Wednesday, February 11, 2026
Homeహెల్త్mint leaves: రోజు ఈ ఆకులు తింటే బరువు తగ్గడం ఖాయం..!

mint leaves: రోజు ఈ ఆకులు తింటే బరువు తగ్గడం ఖాయం..!

mint leaves benefits for weight loss: ప్రస్తుతం మారిన జీవనశైలి కారణంగా చాలా మంది అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడం కోసం జీమ్, డైట్ ప్లాన్ వంటివి చేస్తున్నారు. అయితే దీని వల్ల తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలుగుతుంది తప్ప ఎలాంటి శాశ్వత పరిష్కారం ఉండదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారు ఇంట్లోనే లభించే కొన్ని ఆహార పదార్థాలను ఉపయోగించడం వల్ల సులభంగా, ఆరోగ్యకరంగా బరువు తగ్గవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పుదీనా (Mint)లో ఉండే ఆరోగ్య లక్షణాలు జీవక్రియను మెరుగుపరచి, అనవసర కొవ్వును కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అధ్యయనాలు ధృవీకరిస్తున్నాయి.

- Advertisement -

పుదీనా బరువు తగ్గడానికి ఎలా సహాయపడుతుంది?

పుదీనా ఆకులు సువాసు వెదజలడమే కాకుండా ఇందులో కేలరీలు అతి తక్కువగా ఉంటాయి. దీని తినడం వల్ల బరువు పెరగకుండా ఉంటారు. ఇందులో ఉండే మెంథాల్‌ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. ముఖ్యంగా పుదీనాలో ఉండే రిఫ్రెష్‌ వాసన ఆకలి కోరికలను తగ్గిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా పుదీనాలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఉండే విషపదార్థాలను తొలగిస్తాయి దీంతో పాటు ఉబ్బరం నుంచి ఉపశహనం కలుగుతుంది.

ALSO READ: https://teluguprabha.net/health-fitness/who-should-avoid-fenugreek-water-health-risks-explained/

ఆరోగ్య నిపుణుల ప్రకారం ఒత్తిడి (Stress), ఆందోళన (Anxiety) కారణంగా కూడా అధిక బరువు పెరిగే అవకాశం ఉంది. ఈ సమస్యలను తగ్గించడంలో పుదీనా సహాయపడుతుంది. పుదీనాలో ఉండే కొన్ని ఆరోగ్యకరమైన పదార్థాలు ఒత్తిడిని నియంత్రించడంలో తోడ్పడతాయి. దీని వల్ల బరువు పెరగకుండా ఉంటారు. కార్టిసాల్ బరువును పెంచడంలో అలాగే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది. పుదీనాను ఆహారంలో చేర్చుకోవడం వల్ల కార్టిసాల్‌ ప్రభావం తగ్గిస్తుంది.

పుదీనాను ఆహారంలో ఎలా చేర్చుకోవాలి:

1. పుదీనా వాటర్ : ప్రతిరోజు ఉదయం పుదీనా నీళ్లు తాగడం వల్ల సులువుగా బరువు తగ్గుతారు అలాగే జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ పుదీనా వాటర్‌ తయారు చేయడం ఎంతో సులభం. కొన్ని పుదీనా ఆకులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం ఆ నీటిని తాగవచ్చు.

2. పుదీనా మజ్జిగ: ప్రతిరోజు భోజనం చేసిన తరువాత పుదీనా మజ్జిగ తాగడం శరీరానికి మంచిది. ఇది జీర్ణవ్యవస్థను చల్లబరుస్తుంది, గ్యాస్‌ నుంచి ఉపశమనం కలిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆరోగ్యకరమైన ప్రేగు కదలికలకు సహాయపడుతుంది. ముందుగా ఒక కప్పు మజ్జిగ తీసుకోవాలి. అందులోకొన్ని పుదీనా ఆకులు, అల్లం, ఉప్పు వేసి మిక్సీ చేయండి. దీని భోజనం తరువాత తాగడం మంచిది.

ALSO READ: https://teluguprabha.net/health-fitness/best-breakfast-foods-for-healthy-weight-loss/

3. పుదీనా గ్రీన్ టీ: బరువు తగ్గించడంలో గ్రీన్ టీ సహాయపడుతుంది. ప్రతిరోజు పుదీనా టీ తాగడం వల్ల కొవ్వును కరుగుతుంది. అంతేకాకుండా జీర్ణక్రియకు సహాయపడుతుంది. దీని తయారు చేసుకోవడం ఎంతో సులభం. ముందుగా ఒక కప్పు వేడి నీటిలో గ్రీన్ టీ బ్యాగ్ వేసుకోవాలి. అందులోకి 5 పుదీనా ఆకులను వేసి 5 నిమిషాలు ఉంచండి. పుదీనా గ్రీన్‌ టీ తయారు అవుతుంది. రోజుకు 1-2 సార్లు తాగితే ఆరోగ్యానికి మంచిది.

4. పుదీనా సలాడ్: పుదీనాని ప్రతిరోజు సలాడ్స్‌లో కూడా తీసుకోవచ్చు. ఇందులో తక్కువ కేలరీలు ఉండటం వల్ల బరువు పెరగకుండా ఉంటారు. దీని తయారు చేసుకోవడం ఎంతో సులభం. ఒక గిన్నెలో పుదీనా ఆకులు, దోసకాయ, ఉల్లిపాయ, టమాటా ముక్కలుగా చేసుకోవాలి. వాటిపై నిమ్మరసం, నూనె, మిరియాల పొడి, ఉప్పు చల్లండి.వీటిని బాగా కలపండి.

గమనిక: బరువు తగ్గడంలో పుదీనా మేలు చేస్తుంది కానీ దీనిపై ఆధారపడకుండా సమతుల్య ఆహారం, శారీరక శ్రమను అల్లవాటు చేసుకోవడం మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News