Saturday, November 23, 2024
Homeహెల్త్Lean body: శరీరం సన్నగా, ఫిట్ నెస్ తో ఉండాలంటే ?

Lean body: శరీరం సన్నగా, ఫిట్ నెస్ తో ఉండాలంటే ?

సన్నగా శరీరం ఉండాలంటే దానికి బాగా కష్ట పడాలి. నిత్యం వ్యాయామాలు చేయడంతో పాటు ఆహారం విషయంలోనూ మంచి అవగాహనతో మసలుకోవాలి. సన్నగా కనిపించాలంటే శరీరంలో చేరిన ఫ్యాట్ ను బాగా కరిగించాలి. మసిల్ మాస్ ను పెంచకుండా కండరాల టోనింగ్ విషయంలో శ్రద్ధపెట్టాలి. మీరు తీసుకునే ఆహారంలో ఎక్కువ కాలరీలు ఉండకుండా చూసుకోవాలి. శరీరం బరువుగా ఉండకుండా తేలికగా ఉండేలా మలచుకోవాలి. ఇందుకు కాయగూరలు, ఆకుకూరలను బాగా తినాలి. ప్రొటీన్లను సమతులంగా తీసుకోవడంతో పాటు పిండిపదార్థాలు మోడరేట్ గా ఉండేలా జాగ్రత్త వహించాలి.

- Advertisement -

ప్యాకేజ్, ప్రోసెస్డ్ ఆహారపదార్థాల జోలికి అస్సలు వెళ్లకూడదు. వీటిని తింటే అనారోగ్యకరమైన ఫ్యాట్ శరీరంలో చేరి స్లిమ్ కావడం అటుంచితే అనారోగ్యాల పాలబడతారని మరవొద్దు. ఒమేగా 3, ఒమేగా 6 లాంటి ఆరోగ్యవంతమైన ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవాలి. సన్నగా ఉండడానికి శరీరాన్ని ఎల్లవేళలా హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం కూడా ఎంతో ముఖ్యం. రోజూ నీళ్లు బాగా తాగాలి. చక్కెర ఉండే డ్రింకుల జోలికి వెళ్లొద్దు.

కార్డియో వ్యాయామాలను అంటే రన్నింగ్, స్కిప్పింగ్, బర్పీస్ వంటి వాటిని రోజులో కనీసం 20 నిమిషాలైనా తప్పనిసరిగా చేయాలి. ఇలా చేస్తే శరీరంలోని కొవ్వుకరగడమే కాదు రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది. సన్నటి శరీరం కోసం మీరు నిత్యం తీసుకునే డైట్ కాలరీల విషయంలో కూడా స్పష్టమైన అవగాహనను పెంచుకోవాల్సి ఉంటుంది. ప్రొటీన్ బార్, గుడ్డులోని తెల్లసొన, ఒట్ మీల్, బ్లూ బెర్రీస్, స్ట్రాబెర్రీస్, తెల్లసొనతో వెగ్గీ ఆమ్లెట్, ప్రొటీన్ షేక్ ల వంటివాటిని తీసుకోవాలి. డైటీషియన్ పర్యవేక్షణలో ఆహారాన్ని తీసుకోవడం మంచిది.

ఒక్కమాటలో చెప్పాలంటే సన్నగా అవాలంటే లీన్ డైట్ నే క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఫ్యాట్ ను కరిగించే ఆహారపదార్థాలను తినడం చాలా ముఖ్యం. సన్నటి, ద్రుఢమైన శరీరానికి సరైన ఆహారం తీసుకోవడం డైట్ ప్లానింగ్ లో చాలా ముఖ్యమైన అంశం. బరువు తగ్గడానికి ప్రొటీన్లు బాగా ఉన్న మీల్స్ ను ప్లాన్ చేసుకోవాలి. అదే సమయంలో కండరాల టోనింగ్ ను పెంచే మీల్ తీసుకోవాలి. కండరాలు టోనింగ్ తో కనిపించాలంటే డైట్ విషయంలో, వ్యాయామాల విషయంలో ఎంతో కఠినంగా వ్యవహరించాలి. శరీరంలోని కొవ్వు వేగంగా కరగాలంటే శరీర బరువు ఒక పౌండు ఉంటే ఒక గ్రాము ప్రొటీన్ తీసుకునేలా ప్లాన్ చేయాలి. మీరు తీసుకునే పరిమితమైన కాలరీ ఫుడ్ లో ప్రొటీన్ ఒకవేళ తక్కువగా ఉంటే కండరాలపై అది బాగా ప్రభావం చూపుతుంది.

డైటింగ్ చేసేటప్పుడు ఎక్కువ ప్రొటీన్లతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల సన్నగా అవొచ్చు. బరువు తగ్గే క్రమంలో కార్బోహైడ్రేట్లను మోడరేట్ గా తీసుకోవాలి. ఓట్స్, రైస్, హోల్ గ్రెయిన్ బ్రెడ్, బంగాళాదుంపలు వంటి ఎక్కువ ఫైబర్ ఉన్న ఫుడ్స్ సరైన పాళ్లల్లో తీసుకోవాలి. డైటింగ్ లో ప్లెయిన్ వాటర్ తీసుకోవడమే సర్వవిధాలా అత్యుత్తమం. క్రేవింగ్స్ కు లొంగొద్దు. ఈ విషయంలో ప్రొటీన్ బార్స్, ప్రొటీన్ డ్రింక్స్ వంటివి మీ తీపి క్రేవింగ్స్ ను కొంతమేర అరికట్టగలవు. ఆయిల్ లేకుండా మాంసం గ్రిల్ చేసి తినాలి. బట్టర్ లేకుండా ఉడకబెట్టిన కూరగాయలు తింటే మంచిది. సన్నగా, టోనింగ్ తో ఉన్న కండలు కలిగి కనిపించాలనుకునే వారు ఈ పనిని మంచి నిపుణులైన ఫిట్ నెస్ ప్రొఫెషనల్, డైటీషియన్ల పర్యవేక్షణలో మాత్రమే చేయాలని మరొవొద్దు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News