Monday, November 25, 2024
Homeహెల్త్Japanese drink to burn fat: ఫ్యాట్ ను కరిగించే జపాన్ డ్రింకు

Japanese drink to burn fat: ఫ్యాట్ ను కరిగించే జపాన్ డ్రింకు

జీర్ణశక్తిని పెంచి, బరువును తగ్గించి, హెల్తీగా చేసే ..

జపనీస్ వాటర్ డ్రింకుతో పొట్టచుట్టూ, వెనుక భాగంలో, తొడల్లో పేరుకున్న కొవ్వు కరుగుతుందట. ఇది ఆరోగ్యవంతమైన డ్రింకు కూడా అని అంటున్నారు పోషకాహార నిపుణులు. అంతేకాదు బరువు కూడా బాగా తగ్గుతారట. నిత్యం ఈ డ్రింకును తాగితే శరీరానికి ఎంతో బలం కూడా అని చెప్తున్నారు నిపుణులు. ఈ డ్రింకులో ఉపయోగించే పదార్థాలు శరీరానికి అందించే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయని వీరంటున్నారు. ఈ డ్రింకులో ఉపయోగించే నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఎంతో శక్తివంతమైన యాంటాక్సిడెంట్. నిమ్మ గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. అంతేకాదు జీర్ణశక్తిని కూడా పెంపొందిస్తుంది. వాటితో పాటు బరువును తగ్గిస్తుంది. కొలస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ఇందులో ఉపయోగించే మరో పదార్థం అల్లం. ఇందులో ఎంతో శక్తివంతమైన పోషకాలు ఉన్నాయి. అల్లం బ్లడ్ షుగర్ ప్రమాణాలను తగ్గిస్తుంది. గుండెజబ్బుల పాలబడకుండా నిరోధిస్తుంది. అజీర్తి వంటి సమస్యలకు కూడా చక్కటి పరిష్కారంగా పనిచేస్తుంది. చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడంతో పాటు బరువు తగ్గడానికి కూడా ఎంతో తోడ్పడుతుంది.

- Advertisement -

ఈ డ్రింకు తయారీకి ఒకటిన్నర లీటరు నీళ్లు రెడీ పెట్టుకోవాలి. అలాగే మీడియం సైజు అల్లం ముక్కను తీసుకుని పలచని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక నిమ్మ చెక్కను రసంలా పిండి సిద్ధంగా ఉంచుకోవాలి. రెడీ పెట్టుకున్న నీళ్లను శుభ్రమైన గిన్నెలో పోసి మరగనివ్వాలి. అందులో పలచగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలను వేసి తక్కువ మంటపై ఉంచి అల్లం ముక్కలు మెత్తగా అయ్యేవరకూ ఉడకనివ్వాలి.  తర్వాత స్టవ్ ను ఆర్పేసి ఆ నీళ్లను బాగా చల్లారనివ్వాలి. అందులో నిమ్మ రసం పిండి బాగా కలపాలి. ఈ డ్రింకును రోజుకు మూడుసార్లు భోజనానికి అరగంట ముందు తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇది కాకుండా ఫ్యాట్ ను అధికంగా కరిగించే డ్రింకులు కూడా ఉన్నాయి. వీటిని తాగడం వల్ల బరువు వేగంగా తగ్గుతారు. కాలరీలు కూడా బాగా కరుగుతాయి. యాపిల్ సిడార్ వెనిగర్ డిటాక్సు డ్రింకు రాత్రి పడుకోబోయే ముందు తాగాలి. ఇది కొవ్వును ఎంతో వేగంగా కరిగిస్తుంది. ఇంకొకటి అరటి పండు డ్రింకు. ఇది ఎంతో రుచిగా ఉండడమే కాదు వేగంగా బరువు తగ్గేలా చేస్తుంది.

చియా, లెమన్ కలిపిన డ్రింకు ఇంకొకటి. ఇది పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును వేగంగా తగ్గిస్తుంది. మరో రుచికరమైన, రిఫ్రెషింగ్ డ్రింకు ఫైనాపిల్  వాటర్. ఇది  బరువును తగ్గించడమే కాదు, కీళ్ల నొప్పులను, వాపును నివారిస్తుంది. అంతేకాదు శరీరంలో రోగనిరోధకశక్తిని సైతం బాగా  పెంచుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News