Thursday, September 19, 2024
Homeహెల్త్Kishmish wonders: కిస్ 'మిస్' చేయకండి

Kishmish wonders: కిస్ ‘మిస్’ చేయకండి

ఎండుద్రాక్షలతో చర్మం మిల మిల…

- Advertisement -

ఎండు ద్రాక్ష నీళ్లు చర్మాన్ని మిల మిలా మెరిపిస్తాయని, యాక్నేను పోగొడతాయని మీకు తెలుసా? ఈ నీళ్లు మీ చర్మ కాంప్లెక్షన్ ను కాంతివంతం చేయడమే కాదు చర్మాన్ని మరెంతగానో సంరక్షిస్తుంది కూడా. ముఖ్యంగా యాక్నే బారిన పడిన ముఖాన్ని ఆరోగ్యవంతంగా మలచడంలో ఈ నీళ్లు అద్భుతాలు స్రుష్టిస్తుంది. యాక్నే లేని మెరిసే చర్మాన్ని మీకందించే వస్తువు మీ వంటిట్లోనే ఉంది. ఎండుద్రాక్ష నీళ్లు ఈ సమస్యను పరిష్కరిస్తాయి. అంతేకాదు మీరు కలలుగన్న చర్మ మెరుపులు సాధిస్తారు. ఇంతకూ ఎండుద్రాక్షలను నీళ్లల్లో ఎందుకు నానబెట్టాలనే అనుమానం వచ్చే ఉంటుంది.

ఎండుద్రాక్షలను నీళ్లల్లో నానబెట్టడం వలన వాటిల్లోని పోషకాలు నీళ్లల్లో గాఢమైన చిక్కదనం తో ఉంటాయి. ఎండు ద్రాక్షల్లో స్కిన్ ఫ్రెండ్లీ న్యూట్రియంట్లు బోలెడు ఉంటాయి. స్నాక్ లో ఎండు ద్రాక్షలు వాడితే ఎంతో రుచిగా ఉంటాయి. ఈ నీళ్లు కొన్ని రోజుల్లోనే ముఖంపై ఉన్న యాక్నేను పోగొడతాయి. చర్మ సౌందర్యాన్ని ఎండు ద్రాక్షలు ఎంతగానో మెరుగుపరుస్తాయి. ఎండుద్రాక్షల్లో యాంటాక్సిడెంట్లు బాగా ఉంటాయి. అంతేకాదు ప్లాంట్ ఆధారిత ఫైట్రోన్యూట్రియంట్స్ వీటిల్లో ఉంటాయి. ఇవి చర్మ పటుత్వాన్ని పెంచుతాయి. అంతేకాదు ఎండుద్రాక్ష నీళ్లు డిటాక్స్ డ్రింకు కూడా. ఇది శరీరంలోని మలినాలను బయటకు పోగొడుతుంది.

యాక్నేని నివారిస్తుంది. సాధారణంగా దద్దుర్లు, ఇరిటేషన్లతో యాక్నే వస్తుంది. ఎండుద్రాక్ష నీళ్లల్లోని యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు మండుతున్న చర్మానికి ఎంతో సాంత్వననిస్తుంది. యాక్నే బాధిత చర్మంపై నూనె స్రావం ఎక్కువగా ఉంటుంది. చర్మంపై నూనె ఉత్పత్తిని ఎండుద్రాక్షలు సమతుల్యం చేస్తాయి. చర్మం యొక్క నూనె ప్రమాణాలను క్రమబద్ధీకరించడం ద్వారా యాక్నేను నివారిస్తుంది. శరీరంలో డీహైడ్రేషన్ వల్ల కూడా చర్మంపై యాక్నే తలెత్తే అవకాశం ఉంది. ఎండుద్రాక్షలోని సహజ తీపి గుణాలు, చర్మానికి తేమనందించే గుణాల వల్ల శరీరం లోపలతో పాటు చర్మం పైభాగం కూడా హైడ్రేటెడ్ గా ఉంటుంది. ఈ ఎండు ద్రాక్షనీళ్ల తయారీ కూడా చాలా సింపుల్. 25 గ్రాముల ఎండుద్రాక్షలు తీసుకుని ఒక బాటిల్ క్లీన్ వాటర్ లో వేసి రాత్రంతా నాననివ్వాలి. మర్నాడు ఉదయం ఆ నీళ్లను వొడగట్టి ఖాళీ కడుపుతో తాగితే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News