Wednesday, April 2, 2025
Homeహెల్త్Life starts after 40: మీ వయసు 40 ఏళ్లు దాటాక బెస్ట్ లైఫ్ లీడ్...

Life starts after 40: మీ వయసు 40 ఏళ్లు దాటాక బెస్ట్ లైఫ్ లీడ్ చేయాల్సిందే

వయస్సు నలభై (40) దాటుతుందంటే.. మీరు చాలా బాధ్యతాయుతంగా మెలగాలి. మీ కుటుంబానికి మీరే ఆధారం. మీ వయస్సు 40 ప్లస్ అయితే ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిందే. అందుకే ఈ ఏడు సూత్రాలు పాటించండి.. ఆరోగ్యం కాపాడుకోండి.. యవ్వనంగా కనిపించండి.. అవేమిటంటే..

👉 ఈ రెంటిని అప్పుడప్పుడు పరీక్ష చేయించండి.. 1. బి.పి., 2. షుగరు..

👉 ఈ నాలుగింటిని సాధ్యమైనంత తగ్గించండి. 1. ఉప్పు, 2. చక్కెర, 3. డైరీ తయారీలు, 4. పిండిపదార్థాలు

👉 ఈ నాలుగింటిని ఎక్కువ తీసుకోండి. 1. ఆకుకూరలు, 2. కూరగాయలు, 3. పండ్లు, 4. గింజలు
👉 ఈ మూడింటిని మరచిపొండి. 1. మీ వయస్సు, 2. గడిచిపోయిన రోజులు, 3. కోపతాపాలు

👉 ఈ మూడింటినీ పొందుటకు చూడండి. 1. ప్రాణ స్నేహితులు, 2. ప్రేమించే కుటుంబం, 3. ఉన్నతమైన ఆలోచనలు

👉 ఆరోగ్యవంతులుగా ఉండడానికి ఈ క్రింది వాటిని పాటించండి. 1. నియమిత ఉపవాసం, 2. నవ్వడం, 3. వ్యాయామం, 4. బరువు తగ్గుట

👉 ఈ నాలుగు విషయాలకై ఎదురు చూడకండి.
1. నిద్ర పోవడానికై నిద్ర వచ్చేవరకు కాచుకొని ఉండకండి.
2. విశ్రాంతి తీసుకోవడానికై అలసిపోయే వరకు ఉండకండి.
3. స్నేహితుడిని కలవడానికై అతను ఎదురుచూడడం మానేసేంత ఆలస్యం చేయకండి.
4. దేవుడిని ప్రార్థించడానికై కష్టాలు వచ్చేంతవరకు ఆగకండి…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News