సాధారణంగా ఎవరైనా తీవ్ర అనారోగ్యానికి గురైతే.. వైద్యులు మొదట బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తారు. దీని బట్టి ఎలాంటి వ్యాధి సోకింది.. దాని లక్షణాలు ఏంటనేవి అంచనా వేస్తుంటారు. అయితే కొన్ని వ్యాధులకు మాత్రం రక్తంతో సంబంధం ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. సాధారణంగా 4 ప్రైమరీ బ్లడ్ గ్రూపులు ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. A, B, AB, O బ్లడ్ గ్రూప్స్‌లో వివిధ వ్యాధులకు సంబంధించిన సింప్టమ్స్ కనిపిస్తాయి. అయితే ఒక్కో బ్లడ్ గ్రూప్ రకం కలిగిన వారికి ఒక్కో డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుందట. మీకు ఏయే వ్యాధుల ముప్పు పొంచి ఉందో ఇప్పుడు చూద్దాం.
A బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తులు మంచి జీవనశైలిని లీడ్ చేయలేరని టైమ్స్ ఆఫ్ ఇండియా(TOI) రిపోర్ట్ చెబుతోంది. వీరికి హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి గుండె వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుందట. దీంతోపాటు గ్యాస్ట్రిక్ క్యాన్సర్, స్మాల్‌పాక్స్ వ్యాధులు జీవితంలో ఎప్పుడైనా అటాక్ చేసే ముప్పు పొంచి ఉందని రిపోర్టులో తెలిపింది.ఇక బ్లడ్ గ్రూప్ B కలిగిన వ్యక్తుల్లో ఎక్కువగా టైప్ 2 డయాబెటిస్ వ్యాధి ముప్పు పొంచి ఉంటుంది. ఊబకాయం సమస్య వీరిని ఎక్కువగా వేధించొచ్చు. ఆటో ఇమ్యూన్ వ్యాధితో కూడా వీరు సఫర్ అవుతారట. వీరికి స్క్లెరోసిస్ అనే నాడీ సంబంధిత దీర్ఘకాలిక వ్యాధి రిస్క్ కూడా ఉంటుంది. మెదడు, వెన్నుపాముపై ఆటోఇమ్యూనిటీ అటాక్ చేసి కేంద్రీయ నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.
AB బ్లడ్ గ్రూప్ ఉన్నవారిలో ఎక్కువగా మెమొరీ సంబంధిత సమస్యలు వస్తాయట. వయసు పెరగక ముందే వీరిలో మెమరీ పవర్ బలహీనంగా మారుతుంది. మెదడుకు రక్త సరఫరా తగ్గిపోవడం దీనికి ప్రధాన కారణమై ఉండొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక సాధారణంగా O బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తులు హెల్తీగా ఉంటారు. అయితే వీరికి కూడా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందట. ముఖ్యంగా రక్త సంబంధిత సమస్యలు వస్తాయట. ఫలితంగా, గుండె సంబంధిత వ్యాధుల రిస్క్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తుల్లో పెప్టిక్ అల్సర్ సమస్యలు రావొచ్చు.
బ్లడ్ టైప్‌ని బట్టి బయోలాజికల్ ప్రాసెస్ ఆధారపడి ఉంటుంది. బ్లడ్ గ్రూప్‌లో ఉండే యాంటిజెన్.. ఇన్‌ఫెక్షన్, ఇన్‌ఫ్లమేషన్, రక్తం గడ్డకట్టడం వంటి సమాచారాన్ని అందించి ఇమ్యూనిటీ సిస్టమ్‌ను అలర్ట్ చేస్తుంది. ప్రతి బ్లడ్ గ్రూప్‌లో యాంటిజెన్ కామన్‌గా ఉంటుంది కాబట్టి అన్ని బ్లడ్ గ్రూప్‌లు ఒకే రకంగా రెస్పాండ్ అవుతాయి. అయితే బ్లడ్ గ్రూప్‌లు శరీరంలో రాబోయే వ్యాధుల లక్షణాలను సూచిస్తాయే తప్ప నేరుగా ఎలాంటి వ్యాధులకు లింక్ అయి ఉండవు. A బ్లడ్ గ్రూప్ ఉన్నవారిలో రక్తం గడ్డకట్టడానికి సహకరించే విల్లెబ్రాండ్ అనే ప్రొటీన్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా, వీరికి రక్తం త్వరగా గడ్డకడుతుంది. అయితే బ్లడ్ క్లాటింగ్ తీవ్రమై గుండెపోటు, స్ట్రోక్ రిస్క్ పెరుగుతుంది. అదే O బ్లడ్ గ్రూపు వారిలో విల్లెబ్రాండ్ తక్కువగా ఉండి హార్ట్ ఎటాక్ రిస్క్ తక్కువగా ఉంటుంది. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించడం లేదు.)