Wednesday, January 29, 2025
Homeహెల్త్Kims hospital awareness on Polio: పోలియో-రహితమే కానీ ప్రమాద రహితం కాదు

Kims hospital awareness on Polio: పోలియో-రహితమే కానీ ప్రమాద రహితం కాదు

పేరెంట్స్..పారాహుషార్

భారతదేశంలోని మేఘాలయలో ఇటీవల బయట పడిన పోలియో కేసు నేపథ్యంలో, పోలియోమైలిటిస్ వల్ల కలిగే నిరంతర ముప్పును గుర్తించడం చాలా అవసరం. పోలియో, ఒక తీవ్రమైన వైరల్ అంటువ్యాధి. ప్రధానంగా ఐదేళ్లలోపు పిల్లలను ప్రభావితం చేస్తుంది. ఇది కోలుకోలేని పక్షవాతం, కొన్ని సందర్భాల్లో మరణానికి దారితీస్తుంది. దశాబ్దాలుగా పురోగతి ఉన్నప్పటికీ, ఈ వ్యాధి ప్రపంచ ఆరోగ్యానికి ముప్పుగా మాత్రం మిగిలిపోయింది. ముఖ్యంగా పోలియో రహిత భారతదేశం వంటి దేశాలలో ఇది మరలా రాకుండా నివారించడానికి అప్రమత్తంగా ఉండాలి.

- Advertisement -

హైదరాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్‌లో పీడియాట్రిక్స్ చీఫ్ గా వ్యవహరిస్తున్న డాక్టర్ నితిన్ చావ్లా మాట్లాడుతూ, “భారతదేశం పోలియో రహిత హోదా అనేది నిబద్ధత, సమిష్టి చర్యతో మనం ఏమి సాధించగలమనే దానికి నిదర్శనం. కానీ పోలియోపై పోరాటం మనం సాధించిన దాని గురించి మాత్రమే కాదు-ఇదే వేగాన్ని కొనసాగించడం, టీకా ద్వారా నిరంతరం అప్రమత్తంగా ఉండటమే పునరుజ్జీవనాన్ని నిరోధించడానికి ఏకైక మార్గం అని మన గత విజయం గుర్తు చేసేందుకు ఉపయోగపడుతుంది” అని అన్నారు. రొటీన్ ఇమ్యునైజేషన్ ప్రాముఖ్యతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తే పోలియో నుండి బలమైన రక్షణ ఏర్పడుతుందన్నారు.

ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అడ్వైజరీ కమిటీ ఆన్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యునైజేషన్ ప్రాక్టీసెస్ (IAP ACVIP) సిఫార్సు చేసిన టీకా షెడ్యూల్‌ను ఖచ్చితంగా అనుసరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. ఇందులో నోటి ద్వారా పోలియో వ్యాక్సిన్ (OPV), 6, 10, 14 వారాలలో నిష్క్రియాత్మక పోలియో వ్యాక్సిన్ (IPV), 16-18 నెలలలో మళ్లీ 4-6 సంవత్సరాలలో బూస్టర్‌లు వేయించాలన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News