Saturday, November 15, 2025
Homeహెల్త్Iron Deficiency: బాడీలో ఐరన్ తగ్గుతుందని మీ చేతులే చెబుతాయి..!

Iron Deficiency: బాడీలో ఐరన్ తగ్గుతుందని మీ చేతులే చెబుతాయి..!

Iron Deficiency VS Hands:ఆరోగ్యం కాపాడుకోవాలంటే శరీరానికి అవసరమైన పోషకాలు సమతుల్యం కావాలి. అందులో ఐరన్ చాలా కీలకం. ఇది శరీరంలో తగ్గిపోతే అనేక సమస్యలు వస్తాయి. ఐరన్ సరిపడా లభించకపోతే రక్తహీనత అనే పరిస్థితి ఏర్పడుతుంది. రక్తహీనత అంటే శరీరానికి తగినంత ఆరోగ్యకరమైన ఎర్ర రక్తకణాలు లేవు అనే అర్థం. వీటి లోపం వల్ల శరీర అవయవాలకు ఆక్సిజన్ సరఫరా సరిగా జరగదు. ఈ కారణంగా అనేక రకాల లక్షణాలు బయటపడతాయి. ముఖ్యంగా చేతులు, కాళ్లు మన శరీరంలో ఐరన్ స్థాయిలను సూచించే సంకేతాలు ఇస్తాయి.

- Advertisement -

ఐరన్ అనే ఖనిజం మన రక్తంలో ఉండే హిమోగ్లోబిన్‌లో ప్రధాన భాగం. హిమోగ్లోబిన్ లేకపోతే ఊపిరితిత్తుల నుంచి వచ్చే ఆక్సిజన్ శరీరంలోని ప్రతి కణానికి చేరదు. శరీరానికి కావలసినంత ఐరన్ లేకపోతే బలహీనత, అలసట, చర్మం మసకబారడం వంటి సమస్యలు రావచ్చు. చాలా సందర్భాల్లో ఈ మార్పులు ముందుగానే మన చేతుల్లో, గోళ్లలో కనిపిస్తాయి.

చేతులు, గోళ్లలో కనిపించే సంకేతాలు

ఐరన్ తక్కువగా ఉంటే గోర్లు బలహీనంగా మారుతాయి. సాధారణంగా గోర్లు దృఢంగా, మెత్తగా ఉండాలి. కానీ ఐరన్ లోపం ఉన్నప్పుడు అవి సన్నగా, సులభంగా విరిగిపోయేలా మారుతాయి. కొందరిలో గోళ్ల ఆకారం కూడా మారుతుంది. ఇవి నిర్లక్ష్యం చేయకూడని లక్షణాలు.

చర్మరంగులో మార్పు కూడా ఒక ముఖ్యమైన సూచన. ఐరన్ లోపం వల్ల హిమోగ్లోబిన్ తగ్గిపోతే చర్మానికి సహజమైన రంగు తగ్గిపోతుంది. ముఖ్యంగా అరచేతులు, గోళ్లు పసుపు లేదా తెల్లగా మారుతాయి. ఎర్రటి కాంతి తగ్గిపోతే వైద్యుడిని సంప్రదించడం అవసరం.

ఐరన్ లోపం కారణంగా చేతులు, కాళ్లు చల్లగా అనిపించవచ్చు. శరీరానికి తగినంత ఆక్సిజన్ అందకపోవడం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. ఫలితంగా చేతులు, కాళ్లు తరచుగా చల్లగా అనిపిస్తాయి.

Also Read:https://teluguprabha.net/health-fitness/fig-water-benefits-for-weight-loss-and-health/

కొన్ని సందర్భాల్లో చేతులు తిమ్మిరిగా, గరుకుగా అనిపించడం లేదా ఆకస్మికంగా జలదరింపు రావడం కూడా జరుగుతుంది. ఇవి రక్తంలో ఐరన్ తక్కువగా ఉన్నదనానికి సంకేతాలు కావచ్చు.

ఇతర లక్షణాలు

చర్మం, పెదవులు, కనురెప్పల లోపలి భాగం రంగు తగ్గడం కూడా రక్తహీనత లక్షణాల్లో ఒకటి. తక్కువ శ్రమ చేసినా శ్వాస ఆడకపోవడం, అలసట త్వరగా రావడం, తల తిరగడం, తలనొప్పి రావడం కూడా జరుగుతుంది. జుట్టు పొడిబారి ఊడిపోవడం, తరచుగా ఇన్ఫెక్షన్లు రావడం కూడా ఐరన్ లోపం వల్ల కావచ్చు.

ఐరన్ లోపం తగ్గించడానికి ఉపయోగపడే ఆహారాలు

ఐరన్ లోపాన్ని తగ్గించడానికి ఆహారపరమైన మార్పులు చాలా ఉపయోగపడతాయి. పాలకూర, బీట్‌రూట్, దానిమ్మ, వేరుశనగ, నువ్వులు, పప్పులు వంటి ఆహారాలు శరీరానికి కావలసిన ఐరన్ అందిస్తాయి.

పాలకూరలో ఐరన్‌తో పాటు విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది ఐరన్ శోషణను మెరుగుపరుస్తుంది. పాలకూరను కూరగా, సూప్ లేదా స్మూతీ రూపంలో తీసుకోవచ్చు.

బీట్‌రూట్ రక్తపోటును నియంత్రించడమే కాకుండా ఐరన్, ఫోలేట్, యాంటీఆక్సిడెంట్లతో నిండుగా ఉంటుంది. దీన్ని రసం, సలాడ్ లేదా కూరల రూపంలో తినవచ్చు.

దానిమ్మ రక్తాన్ని పెంచడంలో సహాయపడుతుంది. ఇందులో ఉన్న ఐరన్, విటమిన్ సి కలయిక హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. ప్రతిరోజూ ఒక కప్పు దానిమ్మ గింజలు తినడం లేదా దాని రసం తాగడం మంచిది.

Also Read:https://teluguprabha.net/health-fitness/drinking-excess-water-may-lead-to-hyponatremia-risk/

వేరుశనగలు, నువ్వులు కూడా ఐరన్ మంచి మూలాలు. వీటిని లడ్డూల రూపంలో లేదా వేయించి తినవచ్చు. నువ్వుల నూనెతో మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు.

పప్పుధాన్యాలు కూడా ఐరన్ సమృద్ధిగా కలిగినవే. కిడ్నీ బీన్స్, సోయాబీన్స్, చిక్‌పీస్ వంటి వాటిని ఆహారంలో చేర్చడం వల్ల శరీరానికి తగినంత ఐరన్ లభిస్తుంది.

జాగ్రత్తలు

ఐరన్ లోపం లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయరాదు. వైద్యుడిని సంప్రదించి రక్తపరీక్షలు చేయించుకోవడం అవసరం. సమస్య తీవ్రతను బట్టి వైద్యులు మందులు లేదా సప్లిమెంట్లు సూచిస్తారు.

ఆహారపు అలవాట్లలో మార్పులు చేస్తూ, సమతుల్యమైన ఆహారం తీసుకోవడం ద్వారా రక్తహీనతను అధిగమించవచ్చు. ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలను ప్రతిరోజూ చేర్చుకోవడం వల్ల ఈ లోపం నుంచి దూరంగా ఉండవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad