Saturday, November 23, 2024
Homeహెల్త్Long Eye lashes: కనురెప్పలు పొడవైనవి కావాలంటే..

Long Eye lashes: కనురెప్పలు పొడవైనవి కావాలంటే..

పొడవైన కనురెప్పలు కళ్లను మరింత అందంగా కనిపించేలా చేస్తాయి. అందుకే అమ్మాయిలు ఒత్తైన, పొడవైన కనురెప్పలంటే ఆసక్తిచూపుతారు. మరి కనురెప్పల వెంట్రుకలు పొడవుగా, ఒత్తుగా పెరిగేదెలా అని ఆలోచిస్తున్నారా? దీనికి కొన్ని సులువైన చిట్కాలు ఉన్నాయి. అవి..

  • ఆముదం నూనె అప్లై చేస్తే కనురెప్పల వెంట్రుకలు పొడవుగా, అందంగా కనిపిస్తాయి. ఇందుకు ఒక టీస్పూన్ కోల్డ్ ప్రెస్డ్ కాస్టర్ ఆయిల్, కొన్ని కాటన్ స్వాబ్స్ రెడీగా పెట్టుకోవాలి. కనురెప్పలకు ఆముదం నూనె అప్లై చేసేముందు నీళ్లతో కనురెప్పలను సున్నితంగా అద్ది , మైల్డ్ క్లీన్సర్ తో పొడిగా ఉండేలా తుడుచుకోవాలి. తర్వాత కాటన్ స్వాబ్ తీసుకుని కోల్డ్ ప్రెస్డ్ కాస్టర్ ఆయిల్ లో ముంచి కనురెప్పలకు పైన, కింద అప్లై చేయాలి. కళ్లల్లోకి నూనె వెళ్లకుండా చూసుకోవాలి. కనురెప్పల పైన కింద నూనెను అప్లై చేసిన తర్వాత ర్రాతంతా అలాగే ఉంచుకుని ఆమర్నాడు ఉదయం నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి. కనురెప్పల మీద నూనెను సున్నితంగా మసాజ్ చేయాలని మరవొద్దు. అలాగే కనురెప్పలు విశాలంగా కనిపించాలంటే కళ్లకు మేకప్ చేసుకోవద్దు.
  • కనురెప్పలపై ఉండే వెంట్రుకలు దెబ్బతినడం, లేదా పలచబడ్డం చూస్తుంటాం. వీటి రీగ్రోత్ కు కొబ్బరినూనె ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక టీస్పూన్ కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్, కొన్ని కాటన్ స్వాబ్స్ రెడీ పెట్టుకోవాలి. కనురెప్పలమీద ఆయిల్ అప్లై చేసే ముందు నీటితో శుభ్రంగా తుడవాలి. తర్వాత కొబ్బరినూనెలో కాటన్ స్వాబ్స్ ముంచి కంటి కింద పైన ఉండే రెప్పలపై సున్నితంగా అప్లై చేయాలి. కంటిలోకి నూనె పోకుండా జాగ్రత తీసుకోవాలి. కనురెప్పలమీద నూనె రాసుకున్న తర్వాత ఆ రాత్రంతా వాటిని అలాగే వదిలేసి ఉదయం లేచిన తర్వాత నీటితో కళ్లను శుభ్రంగా కడుక్కోవాలి. కంటి రెప్పలపైన విటమిన్ ఇని అప్లై చేస్తే కూడా మంచి ఫలితాలు చూస్తాం.
  • గ్రీన్ టీ కూడా కనురెప్పలు పొడవుగా, అందంగా ఉండేలా చేయడంలో ఎంతో ఉపయోగపడుతుంది. దీనికి ఒక టీస్పూన్ గ్రీన్ టీ ఆకులు లేదా ఒక టీ బ్యాగ్, ఒక కప్పు వేడి నీళ్లు సిద్ధం చేసుకోవాలి. వేడినీళ్లల్లో గ్రీన్ టీ ఆకులు వేసి ఐదు నుంచి పదినిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత ఆ ద్రవాన్ని వొడగట్టి వేడి వేడిగా తాగాలి. ఈ టీని చల్లార్చి కాటన్ స్వాబ్ ను ఆ నీళ్లల్లో ముంచి అప్లై చేస్తే కూడా మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ టీని రోజుకు రెండుసార్లు తాగితే మంచిది. అలాగే రోజులో ఒకసారి ఈ టీ నీళ్లను కనురెప్పల మీదున్న వెంట్రుకలపై కాటన్ స్వాబ్ తో అప్లై చేస్తే మంచి ఫలితాలు చూస్తారు.
  • కనురెప్పలను సున్నితంగా మసాజ్ చేయడం వల్ల కూడా ఆయిల్ రాసినా, రాయకపోయినా కూడా వెంట్రుకలు పొడగ్గా పెరగడమే కాదు అవి ఒత్తుగా కూడా పెరుగుతాయి.
  • కనురెప్పల మీద లెమన్ పీల్ ఆయిల్ బాగా పనిచేస్తుంది. కనురెప్పలమీద వెంట్రుకలు వేగంగా పెరుగుతాయి. ఒకటి లేదా రెండు నిమ్మకాయలను తీసుకుని దాని తొక్కును తీయాలి. అలాగే కొబ్బరినూనె లేదా ఆలివ్ ఆయిల్, కాటన్ స్వాబ్స్ ను రెడీ పెట్టుకోవాలి. ఒక జార్ లో నిమ్మ తొక్కలను వేసి అందులో కొన్ని టేబుల్ స్పూన్ల ఆలివ్ లేదా కొబ్బరినూనెను వేయాలి. అందులోని తొక్కలను ప్రెస్ చేయడం ద్వారా ఆ తొక్కల నుంచి నూనె వస్తుంది. దాన్ని రాత్రంతా అలాగే ఉంచాలి. ఆ తర్వాత ఆనూనెలో కాటన్ స్వాబ్ ముంచి కనురెప్పల పైన, కింద ఉన్న వెంట్రుకలపై ఆ మిశ్రమాన్ని అప్లై చేయాలి. కళ్లల్లో పడకుండా చూసుకోవాలి. దాన్ని రెండు గంటలపాటు అలాగే ఉంచుకొని తర్వాత నీళ్లతో కడుక్కోవాలి. రోజుకు ఒకటి రెండుసార్లు దీన్ని అపై చేసుకోవచ్చు. లేకపోతే వాటిని అలాగే రాత్రంతా వదిలేయొచ్చు కూడా.
  • వాజిలైన్ కనురెప్పలకు తగినంత మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. కనురెప్పలు దెబ్బతినకుండా కాపడుతుంది. ఇందుకు వాజిలైన్ కూడా బాగా ఉపయోగపడుతుంది. పెట్రోలియం జెల్లీ సరిపడా తీసుకుని కాటన్ స్వాబ్స్ తో కనురెప్పల పైన, కింద అప్లై చేసుకోవాలి. కళ్లల్లోకి మటుకు అది పోకుండా జాగ్రత్తపడాలి. ఇలా పెట్రోలియం జెల్లీ కనురెప్పల మీద వెంట్రుకలకు రాసుకున్న తర్వాత రాత్రంతా వాటిని అలాగే వదిలేసి మర్నాడు ఉదయం నీళ్లతో కళ్లను కడుక్కోవాలి.
  • షియా బటర్ కూడా ఈ విషయంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంది. అలాగే యాంటాక్సిడెంట్లు, యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు బాగా ఉంటాయి. విటమిన్ సి ఫ్రీరాడికల్స్ దెబ్బతినకుండా పరిరక్షిస్తుంది. కనురెప్పలు ఒత్తుగా ఉండేలా కూడా చేస్తుంది. కనురెప్పలు పొడుగ్గా పెరిగేలా చేస్తుంది. కొద్దిగా షియా బటర్ ను చేతులోకి తీసుకుని అరచేతుల్లో వేసి రుద్దాలి. అది
    కరుగుతుంది. దాన్ని కనురెప్పల పైన, కింద అప్లై చేసి రాత్రంతా అలాగే ఉంచుకోవాలి.
  • ఆలివ్ ఆయిల్ కూడా కనురెప్పలు ఒత్తుగా, పొడుగ్గా కనిపించేలా చేస్తుంది. ఇందుకోసం మూడు లేదా నాలుగు చుక్కల ఆలివ్ ఆయిల్ తో పాటు కాటన్ స్వాబ్స్ రెడీ పెట్టుకోవాలి. కాటన్ బాల్ మీద ఆలివ్ ఆయిల్ నూనె చుక్కలు కొన్ని వేసి దాన్ని కనురెప్పల మీద అప్లై చేయాలి. లాష్ బ్రష్ ఉంటుంది దానితో సున్నితంగా వాటిని మసాజ్ చేయాలి. లాష్ కోంబింగ్ కూడా చేయాలి. ఆ కనురెప్పల మీదుండే నూనెను ఐదు నుంచి పదినిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కనురెప్పలను శుభ్రంగా కడిగేయాలి.
  • బయొటిన్ లోపం వల్ల కూడా జుట్టు రాలుతుంది. కనుబొమలు, కనురెప్పల మీద ఉండే వెంట్రుకలు రాలిపోతాయి. బయొటిన్ సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వైద్యుల సలహాతో బయొటిన్ సప్లిమెంటు తీసుకోవాలి.
  • ఇవి కాకుండా కనురెప్పల మీదుండే వెంట్రుకలు పలచబడకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన డైట్ కూడా
    తీసుకోవాలి. ఐరన్, జింక్, విటమిన్స్, ఫ్యాటీ యాసిడ్స్, బయొటిన్, ప్రొటీన్లు ఉన్న పదార్థాలను బాగా తీసుకోవాలి. అలాగే మైల్డ్ క్లీన్సర్ ను ఉపయోగించి నిత్యం కనురెప్పలను శుభ్రం చేసుకోవాలి. ఐలిడ్ షాంపు కూడా ఉంటుంది. దానితోనైనా శుభ్రం చేసుకోవచ్చు. అంతేకాదు తక్కువ నాణ్యత ఉండే ఐ మేకప్ ఉత్పత్తులను అస్సలు వాడొద్దు. ఇరిటేషన్ తెచ్చే ఐ మేకప్ ను కూడా చేసుకోవద్దు. పడుకోబోయే ముందు
    తప్పనిసరిగా మేకప్ తీసేయాలి. ఐ లాష్ కర్లర్స్ ను వాడడం ఆపేయాలి. ఐల్యాష్ ఎక్స్ టెన్షన్స్ ను కూడా పరిమితంగానే ఉపయోగించాలి.
  • కనురెప్పల మీద ఉండే వెంట్రుకలు పలచబడడానికి వయసు పెరగడం, మెనోపాజ్ వంటివి కూడా కారణాలే. హార్మోనల్ అసమతుల్యతల వల్ల కూడా ఈ పరిస్థితి తలెత్తుతుంది. థైరాయిడ్ హార్మోన్ లోని అసమతుల్యత వల్ల చర్మం దెబ్బతినడంతో పాటు జుట్టు రాలిపోతుంది. ఎలర్జిక్ రియాక్షన్స్ వల్ల ముఖ్యంగా ఐ మేకప్ వంటి వాటి ఎలర్జీకి గురయినా కూడా ఈ పరిస్థితి తలెత్తుతుంది. అలాగే ఒత్తిడి, కిమోథెరపీ, కొన్ని వైద్య సమస్యలు, బ్యూటీ హైజీన్ కొరవడ్డం వంటివి కూడా ఇందుకు కారణాలని చెప్పాలి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News