శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే పదార్థాలు కొన్ని ఉన్నాయి. వాటిని నిత్యం తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా,బలంగా ఉంటుంది. అవి…
పసుపు కలిపిన పాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. గోరువెచ్చని పాలల్లో పసుపు వేసుకుని తాగడం వల్ల జలుబు, దగ్గు తగ్గుతాయి. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
లవంగాల వల్ల జలుబు, దగ్గు తగ్గడమే కాదు ఇన్ఫెక్షన్లు దరిచేరవు. ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. అంతేకాదు వీటిల్లోని యాంటాక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతం చేస్తాయి.
తులసి, అల్లం మిశ్రమం తీసుకోవడం వల్ల దగ్గు, తలనొప్పి, జలుబు, జ్వరం తగ్గుతాయి.
దాల్చిన చెక్క కూడా శరీరంలో రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది. ఇందులోని యాంటాక్సిడెంట్లు, యాంటీబాక్టీరియల్ గుణాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు కాల్షియం, ఫాస్ఫరస్, ఫైబర్, ఆర్సెనిక్ లు కూడా ఉంటాయి. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే ప్రతిరోజూ ఒక ఆమ్లా తింటే రోగాలు దరిచేరవు. అందుకే ప్రతి రోజూ ఒక ఉసిరి తినాలి.
చేపనూనె, ఆకుకూరలు, నట్స్, మసాలా, రకరకాల సీడ్స్, సిట్రస్ పళ్లు, గుడ్లు, పెరుగు వంటివి కూడా శరీరంలో రోగనిరోధకశక్తిని బాగా పెంచుతాయి.
వెల్లుల్లి, అల్లం కూడా శరీరంలో ఇమ్యూనిటీని బాగా పెంచుతాయి.
పాలకూరలో సి విటమిన్ తో పాటు యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్లపై బలంగా పోరాడి రోగనిరోధకశక్తిని బలోపేతం చేస్తాయి.
బాదం, సన్ ఫ్లవర్ విత్తనాలలో యాంటాక్సిడెంట్లు, పోషకాలు పుష్కలంగా ఉండి శరీరంలో రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. బొప్పాయిలో సి విటమిన్ ఉంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
గ్రీన్ టీ, బ్లాక్ టీలలో యాంటాక్సిడెంట్లు బాగా ఉండి రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి.