గోర్లు కొరకడం అనేది చాలా మందిలో కనిపించే సాధారణ అలవాటు. ఇది హానిరహితంగా అనిపించినా, ఇది ఆరోగ్యంపై విభిన్న రకాల ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. చేతులు అనేక ఉపరితలాలను తాకుతాయి, దాంతో గోర్ల కింద బాక్టీరియా, సూక్ష్మక్రిములు పేరుకుపోతాయి. గోర్లు కొరకడం వల్ల ఈ క్రిములు నోటిలోకి వెళ్లి శరీరంలో ఇన్ఫెక్షన్లను కలిగిస్తాయి.
- Advertisement -
గోర్లు కొరకడం ఆరోగ్య సమస్యలకు దారితీసే మార్గాలు..
- తరచుగా గోర్లు కొరకడం వల్ల అవి బలహీనంగా మారి, పగుళ్లు ఏర్పడతాయి.
- చేతుల నుంచి గోర్ల ద్వారా నోటికి బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి.
- గోర్లను కొరకడం వల్ల పళ్లకు ఒత్తిడి ఏర్పడి, పళ్లు పగిలిపోవడం లేదా ఎనామెల్ చెడిపోవడం జరుగుతుంది.
- గోర్ల తుక్కులను మింగడం జీర్ణవ్యవస్థకు హాని కలిగిస్తుంది.
- గోర్లు కొరకడం ఒత్తిడి, ఆందోళనను మరింత పెంచుతుంది.
ఈ చిట్కాలు పాటించండి..
- గోళ్లను కత్తిరించి పొట్టిగా ఉంచడం.
- ఒత్తిడి లేదా అలసట కారణమైతే, దీన్ని పరిష్కరించే మార్గాలు అవలంబించాలి.
- చేదు రుచిగల పాలిష్ వాడటం మంచిది.
- కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (CBT) ఈ చికిత్స ద్వారా గోర్లు కొరకడాన్ని నియంత్రించడం సాధ్యం.
- మానసిక ఆలోచనల మార్పుతో ఈ అలవాటును తగ్గించుకోవచ్చు.
గోర్లను కొరకడం చిన్న సమస్యగా అనిపించినా, దీర్ఘకాలంలో అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఈ అలవాటును విడిచిపెట్టడం ఆరోగ్యకరమైన జీవనశైలికి తొలి మెట్టుగా మారుతుంది.