Friday, November 22, 2024
Homeహెల్త్Lifestyle: స్టైల్‌గా… అందంగా ఉండాలంటే ఇవి పాటించాల్సిందే!

Lifestyle: స్టైల్‌గా… అందంగా ఉండాలంటే ఇవి పాటించాల్సిందే!

- Advertisement -

Lifestyle: ఫ్యాషన్‌ మనల్ని అందంగా కనిపించనీయడమే కాదు మన వ్యక్తిత్వానికి కూడా అద్దంపడుతుంది. ఎప్పుడూ చక్కని దుస్తులతో స్టైలిష్ గా, ప్రత్యేకంగా ఉంటే నలుగురిలో మీరు స్పెషల్‌గా కనిపిస్తారు. అలాంటి కొన్ని టిప్స్‌మీకోసం…

మీ వార్డ్‌రోబ్‌ మీ డ్రస్‌ సెన్స్‌ను తెలుపుతుంది. పర్‌ఫెక్ట్‌ ఫిట్‌ జీన్స్‌, స్టైలిష్ బ్లేజర్, ఫ్యాషన్‌ చిందించే బ్లాక్‌ డ్రస్‌, సింపుల్‌ టీ షర్టులు, లెదర్‌ జాకెట్‌, మిక్స్‌అండ్‌ మ్యాచ్ డ్రస్సులు మీ వార్డ్‌రోబ్‌లో ఉండాలి. న్యూట్రల్‌ కలర్స్‌తో కూడినదుస్తులు ఎలాంటి వారికైనా అందంగా ఉంటాయి. మీ శరీరాకృతిని అందంగా కనిపించేలా పర్ఫెక్ట్‌ స్టిచింగ్‌, ఫిట్టింగ్‌తో మీరు వేసుకునే దుస్తులు ఉండాలి. అంతేకాదు అవి మీ శరీరానికి సౌఖ్యంగా ఉండడంతోపాటు ఫ్యాషన్‌గా కనిపించాలి.

మీ శరీరాకృతిని అందంగా కనిపించేలా పర్‌ఫెక్ట్‌ స్టిచింగ్‌, ఫిట్టింగ్‌తో ఉండాలి. మీరు దుస్తుల స్టైలింగ్ లో ఈస్థటిక్‌ హార్మొనీ సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి.
మీ శరీరాకృతి అందంగా కనిపించేలా సిగ్నేచర్‌ స్టైల్, పర్సనాలిటీ ప్రతిఫలించేలా దుస్తుల ఫిట్టింగ్‌, డిజైన్‌ ఉండాలి. పర్సనల్‌ సె్టైల్‌ ఎప్పుడూ సహజంగా ఉండి ప్రయోగాత్మకంగా కనిపిస్తుంది. వేసుకున్న దుస్తులు మూడ్‌ రిఫ్లక్షన్లను ప్రతిఫలించాలి.
దుస్తులు కొనుగోలు చేసేటప్పుడు రంగుల విషయంలో, స్టైల్ విషయంలో, ఫ్యాషన్ల పరంగా తగినంత సమయం పెట్టి కొనుక్కోవాలి.

షాపింగ్‌ చేయడం కూడా ఒక కళ. మీకేది కావాలో, ఎలాంటి డిజైనింగ్‌ దుస్తులు కావాలో స్పష్టమైన అవగాహన ఉండాలి. అలా చేస్తే అనవసరమైన దుస్తులతో మీ వార్డ్‌రోబ్‌ ఉండిపోదు. మీ పర్సనాలిటీకి అనుగుణంగా దుస్తుల రంగుల ఎంపిక ఉండాలి. సరైన రంగుల మేళవింపు మిమ్మల్ని నలుగురిలో మరింత స్టైలిష్ గా నిలబెడుతుంది.
దుస్తులను ఎంపిక చేసుకునేటప్పుడు మిక్సిడ్‌ పాట్రన్స్‌, టెక్స్చర్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. దుస్తులకు మ్యాచ్‌ అయ్యే చెప్పులు, హ్యాండ్‌బ్యాగ్‌ ఇతర యాక్ససరీస్‌ వేసుకోవడం నేటి ఫ్యాషన్‌ కాదు. భిన్నమైన టెక్స్చర్స్‌, ప్రింట్‌ ఇప్పుడు బోల్డ్‌ ఫ్యాషన్‌ స్టేట్‌మెంట్‌ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News