Saturday, November 23, 2024
Homeహెల్త్Makeup: ఫౌండేషన్ వేసుకోవటం సరిగ్గా రాదా ?

Makeup: ఫౌండేషన్ వేసుకోవటం సరిగ్గా రాదా ?

ముఖానికి మీరు వేసుకున్న మేకప్ సరిగా లేదా? అయితే ఫౌండేషన్ విషయంలో మీరు ఏదో పొరబాటు చేశారన్నమాట. ఎందుకంటే సరైన ఫౌండేషన్ వేసుకుంటే ముఖానికి వేసుకున్న మేకప్ కూడా పక్కాగా ఉంటుంది. అయితే మీ స్కిన్ టైప్ కు అనుగుణమైన ఫౌండేషన్ ఎంచుకోవాలి. అయితే ఈ ఎంపిక అనుకున్నంత సులభమేమీ కాదు. ఇందుకోసం ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో పెద్ద రీసెర్చే చేయాలి.

- Advertisement -

ఫౌండేషన్ విషయంలో లిక్విడ్ లేదా పౌడర్ ఏది సరిపడుతుందన్న విషయంలో చాలామంది గందరగోళపడతారు. అందుకే చర్మానికి తగ్గ ఫౌండేషన్ ఎంపికచేసుకునేందుకు కొన్ని టిప్స్ ఉన్నాయి. అవి ఫాలో అయితే చాలు. పొడి చర్మం ఉన్నవాళ్లు హైడ్రేటింగ్ పౌడర్ ఫౌండేషన్ ఎంచుకోవాలి. అది లిక్విడ్ లేదా స్టికీ అయిండాలి. క్రీమ్ రూపంలో ఉన్న ఫౌండేషన్ చర్మానికి కావలసినంత మాయిశ్చరైజింగ్ ను అందిస్తుంది.

సున్నితమైన చర్మం ఉన్నవాళ్లు అంటే యాక్నే, చర్మంపై బ్రేక్ అవుట్స్ తో తరచూ బాధపడేవాళ్లు, కొత్త ఉత్పత్తులతో చర్మంపై ప్రయోగాలు చేస్తే తొందరగా ప్రతికూల ఫలితాలిచ్చే ఇరిటేషన్ కు గురయ్యే చర్మం ఉన్నవాళ్లు ఆల్కహాల్, సుగంధద్రవ్యాలున్న ఫౌండేషన్ల జోలికి వెళ్లకుండా ఉండడం ఉత్తమం. ముఖ్యంగా మినరల్ ఆయిల్, టాల్క్ వంటివి ఉన్న ఫౌండేషన్ జోలికి అస్సలే పోకూడదు. ఇకపోతే జిడ్డు చర్మం ఉన్న వాళ్లు పౌడర్ ఫౌండేషన్ లేదా ఆయిల్ ఫ్రీ లిక్విడ్ ఫౌండేషన్ వాడాలి. ఈ రకమైన ఫౌండేషన్లలో నూనెను పీల్చుకునే పొడులు (పౌడర్) ఉంటాయి. వీటితో చర్మం ఎంతో మ్రుదువుగా తయారవుతుంది.

ఆయిలీ స్కిన్ వారిపై మినరల్ ఫౌండేషన్స్ కూడా బాగా పనిచేస్తాయి. కాంబినేషన్ స్కిన్ ఉన్నవాళ్లకు ఫౌండేషన్ ఎంపిక సవాలుతో కూడిన వ్యవహారం. వీళ్లకు లైట్ వెయిట్ లిక్విడ్ ఫౌండేషన్ వాడాలి. ఇందులో ఆయిల్ ఉండదు. ఈ రకం చర్మం ఉన్నవాళ్లు క్రీమ్ ఫౌండేషన్లు మాత్రం వాడకూడదు. అవి వాడితే జిడ్డుగా ఉన్న ప్రదేశాలు మరింత నూనెకారుతున్నట్టు కనిపిస్తాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే స్కిన్ అండర్ టోన్స్ గురించి కూడా అవగాహన పెంచుకోవాలి. అప్పుడే సరైన ఫౌండేషన్ షేడ్ ను ఎంచుకోగలుగుతారు.

