Friday, September 20, 2024
Homeహెల్త్Is Dark chocolate healthy?: డార్క్ చాక్లెట్ ఆరోగ్యానికి మంచిదా?

Is Dark chocolate healthy?: డార్క్ చాక్లెట్ ఆరోగ్యానికి మంచిదా?

డార్క్ చాక్లెట్స్ అతిగా తింటే సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు

డార్క్ చాక్లెట్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఇటీవల చేసిన కొన్ని శాస్త్రీయ అధ్యయనాల్లో వెల్లడైంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు బ్రెయిన్ పనితీరును కూడా డార్క్ చాక్లెట్ బాగా మెరుగుపరుస్తుందని ఈ అధ్యయనాల్లో తేలింది. అయితే దీన్ని అతిగా తింటే ఆరోగ్యానికి మంచిది కాదని కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
డార్కు చాక్లెట్ లో శక్తివంతమైన యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. కోకో ఎక్కువగా ఉండే ఈ సూపర్ ఫుడ్ మూడ్ ఎన్ హాన్సర్ అని పరిశోధకులు చెప్తున్నారు. యాంగ్జయిటీ, ఒత్తిడి సమస్యలను కూడా ఇది నివారిస్తుందిట. అయితే డార్కు చాక్లెట్ లో కాలరీలు, ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పరిమిత ప్రమాణంలో మాత్రమే దీన్ని తినాలని చెప్తున్నారు. ఎక్కువ ప్రమాణంలో దీన్ని తీసుకోవడం వల్ల బ్లీడింగ్ డిజార్డర్ తలెత్తే అవకాశం ఉంది. గుండె వేగంగా కొట్టుకోవడం, మలబద్దకం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే ఇది రక్తపోటును తగ్గిస్తుందంటున్నారు. ఇందులోని ఫ్లెవనాయిడ్స్ అధికరక్తపోటును నియంత్రించడంతోపాటు కార్డియోవాస్క్యులర్ సమస్యలు తలెత్తకుండా చూస్తాయి. గుండె జబ్బుల బారిన కూడా పడరని అధ్యయనాల్లో వెల్లడైంది.

- Advertisement -

అయితే డార్కు చాక్లెట్ ను ఎంత పరిమాణంలో తినాలన్న విషయంలో వైద్యుల సలహాలను తప్పనిసరిగా
తీసుకోవాలని అధ్యయనాలు చెప్తున్నాయి. డార్కు చాక్లెట్ లో మోనో అన్ శాచ్యురేటెడ్ యాసిడ్స్ ఉంటాయి. ఇవి జీర్ణక్రియ బాగా జరిగేట్టు చేస్తాయి. కాలరీలను కరిగిస్తాయి. బరువును తగ్గిస్తాయి. క్వాలిటీతో కూడిన డార్కు చాక్లెట్ లో ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. తగినన్ని పీచుపదార్థాలు, ఖనిజాలు ఉంటాయి. ఇందులో ఆర్గానిక్ కాంపౌండ్లు బాగా ఉండి మంచి యాంటాక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఒక అధ్యయనం ప్రకారం బాదం, కోకోలాంటి ఫుడ్స్ తో కలిపి తింటే డార్కు చాక్లెట్ లోని పోలీఫెనోల్స్ కొన్ని రకాల చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించే అవకాశాలున్నాయని తేలింది. కోకోడార్కు చాక్లెట్ లో రకరకాలైన శక్తివంతమైన యాంటాక్సిడెంట్లు ఉన్నాయి. మరికొన్ని అధ్యయనాల్లో తగినంత పరిమాణంలో డార్కు చాక్లెట్ తింటున్న వారిలో గుండె జబ్బుల రిస్కు తగ్గినట్టు వెల్లడైంది. డార్కు చాక్లెట్ లోని బయోయాక్టివ్
కాంపౌండ్లు చర్మ ఆరోగ్యాన్ని కూడా సంరక్షిస్తాయి. కోకోలోని ఫ్లెవనాల్స్ సూర్యరశ్మి వల్ల తలెత్తే దుష్ఫలితాల నుంచి రక్షిస్తాయి. చర్మ సాంద్రతతో పాటు హైడ్రేషన్ ను కూడా పెంచుతుంది. చర్మానికి రక్తప్రసరణ బాగా జరిగేట్టు చూస్తుంది.


కోకో లోని ఫ్లెవనాయిడ్స్ సీనియర్ సిటిజన్స్ లో తలెత్తే తేలికపాటి కాగ్నిటివ్ సమస్యలను నియంత్రించడమే కాకుండా డెమెన్షియా వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. మెదడుకు రక్తప్రవాహం బాగా జరిగేట్టు చేసి మెదడు శక్తివంతంగా పనిచేసేలా తోడ్పడుతుంది. 70 శాతం కోకో ఉండే క్వాలిటీ డార్కు చాక్లెట్ ను మాత్రమే తినాలని నిపుణులు చెప్తున్నారు. మార్కెట్ లో దొరికే డార్కు చాక్లెట్ అన్నింటిలో పోషకాలు ఉండవని కూడా కొన్ని అధ్యయనాల్లో పేర్కొన్నారు. డార్కు చాక్లెట్ ను మితిమీరి తింటే మలబద్దకం తలెత్తే అవకాశం ఉంది. ఇందులోని కెఫైన్, బెటాఫినైలెథిలమైన్ ల వల్ల తలనొప్పి వచ్చే అవకాశం కూడా ఉందని వైద్యులు అంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News