Thursday, November 21, 2024
Homeహెల్త్Long hair: ఈ ఆయిల్ తో మీ జుట్టు పొడుగ్గా..

Long hair: ఈ ఆయిల్ తో మీ జుట్టు పొడుగ్గా..

తలకు హెయిర్ ఆయిల్స్ రాసుకోవడం వల్ల శిరోజాలు బాగా పెరుగుతాయి. అంతేకాదు జట్టు రాలిపోకుండా కాపాడతాయి. మాడు, జట్టు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. రోజ్ మేరీ ఎసెన్షియల్ ఆయిల్ కూడా అలాంటిదే. ఇది జట్టు సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎన్నో వైద్య సుగుణాలున్న హెర్బ్ ఇది. ఈ ఆయిల్ మార్కెట్ లో దొరుకుతుంది. రోజ్ మేరీ ఎసెన్షియల్ ఆయిల్ జుట్టు రాలిపోకుండా కాపాడుతుంది. అంతేకాదు శిరోజాలు బాగా పెరిగేలా చేస్తుంది. నరాలను పటిష్టం చేసే గుణం ఈ ఆయిల్ లో ఉండడం వల్ల జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాదు జుట్టు పెరుగుదలకు రోజ్ మేరీ ఎసెన్షియల్ ఆయిల్ ఎంతగానో తోడ్పడుతుందని అధ్యయనాల్లో సైతం వెల్లడయింది. ఈ ఆయిల్ ని జుట్టుకు నిత్యం రాసుకోవడం వల్ల వెంట్రుకలు తొందరగా తెల్లబడవు. అంతేకాదు వెంట్రుకలు చుండ్రు పాల బడకుండా ఈ నూనె కాపాడుతుంది.

- Advertisement -

ఫంగస్ వల్లే జుట్టులో చుండ్రు చేరుతుంది. ఈ నూనె మాడుపై ఎలాంటి ఫంగస్ చేరకుండా సంరక్షిస్తుంది. మాడుపై పేరుకుని ఉన్న నూనెను కూడా ఈ ఆయిల్ తొలగిస్తుంది. ఈ ఆయిల్ని వాడడం వల్ల వెంట్రుకలు ఆరోగ్యంగా, ఎంతో కాంతివంతంగా ఉంటాయి. మాడు ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా శుభ్రంగా ఉంటుంది. అంతేకాదు రక్త ప్రసరణ బాగా జరిగేలా చేసే వాసోడిలేటర్ గుణాలు ఈ ఆయిల్ లో పుష్కలంగా ఉన్నాయి. ఇవి రక్తనాళాలు బాగా పనిచేసేట్టు చేస్తాయి. ఈ నూనె మాడుకు, వెంట్రుక పాయలకు అందించే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో. అంతేకాదు శరీరంలోని నరాలను సైతం శక్తివంతం చేస్తాయి. ఇందులో యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే రోజ్ మేరీ ఎషెన్షియల్ ఆయిల్ రాసుకునేటప్పుడు గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఈ ఆయిల్ ని మాడుకు ఎక్కువగా పట్టించకూడదు. ఈ ఆయిల్ కళ్లల్లో పడకుండా జాగ్రత్త వహించాలి.

ఒకవేళ పొరపాటున ఈ ఆయిల్ కంటికి కొద్దిగా తగిలినట్టు అనిపించినా వెంటనే చల్లటి నీళ్లతో బాగా కడిగేసుకోవాలి. అంతేకాకుండా రోజ్ మేరీ ఎసెన్షియల్ ఆయిల్ చర్మాన్ని ఇరిటేట్ చేస్తుంది. చర్మంపై ఎలాంటి ఇరిటేషన్ కలగకుండా ఉండాలంటే మీరు నిత్యం వాడే నూనెలో దీన్ని కలుపుకుని రాసుకోవచ్చు. ఈ ఆయిల్ ని ఐదు చుక్కలు మాత్రమే వాడాలి. ఐదు చుక్కలకు మించి ఈ నూనె వాడితే మాడుపై దురద వస్తుంది. కొబ్బరినూనె, ఆమ్లా ఆయిల్ లేదా బాదం ఆయిల్ వంటి వాటిలో కేవలం ఐదు చుక్కల రోజ్ మేరీ ఆయిల్ ని కలిపి తలకు రాసుకోవచ్చు. తలపై నూనె ఎక్కువగా పెట్టుకోవడం ఇష్టపడని వాళ్లు వారు వాడే షాంపు లేదా కండిషనర్లలోఈ నూనెను కొద్దిగా వేసుకుని దాంతో శుభ్రంగా తలస్నానం చేయొచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News