నాన్‌వెజ్ తినేవారు అందరూ చికెన్, మటన్ లివర్ తినడాన్ని ఇష్టపడతారు. ఈ రెండటిలో పోషకాలు, ప్రోటీన్లు, విటమిన్లు ఉండటం వల్ల ఆరోగ్యానికి మంచిది. కానీ, ఈ రెండింటిలో ఏందులో ఎక్కువ పోషకాలు కలిగి ఉంటాయో తెలుసా. దేని వల్ల ఎక్కువ ప్రయోజనమో తెలుసా..
చికెన్ లివర్ ప్రయోజనాలు: చికెన్ లివర్‌లో శరీరానికి అవసరమైన ఐరన్ ఉంటుంది, ఇది రక్తంలో ఎర్ర రక్తకణాలను పెంచడానికి సహాయపడుతుంది. దీని ద్వారా రక్తహీనత సమస్యని నివారించవచ్చు. అదేవిధంగా, విటమిన్ A, B12, ఫోలేట్ వంటి పోషకాలు లభిస్తాయి. లివర్ తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. కండరాల కోసం అవసరమైన ప్రోటీన్ ఇందులో ఉంది. యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తూ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
మటన్ లివర్ ప్రయోజనాలు: మటన్ లివర్‌లో విటమిన్ B12 ఉంటుంది, ఇది మెదడు పనితీరు, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. నాడీ వ్యవస్థ, ఎముకలు, దంతాలను ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన ఖనిజాలు ఇందులో ఉన్నాయి. అదే విధంగా, ఐరన్ ఉంటే రక్తహీనతతో బాధపడేవారు దీనిని తినవచ్చు. ప్రోటీన్ కండరాలను బాగుచేయడానికి సహాయపడుతుంది. ఇందులో విటమిన్ A, ఫోలేట్ ఉన్నాయి.
ఏది మంచిది?
చికెన్ లివర్ కంటే మటన్ లివర్ పోషకాహార నిపుణుల ప్రకారం ఎక్కువ ప్రయోజనాలు కలిగి ఉంటుంది. ఇందులో ఎక్కువ పోషకాలు ఉంటాయి. అయితే, రెండు లివర్లను కొంతమేర మాత్రమే తినడం మంచిది, ఎందుకంటే ఇందులో కొవ్వు ఎక్కువగా ఉంటుంది.
ఎవరు తినకూడదు?
ఎవరైతే అధిక కొలెస్ట్రాల్, కిడ్నీ సమస్యలు, కండరాల సమస్యలు ఉన్నవారు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు మటన్ లివర్ తినే ముందు డాక్టర్ని సంప్రదించాలి. అలాగే, చికెన్ లివర్‌ను వారానికి ఒకసారి లేదా రెండు సార్లు మాత్రమే తీసుకోవడం మంచిది. ఈ రెండు లివర్లూ మంచి పోషకాలు కలిగి ఉన్నప్పటికీ, కొన్ని వ్యక్తులు వాటిని జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంది.