Tuesday, September 17, 2024
Homeహెల్త్Kitchen Secrets: అందానికి వంటింటి టిప్స్

Kitchen Secrets: అందానికి వంటింటి టిప్స్

వంటిట్లో అందుబాటులో ఉండే వాటితో మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. అదెలా అంటే..

- Advertisement -

 రెండు టేబుల్ స్పూన్ల బియ్యప్పిండిలో అంతే పరిమాణంలో టీడికాషన్, టేబుల్ స్పూను తేనె కలిపి పేస్టులా చేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని గంట సేపు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల మ్రుత కణాలు పోయి చర్మం నునుపుదేలుతుంది.

 ముప్పావు కప్పు రోజ్ వాటర్ లో పావు కప్పు గ్లిజరిన్ , ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ , తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ఒక బాటిల్ లో పోసి ఫ్రిజ్ లో భద్రపరచాలి. ఇది సన్ స్ర్కీన్ లోషన్ లా పనిచేస్తుంది.

 పుదీనా ఆకుల్ని పేస్టులా చేసి రాత్రి పడుకోబోయే ముందు మొటిమల మీద రాసుకుని ఉదయం లేచిన వెంటనే గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

 రోజ్ వాటర్ లో ముల్తానా మట్టి, పసుపు కలిపి పేస్టులా చేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అది ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా చేస్తే చర్మం కాంతివంతంగా ఉంటుంది.

 బియ్యం కడిగిన నీళ్లల్లో విటమిన్ బి, విటమిన్ సి, అమినో ఆమ్లాలు ఉంటాయి. ఇవి శిరోజాలు వేగంగా పెరిగేలా చేస్తాయి.

 కోడిగుడ్డులోని తెల్లసొన తీసి బాగా గిలక్కొట్టి అందులో చెంచా బాదం నూనె,అర చెంచా తేనె కలిపి పేస్టులా చేసి ముఖానికి రాసుకోవాలి. ఆ పేస్టు ముఖంపై పూర్తిగా ఆరాక గోరువెచ్చటి నీళ్లతో ముఖం కడుక్కుంటే చర్మం నిగారింపుతో కనిపిస్తుంది.

 కలబందలోని బీటా కెరొటిన్, విటమిన్ సిలు ముఖంపై ముడతల్ని తగ్గిస్తాయి. ఇందుకు ఏం చేయాలంటే కలబంద గుజ్జులో కాసిని పాలు, తేనె కలిపి పేస్టులా చేసి దాన్ని ఉదయాన్నే ముఖానికి రాసుకోవాలి. ఇలా రోజూ చేస్తే చర్మం అందంగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది.

 జిడ్డు కారే చర్మం ఉన్నవాళ్లు పెసరపిండి, తేనె, పెరుగు కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇలా చేస్తే చర్మంపై నలుపుదనం తగ్గుతుంది.

 అరకప్పు బొప్పాయి పండు గుజ్జులో అర చెక్క నిమ్మరసం పిండి ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసుకుని పదినిమిషాలు అలాగే ఉంచుకొని ఆ తర్వాత నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే చర్మంపై చేరిన మురికి పోతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News