చలికాలంలో స్వెటర్ లేకుండా ఒక్క నిమిషం కుడా ఉండలేము. ఇంట్లో అయినా బయట అయినా కచ్చితంగా స్వెటర్ ఉండాల్సిందే. మరి స్వెటర్ వేసుకుని నిద్రపోవచ్చా.. కొందరు రాత్రుళ్లు స్వెటర్ వేసుకుని నిద్రపోతారు. అయితే నిపుణులు ఇలా చేయడం ఆరోగ్యానికి హానికరం అని చెప్తున్నారు. స్వెటర్ బిగువుగా మారి రక్తప్రసరణను దెబ్బతీయడం వల్ల వివిధ సమస్యలు సంభవిస్తాయట.
రక్త ప్రసరణ సమస్యలు: స్వెటర్ బిగువుగా ఉండటం వల్ల రక్తప్రసరణపై ప్రభావం పడుతుంది. ఉదయం లేచేసరికి చేతులు, కాళ్ళలో తిమ్మిరి, ఘర్షణ సమస్యలు కనిపించవచ్చు. ఇవి శరీరానికి కావలసిన ఆక్సిజన్ సరఫరాను తగ్గిస్తాయి.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు: స్వెటర్ ధరించి నిద్ర పోతే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. శ్వాస నెమ్మదిగా తీసుకోవడం కష్టంగా మారవచ్చు.
శరీర ఉష్ణోగ్రత పెరగడం: స్వెటర్ ధరిస్తే శరీర ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. ఈ అధిక ఉష్ణోగ్రత దురద, దద్దుర్లను కలుగచేస్తుంది. ఇది నిద్రకు అంతరాయం కలిగించే మరో ప్రధాన కారణం.
నిద్రకు భంగం: అనేక రాత్రుల పాటు ఇలా స్వెటర్ ధరించి నిద్రపోవడం వల్ల, నిద్రకు అంతరాయం కలుగుతుంది. ఇది శరీరానికి అవసరమైన విశ్రాంతి కోసం ప్రతికూలంగా పనిచేస్తుంది.
రాత్రి నిద్ర కోసం తేలికైన దుస్తులు ధరించడం మంచిది. ఇది శరీరాన్ని సరైన ఉష్ణోగ్రతలో ఉంచుతుంది అలాగే నిద్రకు సహాయపడుతుంది.
చర్మ సమస్యలు: స్వెటర్ ధరించడంతో శరీరంలో అంగాంగాల్లో నడిచే గాలికి అవాంతరాలు వస్తాయి. దీనితో, శరీరంలోని చెమట, మురికి, చర్మ సమస్యలు, దద్దుర్లు, దురదలు, చర్మ దెబ్బలు వచ్చే అవకాశం ఉంటాయి.