Lemon Grass Tea Benefits: మన రోజువారీ దినచర్య సాధారణంగా కప్పు టీతో ప్రారంభమవుతుంది. టీ తాగిన తర్వాత మెదడు మరింత చురుకుగా పనిస్తుంది. శరీరం కూడా పనులు చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అందుకే టీ చాలా మందికి రోజువారీ దినచర్యలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. కానీ ఆరోగ్యనిపుణులు మాత్రం సాధారణ టీ కంటే లెమన్‌గ్రాస్ టీ ఆరోగ్యానికి మరింత ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. లెమన్ గ్రాస్‌ను తెలుగులో నిమ్మగడ్డి అని పిలుస్తారు. దీని ఎక్కువగా సువాసన కోసం ఉపయోగిస్తారు కానీ ఇందులో బోలెడు ఆరోగ్య గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా మానసిక సమస్యలకు, బరువు తగ్గించడంలో కీలక ప్రాత పోషిస్తుంది. లెమన్ గ్రాస్ టీలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీమైక్రోబియల్ ఇతర లక్షణాలు ఉన్నాయి. దీని ప్రతిరోజు ఉదయం తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం.
లెమన్ గ్రాస్ టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు:
✫ రక్తపోటు అదుపులో:
ప్రతిరోజు ఉదయం లెమన్ గ్రాస్ తాగడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. లెమన్ గ్రాస్‌లో ఉండే పొటాషియం శరీరంలో ఉండే సోడియంను బయటకు పెంపుతుంది. రక్తపోటు సమస్యతో బాధపడేవారు టీకి బదులుగా దీని చేర్చుకోవడం మంచిది.
✫ జీర్ణక్రియవ్యవస్థ:
జీర్ణవ్యవస్థ మెరుగుపరచడంలో లెమన్ గ్రాస్ టీ మేలు చేస్తుంది. ఇది అజీర్ణం, గ్యాస్, కడుపు నొప్పి, మలబద్ధకం వంటి సమస్యల నుంచి తగ్గిస్తుంది. అంతేకాకుండా జీర్ణ ఎంజైమ్‌లను ఉత్తేజపరిచి ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారు కూడా దీని పరగడుపున తాగవచ్చు.
✫ ఒత్తిడి-ఆందోళన:
అధిక ఒత్తిడితో బాధపడేవారు కూడా లెమన్ గ్రాస్ టీని తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది. దీని నుంచి వచ్చే సువాసన మనస్సును శాంతపరుచుతుంది. నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడేవారు కూడా ఈ టీని ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు.
✫ బరువు తగ్గడం:
లెమన్ టీ శరీరంలో ఉండే కొవ్వును సులభంగా కరిగిస్తుంది. ఇది విష పదార్థలను తొలగించి బరువు తగ్గడంలో సహాయపడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారికి లెమన్ గ్రాస్ టీ ఒక మంచి ఎంపిక.
✫ రోగనిరోధక శక్తి:
లెమన్ గ్రాస్ టీలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధకశక్తిని మెరుగపరచడంలో సహాయపడుతుంది. తరచుగా వచ్చే దగ్గు, జలుబు, ఫ్లూ సమస్య నుంచి రక్షిస్తుంది. లెమన్ గ్రాస్‌లో ఉండే యాంటీవైరల్ గుణాలు ఇన్ఫెక్షన్లతో పోరాడతాయి.
✫ చెడు కొలెస్ట్రాల్:
లెమన్ గ్రాస్ టీ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కీలక ప్రాత పోషిస్తుంది. దీని వల్ల గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. లెమన్ గ్రాస్‌లో ఉండే మంచి కొవ్వు గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది.