Saturday, November 15, 2025
Homeహెల్త్Diabetes: మధుమేహ రోగులు పండ్లు ఇలా తిన్నారంటే షుగర్ లెవెల్స్ అదుపులో!

Diabetes: మధుమేహ రోగులు పండ్లు ఇలా తిన్నారంటే షుగర్ లెవెల్స్ అదుపులో!

Fruits For Diabetes: మధుమేహం తరచుగా దీర్ఘకాలికంగా ఉండే జబ్బు. వ్యాధి ముదరక ముందే నయం చేయకపోతే ప్రమాదకరమైన దీర్ఘకాలిక రోగాలకు దారితీస్తుంది. దీనికి ఎలాంటి చికిత్స ఉండదు. కేవలం అదుపులో ఉంచుకోవాలి. కావున షుగర్ లెవల్స్ అదుపులో ఉండాలంటే కొన్ని ఆహార పద్ధతులు మార్చుకోవాలి.

- Advertisement -

ఈ నేపథ్యంలో డయాబెటిస్ రోగులకు తరచుగా ఎదురయ్యే అతి పెద్ద ప్రశ్న ఏమిటంటే..?వారు పండ్లు తినవచ్చా లేదా అనేది? ఎందుకంటే అవి తియ్యగా ఉంటాయని, రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయని భావిస్తారు. ఇటువంటి పరిస్థితిలో, డయాబెటిస్ రోగులు పండ్లు తినడం ఎంత సురక్షితం! లేదా పండ్లు తినడం వారి రక్తంలో చక్కెర స్థాయిని ఎలా ప్రభావితం చేస్తుందో డైటీషియన్ శ్వేతా షా పంచల్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఒక వీడియోను షేర్ చేశారు. వీడియోలో సరైన విధంగా, సరైన సమయంలో, సరైన కలయికతో పండ్లు తింటే అవి రక్తంలో చక్కెర స్థాయిని పెంచే బదులు, అది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అని ఆమె చెప్పారు. ఇప్పుడు ఆమె వీడియోలో తెలిపిన కొన్ని అంశాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

పండ్లు తినడానికి సరైన మార్గం

దాల్చిన చెక్క వాడకం
మధుమేహ రోగులు ఏదైనా పండు తినడానికి ముందు దానిపై కొద్దిగా దాల్చిన చెక్క పొడిని చల్లుకోవాలని డైటీషియన్లు సిఫార్సు చేస్తున్నారు. దాల్చిన చెక్క రక్తంలో చక్కెర పెరుగుదలను తగ్గించడంలో సహాయపడుతుంది. అందువల్ల ఈ రోగులు తినే పండ్లపై కొద్దిగా దాల్చిన చెక్క పొడిని చల్లుకోవడం మంచిది. ఇది రుచిని పెంచడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

జ్యూస్ లకు దూరంగా
షుగర్ ఉన్నవారు పందరసం తాగడం మానుకోవాలి ఎందుకంటే జ్యూస్ తయారు చేయడం వల్ల దాని ఫైబర్ తగ్గుతుంది. అప్పుడు చక్కెర రక్తంలోకి త్వరగా చేరుతుంది. అందువల్ల డయాబెటిస్ రోగులు పండ్ల జ్యూస్ కాకుండా మంచిది.

Also Read:Uric acid : యూరిక్ యాసిడ్ యాతన వేధిస్తోందా..? ఈ ఇంటి చిట్కాలతో చెక్ పెట్టండి!

కాళీ కడుపుతో పండ్లు తినకూడదు
చాలామంది మధుమేహ రోగులు ఖాళీ కడుపుతో పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదని అనుకుంటారు. కానీ, ఖాళీ కడుపుతో తింటే రక్తంలో చక్కర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. డైటీషియన్ శ్వేతా ప్రకారం.. పండ్లు తినము ముందు కొంత ఆరోగ్యకరమైన కొవ్వు లేదా ప్రోటీన్ తినడం మంచిది. బాదం, వాల్ నట్స్, వంటి గింజలు తీసుకోవాలి. పండ్లు తినే ముందు చియా గింజలు అవిసె గింజలు లేదా చియ గింజల నీరు కూడా తాగవచ్చు. ఇలా పండ్లు తినేముందు వీటిని తీసుకోవడం ద్వారా చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

పెరుగుతో పండ్లు
షుగర్ లెవెల్స్ అదుపులో ఉండాలంటే పెరుగుతో పండ్లు తీసుకోవాలి. ఎందుకంటే పెరుగులో ఉండే ప్రోటీన్, ప్రోబయోటిక్స్ పండ్ల లో ఉండే చక్కెర ప్రభావాన్ని సమతుల్యం చేస్తాయి. అంతేకాకుండా పెరుగు జీర్ణ క్రియను కూడా మెరుగుపరుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో పెరుగుతో పండ్లను తీసుకోవడం ఎంతో మంచిది.

మధుమేహ రోగులు పండ్లు ఎప్పుడు తినాలి?

మధుమేహరోగులు పగటిపూట పండ్లు తినాలని డైటీషియన్ శ్వేత తెలిపింది. ముఖ్యంగా పండ్లను ఉదయం లేత సాయంత్రం స్నాక్ గా తీసుకోవచ్చు. అయితే ఒకేసారి ఎక్కువ పనులను తినకుండా ఉండడానికి ప్రయత్నించాలి.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad