Saturday, November 15, 2025
Homeహెల్త్Health: షుగర్ ఉన్నా తేనె తింటున్నారా..? అయితే..!

Health: షుగర్ ఉన్నా తేనె తింటున్నారా..? అయితే..!

Diabetes VS Honey:డయాబెటిస్ అనే వ్యాధి నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా వస్తున్న వాటిలో ఇది ఒకటి. ఇది శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి సాధారణ స్థాయిని మించి పెరగడం వల్ల ఏర్పడే పరిస్థితి. ప్రస్తుత జీవనశైలిలో ఫాస్ట్‌ఫుడ్ అలవాట్లు, ఒత్తిడి, వ్యాయామం లేని జీవనం వంటి అంశాలు ఈ సమస్యకు ప్రధాన కారణాలు. మధుమేహం ఉన్నవారు తాము తీసుకునే ఆహారంలో ఏమి తినాలి, ఏది వద్దనేది కచ్చితంగా తెలుసుకోవాలి.

- Advertisement -

తేనె వాడటం..

చక్కెర స్థానంలో తేనె వాడటం ఆరోగ్యానికి మంచిదని కొంతమంది భావిస్తారు. కాఫీ, టీ లేదా పానీయాలలో తేనెను యాడ్‌ చేయడం సహజమని అనుకునే వారు కూడా ఉన్నారు. కానీ డయాబెటిస్ ఉన్నవారికి ఇది నిజంగా సురక్షితమా అనే ప్రశ్నకు వైద్య నిపుణులు సమాధానం చెబుతున్నారు.

Also Read: https://teluguprabha.net/devotional-news/vastu-rules-for-bedroom-items-to-avoid-for-peace-and-positivity/

యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి..

తేనె సహజమైన తీపి పదార్థం. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, ఫోలేట్‌ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కణాలను దెబ్బతినకుండా కాపాడడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడతాయి. అయితే, తేనెలో కూడా చక్కెర మరియు కార్బోహైడ్రేట్‌లు ఉంటాయి. అందుకే దీన్ని ఎంతమేర తీసుకోవాలో జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి.

మధుమేహ రోగులు…

వైద్యుల ప్రకారం, తేనె రక్తంలో చక్కెర స్థాయిపై తెల్ల చక్కెర కంటే తక్కువ ప్రభావం చూపుతుంది. అంటే ఇది చక్కెరకు ఉన్నంత వేగంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచదు. అందువల్ల, కొంతమంది వైద్యులు మధుమేహ రోగులు తేనెను పరిమిత పరిమాణంలో తీసుకోవచ్చని సూచిస్తున్నారు. కానీ ఇది ప్రతి ఒక్కరికీ సరిగ్గా సరిపోదు. వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని బట్టి తేనె వాడకంపై వైద్యుడి సలహా తీసుకోవడం తప్పనిసరి.

Also Read:https://teluguprabha.net/devotional-news/gajakesari-rajayoga-on-october-12-brings-luck-for-three-zodiac-signs/

తేనె సాధారణ చక్కెర కంటే ఎక్కువ తియ్యగా ఉంటుంది. కాబట్టి ఒక చెంచా తేనెతోనే తీపి రుచి వస్తుంది. దీనిని ఎక్కువగా వాడితే రక్త చక్కెర స్థాయి మళ్లీ పెరిగే అవకాశం ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్ ఇప్పటికే ఎక్కువగా ఉన్నవారు తేనెను పూర్తిగా దూరంగా ఉంచడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

నకిలీ ఉత్పత్తులు..

మార్కెట్లో లభించే తేనెల్లో కొన్ని నకిలీ ఉత్పత్తులు కూడా ఉంటాయి. వాటిలో చక్కెర సిరప్ కలిపి అమ్మే అవకాశముంది. అలాంటి తేనె మధుమేహ రోగులకు మరింత హానికరం. కాబట్టి తేనె కొనుగోలు చేసేప్పుడు దాని నాణ్యత, బ్రాండ్‌ విశ్వసనీయతను పరిశీలించడం అవసరం. స్వచ్ఛమైన సహజ తేనెనే వాడాలి.

డయాబెటిస్ ఉన్న వారికి..

తేనెను పరిమితంగా వాడితే డయాబెటిస్ ఉన్న వారికి కొంత ప్రయోజనం ఉంటుంది. తేనెలో ఉండే సహజ ఎంజైములు ఇన్సులిన్‌ క్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. దీంతో రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించే సామర్థ్యం పెరుగుతుంది.

యాంటీఆక్సిడెంట్లను ..

తేనె శరీరానికి యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది. ఇవి శరీరంలోని వాపును తగ్గించడంలో, గుండె సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి.

ఉదయం ఖాళీ కడుపుతో లేదా రాత్రి భోజనం..

డయాబెటిస్ ఉన్నవారు ఉదయం ఖాళీ కడుపుతో లేదా రాత్రి భోజనం తరువాత తేనె తీసుకోవడం నివారించాలి. ఎందుకంటే ఆ సమయంలో గ్లూకోజ్ స్థాయిలు వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. తేనె తీసుకునే సమయం, పరిమాణం గురించి వైద్యుడి సలహా తప్పనిసరిగా పాటించాలి.

Also Read: https://teluguprabha.net/devotional-news/importance-of-lighting-lamp-near-tulasi-in-kartika-month/

కొంతమంది తేనెతో వేడి నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదని అనుకుంటారు. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది. కానీ డయాబెటిస్ రోగులు ఈ అలవాటును కూడా జాగ్రత్తగా పాటించాలి. తేనెను రోజూ తీసుకోవడం కన్నా, వారంలో ఒకటి రెండు సార్లు మాత్రమే పరిమితంగా వాడటం మంచిది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad