Jamun seeds powder Benefits: నేరేడు పండును చాలా మంది ఇష్టంగా తింటారు. దాదాపు అన్ని కాలాల్లో లభించే ఈ పండు ముదురు ఊదా రంగులో తీపి పుల్లని రుచిలో ఉంటుంది. చూడటానికి ఆకర్షనీయంగా కనిపించే ఈ పండులో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అయితే, చాలా మంది నేరేడు పండు తిన్న తర్వాత దాని గింజలను పారేస్తారు. కానీ, ఈ గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే విషయాన్ని గ్రహించరు. నేరేడు గింజల పొడిని ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వలన జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతుంది. ఇలా నేరేడు పండుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ అద్భుతమైన గింజల పొడితో కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గించడంలో సహాయం..
నేరేడు గింజల పొడి రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ఇందులో జాములిన్, ఆల్కలాయిడ్స్ వంటి సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి రక్తంలో షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేసి, ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తాయి. అందుకే ఇది మధుమేహ రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా జీర్ణ సమస్యలతో బాధపడేవారికి నేరేడు గింజల పొడి ఉపశమనం కలిగిస్తుంది. దీనిలోని అస్ట్రింజెంట్ లక్షణాలు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. త్వరగా ఆహారం జీర్ణమయ్యేలా పనిచేస్తాయి. ఖాళీ కడుపుతో దీన్ని తీసుకోవడం వల్ల ఉబ్బరం ఎసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మొటిమలు, మచ్చల నివారణకు సరైన జౌషధం..
నేరేడులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబయల్ గుణాలు పుష్కలంగా లభిస్తాయి. హెల్త్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇవి శరీరానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ కల్పిస్తాయిని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ దీని పొడిని తీసుకోవడం ద్వారా వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని సలహా ఇస్తున్నారు. నేరేడు గింజల పొడిలో అధిక ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల త్వరగా ఆకలి వేయకుండా కాపాడుతుంది. కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. ఇది కొవ్వు జీవక్రియకు సహాయపడి, కొవ్వు నిల్వను తగ్గిస్తుంది. దీని యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు చర్మానికి మేలు చేస్తాయి. మొటిమలు, మచ్చలు, పిగ్మెంటేషన్ వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. ఈ పొడిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ మొహంలో వృద్ధాప్య ఛాయలు కనిపించవు. ఎల్లప్పుడూ తేజోమంతంతో మెరుస్తూ ఉంటారు. ఆరోగ్యకరమైన, కాంతివంతమైన చర్మం కోసం దీనిని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.


