Friday, November 22, 2024
Homeహెల్త్Kitchen tips: ఇంటి చిట్కాలు

Kitchen tips: ఇంటి చిట్కాలు

అన్నం గంజిలో కాస్త తేనె, నారింజరసం కలుపుకు తాగండి

*ఆమ్లేట్ వేసే ముందు పెనం మీద కాస్త ఉప్పు చల్లితే పెనానికి అది అతుక్కోదు.

  • దోసెలపిండిలో ఒక కప్పు సగ్గుబియ్యం వేస్తే దోసెలు చినిగిపోకుండా వస్తాయి.
  • గుడ్డు సొనకి ఒక టీస్పూన్ మైదాపిండి కలిపితే ఆమ్లేట్ బాగా పొంగినట్టు వచ్చి చాలాసేపు అలాగే ఉంటుంది.
  • ఉప్పు ఉన్న జాడిలో రెండు పచ్చిమిరపకాయలు వేస్తే సీసాలోని ఉప్పులో చెమ్మచేరి నీరులా కారదు.
  • అన్న వార్చిన గంజిలో ఎన్నో విటమిన్లు ఉంటాయి. చలికాలంలో ఆ అన్నం గంజిలో కాస్త తేనె, నారింజరసం కలుపుకుని తాగితే మంచిది.
    *బియ్యాన్ని వేగించి వండుకుంటే అన్నం తేలిగ్గా జీర్ణమవుతుంది.
  • టొమాటో వాడిపోయినట్టు ఉంటే వాటిని రాత్రి ఉప్పునీటిలో వేసి ఉంచితే ఉదయం ఎంతో తాజాగా ఉంటాయి.
  • పూరీలు పొంగినట్టు రావాలంటే గోధుమపిండిలో గుప్పెడు బొంబాయి రవ్వ లేదా బియ్యంప్పిండిని కలపాలి.
  • తేనె సీసాలో రెండు లేదా మూడు మిరియాలు వేస్తే ఎక్కువకాలం నిల్వ ఉండడమే కాదు దానికి చీమలు కూడా పట్టవు.
  • పప్పుధాన్యాలు పాడవకుండా ఉండాలాంటే వాటిలో నాలుగు ఇంగువ పలుకులు వేయాలి. ఇలా చేస్తే పప్పులు పురుగుపట్టవు. చాలాకాలం తాజాగా ఉంటాయి కూడా.
  • పుట్టగొడుగుల్ని పేపర్ లో చుట్టబెట్టి ఫ్రిజ్ లో పెడితే చాలాకాలం తాజాగా ఉంటాయి.
  • పుదీనా ఆకుల్ని ఫ్రిజ్ లో చల్లితే దుర్వాసన రాదు.
  • ఐస్ క్రీమ్ బాక్సును ఒక కవరులో చుట్టి డీప్ ఫ్రీజర్ లో పెడితే కడ్డకట్టకుండా ఉండి కావాలసినపుడు తినడానికి వీలుగా ఉంటుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News