Salt consumption: ICMR నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ (NIE) పరిశోధకులు పంజాబ్, తెలంగాణలో మూడేళ్ల ఉప్పు తగ్గింపు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా కమ్యూనిటీ ఆధారిత ఆహార సలహా కార్యక్రమాల ద్వారా సోడియం తీసుకోవడం తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పనిచేస్తున్నారు. అధిక ఉప్పు వినియోగం అధిక రక్తపోటుకు ప్రధాన కారణం అవుతుందని NIE సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శరణ్ మురళి తెలిపారు. అయితే, తక్కువ సోడియం ఉప్పును మారడం వల్ల రక్తపోటు సగటున 7/4 mmHg తగ్గుతుందని ఆయన అన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. ఒక వ్యక్తి రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవాలి. ఇక పట్టణ ప్రాంతాల్లో నివసించే వారు కూడా సగటున రోజుకు దాదాపు 9.2 గ్రాముల ఉప్పు వినియోగిస్తున్నారు. ఇది సిఫారసు చేసిన పరిమితి కంటే రెట్టింపు అని చెప్పవచ్చు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో సగటు ఉప్పు వినియోగం 5.6 గ్రాములు. ఇది సురక్షిత స్థాయి కంటే ఎక్కువే.
Also Read: Nipah virus: నిపా వైరస్ కలకలం: కేరళలోని ఆరు జిల్లాల్లో హై అలర్ట్, ఇప్పటికే ఇద్దరు మృతి..!
అయితే, తక్కువ సోడియం ఉప్పు లభ్యత, ధర ప్రజలకు పెద్ద సవాలుగా ఉన్నాయి. చెన్నైలో 300 రిటైల్ దుకాణాల్లో నిర్వహించిన సర్వేలో తక్కువ సోడియం ఉప్పు లభ్యత కేవలం 28% దుకాణాల్లోనే అందుబాటులో ఉంది. 52% సూపర్ మార్కెట్లు దీనిని అందిస్తున్నప్పటికీ న్న కిరాణా దుకాణాలలో 4% మాత్రమే దీనిని విక్రయిస్తున్నాయి.
తక్కువ సోడియం ఉప్పు లభ్యత డిమాండ్ తక్కువగా ఉండటం వల్ల కావొచ్చని డాక్టర్ మురళి అన్నారు. ఈ సమస్యపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు NIE #PinchForAChange ట్యాగ్‌తో సోషల్ మీడియా అవగాహన ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారంలో భాగంగా, రోజువారీ ఆహారాలలో దాగి ఉన్న ఉప్పు గురించి ప్రజలకు అవగాహన కలిపిస్తూ, తక్కువ సోడియం ప్రత్యామ్నాయాల వాడకాన్ని
ప్రోత్సహిస్తుంది.


