాయి. తేనె, కొబ్బరినూనె మాస్కు చర్మంపైన ఉన్న మృతకణాలను పోగొట్టి చర్మాన్ని మృదువుగా చేస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో న్యూట్రియంట్లు కూడా ఈ ఫేస్ మాస్కులో ఉన్నాయి. అంతేకాదు తొందరగా వయసు మీద పడకుండా సంరక్షిస్తుంది కూడా.

తేనె, పసుపు కలిపిన ఫేస్ మాస్కు ముఖానికి లేదా చర్మానికి పట్టించుకోవడం వల్ల చర్మంపై ముడతలు ఏర్పడవు. ఒక టేబుల్ స్పూన్ తేనె, అరటేబుల్ స్పూన్ పసుపు, కొన్ని నీటి చుక్కలు మూడింటినీ బాగా కలిపి పేస్టులా చేయాలి. ఆ మిశ్రమాన్ని మీ ముఖం లేదా చర్మానికి పట్టించాలి. దాన్ని అలాగే అరగంట సేపు ఉంచి తర్వాత చల్లటి నీళ్లలో తడిపిన కాటన్ గుడ్డతో తుడుచుకోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ మాస్కు చర్మం లోపలికంటా ఉన్న మృతకణాలను పోగొట్టి బాగా శుభ్రం చేస్తుంది. ఈ మాస్కు అన్ని రకాల చర్మం వారికీ బాగా పనిచేస్తుంది. తేనెలో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మం అందంగా తయావరడానికి తోడ్పడతాయి. సూర్యరశ్మి కారణంగా ఏర్పడ్డ వయసు తాలూకూ మచ్చలను, కాంతివిహీనమైన చర్మాన్ని పసుపు ఎంతగానో కాంతివంతం చేస్తుంది. నవనవలాడే చర్మం కోసం తేనె మాస్కు ఉంది.

ఒక టేబుల్ స్పూన్ తేనె, పది చుక్కల రోజ్ హిప్ సీడ్ ఆయిల్ తీసుకుని ఆ రెండింటినీ బాగా కలిపి ఆ పేస్టును ముఖానికి రాసుకోవాలి. ఇలా రాసుకున్న దానిని రాత్రంతా అలాగే ఉంచుకుని పొద్దున్న లేచిన తర్వాత తడి కాటన్ గుడ్డతో శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలా రోజూ చేస్తే మంచి ఫలితాలు చూస్తారు. రోజ్ హిప్ ఆయిల్ లో విటమిన్ ఎ బాగా ఉంటుంది. తేనెలో యాంటాక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి రెండూ మెరిసే, పరిశుభ్రమైన చర్మ సౌందర్యాన్ని మీకిస్తాయి. వయసువల్ల ఏర్పడ్డ మచ్చలను ఇది పోగొడుతుంది. అంతేకాదు నల్లమచ్చలు, గాట్లు, ముడతలు, యాక్నేలను సైతం పోగొడుతుంది. ఈ మాస్కులో విటమిన్ సి, లైకోపెన్ రెండూ ఉన్నాయి. ఇవి చర్మంపై ఏర్పడ్డ ముడతలను, గాట్లను పోగొడతాయి.


జిడ్డు చర్మం ఉన్న వారికి నిమ్మ, తేనె ఫేస్ మాస్కు బాగా పనిచేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ తేనె, కొన్ని చుక్కల తాజా నిమ్మరసం వేసి రెండింటినీ బాగా కలిపి పేస్టులా చేయాలి. దీన్ని శుభ్రం చేసుకున్న ముఖానికి పట్టించాలి. ఈ మాస్కును ముఖానికి 20 నుంచి 30 నిమిషాల పాటు ఉంచుకుని తర్వాత తడి కాటన్ గుడ్డతో శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. జిడ్డు చర్మంపై నిమ్మ, తేనెలు బాగా పనిచేస్తాయి. తేనెలో యాంటీబాక్టీరియల్, యాంటిసెప్టిక్ గుణాలు ఉన్నాయి. ఇవి జిడ్డు, యాక్నే సోకే అవకాశాలున్న చర్మంపై బాగా పనిచేస్తాయి. నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ చర్మంలోని అదనపు నూనెను లాగేసి చర్మాన్ని తాజాగా, శుభ్రంగా ఉంచుతుంది. తేనెలోని యాంటిసెప్టిక్, యాంటియాక్నే, మొటిమలు రాకుండా చేస్తుంది. బేకింగ్ సోడా, తేనె మాస్కు చర్మాన్ని శుభ్రం చేస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల తేనె, ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా రెండింటినీ బాగా కలిపి పేస్టులా చేయాలి. దాన్ని బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రదేశాల్లో రాసుకుని రెండు నుంచి ఐదు నిమిషాలు అలాగే ఉంచుకుని తర్వాత తడి కాటన్ గుడ్డతో ముఖాన్ని శుభ్రంగా తుడుచుకోవాలి. ఈ మాస్కు వల్ల బ్లాక్ హెడ్స్ బాగా పోతాయి. ఇది చర్మం పిహెచ్ ప్రమాణాలను సరిగా ఉండేలా చేస్తుంది. బాక్టీరియాను చంపి యాక్నే, మొటిమలు రాకుండా కాపాడుతుంది. మృత కణాలను పోగొట్టి నల్ల మచ్చలను నిర్మూలిస్తుంది.