అండర్ టోన్స్ కూల్ గా, వామ్ గా లేదా న్యూట్రల్ గా ఉండాలి. మీ అండర్ టోన్స్ వామ్ లేదా కూల్ అనే విషయాన్ని తెలుసుకోవాలంటే మణికట్టు దగ్గర ఉన్న రక్తనాళాలను గమనించండి. అవి కనుక ఆకుపచ్చగా ఉంటే మీది వామ్ అండర్ టోన్స్ అని, నీలంగా ఉంటే కూల్ అండర్ టోన్స్ అని గుర్తించాలి. అయితే ఫౌండేషన్స్ ను కొనేముందు బుగ్గల మీద లేదా దవడల దగ్గర చర్మంపై కొద్దిగా పూసుకుని సహజ వెలుగులో గమనించుకోవాలి. ఆ ఫౌండేషన్ మీ చర్మంలో ఇంకిపోయి కనిపించకుండా ఉంటే, మీ మెడభాగంలోని చర్మరంగుకు సరిపడినట్టు ఉంటే ఆ ఫౌండేషన్ షేడ్ మీకు కరక్టయినదని అర్థం. అలాకాకుండా అది చర్మంపై బూడిద పూసుకున్నట్టుగా ఉన్నా, నల్లగా లేదా బాగా లేత రంగులో ఉంటే దానికి నో చెప్పాలి.

మీకు సరిపడిన మరో ఫౌండేషన్ ని వెతుక్కోవాలి. మీ చర్మం యొక్క స్వభావం, వ్యక్తిగత ప్రాధాన్యతల మీద ఫౌండేషన్ ఫార్మాలా ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. మీరు మాటే ఫినిష్ ని కోరుకుంటే పౌడర్ ఫౌండేషన్ లేదా మాటే లిక్విడ్ ఫౌండేషన్ ని ఎంచుకోవాలి.అలాకాకుండా డ్యూఈ ఫినిష్ కావాలనుకుంటే రేడియెంట్ ఫినిష్ తో ఉన్న లిక్విడ్ ఫౌండేషన్ ని తీసుకోవాలి. మంచి కవరేజ్ ఇచ్చే ఫౌండేషన్ ని ఎంచుకోవడం మరవొద్దు.

అలాగే ముందరే చెప్పినట్టు మీ స్కిన్ రకం బట్టి ఫౌండేషన్ ఫార్ములా ఎంచుకోవాలి. ఫౌండేషన్స్ లైట్ వైట్ ఫార్ములాల్లో వస్తాయి. జిడ్డు చర్మానికి ఆయిల్ లేని మాటే ఫార్ములా ఫౌండేషన్లు సరిపడతాయి. పొడి, కాంబినేషన్ స్కిన్ టైపు ఉన్న వారికి హైడ్రేటింగ్ ఫౌండేషన్స్ సరిపడతాయి. చర్మంపై రంధ్రాలు వెడల్పుగా ఉంటే చర్మాన్ని నునుపుగా చేసే దాన్ని మొదట రాసుకుని ఆ తర్వాత ముఖంపై ఫౌండేషన్ అప్లై చేసుకోవాలి.

ఫౌండేషన్ వేసుకునే ముందు ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. అలా చేయడం వల్ల చర్మంలో ఫౌండేషన్ కలిసిపోయి చాలాటైము వరకూ తాజాగా ఉంటుంది. ఫౌండేషన్ బ్రష్ తో లేదా బ్లెండర్ తో ముఖానికి ఫౌండేషన్ వేసుకోవాలి. అలా చేస్తే ముఖం ఎంతో నున్నగా కనిపిస్తుంది. మెడపై కూడా ఫౌండేషన్ వేసుకోవడం మరవొద్దు. అలా వేసుకుంటే ముఖంపై, మెడపై ఉన్న చర్మం సమాన చాయలో కనిపిస్తాయి. మీకు సరిపడిన ఫౌండేషన్ షేడ్ ఎంచుకునే విషయంలో చర్మనిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News