Sunday, February 23, 2025
Homeహెల్త్Kidney : మీ బాడీలో ఈ లక్షణాలు కనిపిస్తే కిడ్నీ సమస్యే..!!

Kidney : మీ బాడీలో ఈ లక్షణాలు కనిపిస్తే కిడ్నీ సమస్యే..!!

మానవ శరీరంలో ఎంతో కీలకమైన కిడ్నీ(Kidney) లను జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. అయితే వేగంగా మారుతున్న జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు వల్ల మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఉంది. మూత్రపిండాల సంబంధిత సమస్యల్ని గుర్తించే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.

- Advertisement -

అందుకే కొన్ని సంకేతాల్ని గుర్తించడం చాలా ముఖ్యమంటారు వైద్యులు. మూత్రపిండాలు పాడై పోయినప్పుడు కొన్ని లక్షణాలు మన బాడీలో కనిపిస్తాయని చెబుతున్నారు. వాటిని సకాలంలో గుర్తిస్తే కిడ్నీలను కాపాడుకోవచ్చుని చెబుతున్నారు. అవేంటో చూడండి.

మూత్రంలో నురగలు రావడం
మూత్రంలో కొద్దిగా నురుగు రావడం సాధారణమే. కానీ అది సాధారణం కంటే ఎక్కువగా ఉంటే అది ప్రోటీన్ లీకేజీని సూచిస్తుంది. ఇది మూత్రపిండాలు దెబ్బతిన్నాయనడానికి సంకేతమని వైద్యులు తెలిపారు.

మూత్రం ముదురు రంగు
ముదురు గోధుమ రంగు మూత్రం కూడా ప్రమాద సంకేతం కావచ్చు. దీని అర్థం తీవ్రమైన మూత్రపిండ సమస్య ఉందని లేదా మూత్రంలో రక్తం ఉందని సూచిస్తుంది. అంటే మూత్రపిండాలు రక్తాన్ని ఫిల్టర్ చేయలేకపోతున్నాయని అర్థం.

మూత్రంలో రక్తస్రావం
మూత్రంలో రక్తస్రావం కావటమనేది సాధారణ లక్షణం కాదు. వెంటనే అప్రమత్తం అవ్వాలి. ఎందుకంటే ఇది ఇన్ఫెక్షన్. మూత్రపిండాల్లో రాళ్లు లేదా మూత్రపిండాల వ్యాధిని కూడా సూచిస్తుంది. పైన పేర్కొన్న లక్షణాలు తరచుగా కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.

రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జన
సాధారణంగా తరచుగా మూత్ర విసర్జన చేయడం షుగర్ కి సంకేతంగా పరిగణించబడుతుంది. అంతేకాకుండా రాత్రిపూట అప్పుడప్పుడు మూత్ర విసర్జన చేయడం సాధారణం. కానీ ఇది తరచుగా జరిగితే అది మూత్రపిండాల వైఫల్యానికి ముందస్తు సంకేతం కావచ్చు.

వాంతులు
మూత్రపిండాలు పని చేయనప్పుడు రక్తంలో విష పదార్థాల స్థాయిని పెంచడానికి కారణమవుతుంది. దీని వలన ఎటువంటి కారణం లేకుండా చాలా రోజుల పాటు వాంతులు అవుతాయని వైద్యులు తెలుపుతున్నారు.

దురద
చికిత్సకు స్పందించని తీవ్రమైన, నిరంతర దురద తరచుగా మూత్రపిండాల వైఫల్యం కారణంగా వస్తుందని వైద్యులు తెలుపుతున్నారు. శరీరంలో విషపదార్థాలు పేరుకుపోవడంతో ఇలా జరుగుతుందని చెబుతున్నారు.

అధిక రక్తపోటు
మూత్రపిండాలు చెడిపోవడం వల్ల శరీరంలో అధిక రక్తపోటుకు కారణమయ్యే రసాయనాలు విడుదలవుతాయి. దీని కారణంగా యువతలో అధిక రక్తపోటు సమస్య కనిపిస్తుంది. ఏ కారణం లేకుండా హై బీపీ వస్తుంటే జాగ్రత్త పడాలని వైద్యులు సూచిస్తున్నారు.

కాళ్ళు, ముఖంలో వాపు
కాళ్ళు, ముఖంలో వాపు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి. మూత్రపిండాలు శరీరంలో ఉన్న అదనపు నీటిని తొలగించలేనప్పుడు అది బాడీలో పేరుకుపోతుంది. దీంతో కాళ్ళలో వాపు, కళ్ల చుట్టూ వాపు కనిపిస్తుంది. కాబట్టి ఈ సమస్యలు మన బాడీలో ఉన్నట్లయితే వెంటేనే ప్రముఖ స్పెషలిస్టును కలిసి సరైన వైద్యం చేయించుకోండి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News