తేనె, ఓట్మీల్ ఫేస్ మాస్కు మృదువైన చర్మానికి చాలా మంచిది. రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ మెత్తటి ఓట్మీల్ రెండింటినీ బాగా కలిపి పేస్టులా చేయాలి. దాన్ని స్క్రబ్ లా చేసి ముఖానికి మెల్లగా మసాజ్ చేస్తూ రాసుకోవాలి. ఇలా రెండు లేదా మూడు నిమిషాలు చేసి తర్వాత 20 నిమిషాలు ఆ మాస్కును ముఖానికి అలాగే ఉంచుకోవాలి. తర్వాత నార్మల్ నీళ్లతో కడుక్కోవాలి. ఈ మాస్కు నేచురల్ ఎక్స్ పొయిలేటర్. ఇది మృతకణాలను పోగొట్టే మంచి ఎక్స్ ఫొయిలేటర్. అంతేకాదు చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. ఇది సెన్సిటివ్ స్కిన్ కు చాలా మంచిది. పొడిచర్మానికి కూడా ఈ మాస్కు ఎంతో సాంత్వననిస్తుంది. యాక్నేను నివారిస్తుంది.

పెరుగు, తేనె ఫేస్ మాస్కు చర్మాన్ని మెరిపిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ తాజా పెరుగు, కొన్ని చుక్కల తాజా నిమ్మరసం వీటన్నింటినీ కలిపి పేస్టులా చేయాలి. దాన్ని ముఖానికి, చర్మానికి రాసుకొని అరగంటపాటు అలాగే ఉంచుకోవాలి. తర్వాత చల్లటి కాటన్ గుడ్డతో తుడుచుకోవాలి. పెరుగు సహజసిద్ధమైన క్లీనింగ్ ఏజెంట్. ఇది మృతకణాలను పోగొడుతుంది. చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. తగిన మాయిశ్చరైజర్ ని కూడా చర్మానికి అందిస్తుంది. నిమ్మరసంలోని విటమిన్ సి నల్లమచ్చలను, గాట్లను తగ్గించి సమమైన టోన్డ్ స్కిన్ ఉండేలా సహాయపడుతుంది.

అలొవిరా, తేనె మాస్కు కూడా చర్మాన్ని శుభ్రం చేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ అలొవిరా జెల్ రెండూ కలిపి పేస్టులా చేసి ముఖానికి రాసుకొంటే క్లీన్సర్ గా ఇది పనిచేస్తుంది. రెండు మూడు నిమిషాలు ఈ పేస్టుతో ముఖాన్ని మసాజ్ చేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత తడి కాటన్ గుడ్డతో తుడుచుకోవాలి. ఈ మాస్కు చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. మృతకణాలను చర్మం లోపలికంటా పోగొడుతుంది. ఈ మాస్కు చర్మానికి కావలసినంత మాయిశ్చరైజర్ ని అందిస్తుంది. విటమిన్లు, ఖనిజాలను, యాంటాక్సిడెంట్లను చర్మానికి అందిస్తుంది. ఫలితంగా స్కిన్ ఇరిటేషన్లు తగ్గుతాయి. యాక్నేమార్క్స్ పోతాయి. అలాగే నల్లమచ్చలు కూడా పోతాయి. చర్మం యవ్వన మెరుపులను
చిందిస్తుంది. చర్మం టోనింగ్ సమంగా ఉంటుంది. తేనె ఫేస్ మాస్కు నల్లమచ్చలను పోగొడుతుంది. ఇందుకు ఒక టేబుల్ స్పూన్ తేనె, ఐదు చుక్కల ఫ్రాకిన్ సెన్స్ ఎసెన్షియల్ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్ల అలొవిరా జెల్ కలిపి దాన్ని ముఖానికి పట్టించి అరగంట సేపు అలాగే ఉంచి ఆ తర్వాత తడిపిన కాటన్ గుడ్డతో ముఖాన్ని శుభ్రంగా తుడుచుకోవాలి. ఫ్రాకిన్ సెన్స్ ఆయిల్ నల్లమచ్చలను, గాట్లను, ఏజింగ్ స్కిన్ ను ఎంతో శక్తివంతంగా బాగుచేస్తుంది. ఇది చర్మ కణాలను పునరుజ్జీవింపచేస్తుంది. వాటిని ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు ఇది యాక్నే గాట్లను, మచ్చలను పోగొట్టడమే కాకుండా చర్మానికి కావలసిన హైడ్రేషన్ అందిస్తుంది. గాట్లను, మచ్చలను పోగొట్టడంలో ఈ మాస్కు బాగా పనిచేస్తుంది.

బాదం నూనె, తేనె కలిపిన మాస్కు ముఖానికి రాసుకుంటే చర్మం కాంతివంతమవుతుంది. ఒక టేబుల్ స్పూన్ తేనె, పావు టీస్పూన్ స్వీట్ బాదం ఆయిల్ కలిపి పేస్టులా చేసి ముఖం లేదా చర్మానికి రాసి అరగంట సేపు ఉంచి తర్వాత తడి కాటన్ గుడ్డతో తుడుచుకోవాలి. ఓవర్ నైట్ హనీ మాస్కు. ఇది చర్మానికి కావలసిన హైడ్రేషన్ అందిస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News