Friday, November 22, 2024
Homeహెల్త్Masala Milk: చలి నుంచి కాపాడే మసాలా దూద్

Masala Milk: చలి నుంచి కాపాడే మసాలా దూద్

చలి నుంచి కాపాడే మసాలా దూద్…
చలి బాధలను మసాలా మిల్క్ ఇట్టే పోగొడుతుంది. మీఈ ఆరోగ్యాన్ని పెంచుతుంది. పాలలోని కాల్షియం, పొటాషియం, ప్రొటీన్, విటమిన్లు మీ ఆరోగ్యాన్ని కాపాడతాయి. ముఖ్యంగా చలికాలంలో మసాలా దూద్ చేసే మేలు ఎంతో. ఏలకులు, శొంఠి, నల్లమిరియాలు, పసుపు, కుంకుమపువ్వు, రకరకాల నట్స్ మిశ్రమాన్ని పాలల్లో కలుపుకుని తాగితే చలి పులి తెచ్చే అనారోగ్యాలు మీ దరికి చేరవు. ఈ మసాలా పాలు రుచితో పాటు శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తాయి.

- Advertisement -

పాలల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది కాలరీలను తగ్గించడంతో పాటు ఎముకలను ద్రుఢతరం చేస్తుంది. పైగా ఇందులోని ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. ఇక ఇందులోని ఎనర్జీ మీకు బోలెడు శక్తిని అందిస్తుంది. అలసిన కండరాలకు సాంత్వననిస్తుంది. ముఖ్యంగా మసాలా పాలకు ఉపయోగించే పొడి ప్రత్యేకమైంది. దీన్ని ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోవచ్చు. బాదం, జీడిపప్పు, పిస్తాలె ఈ పాల తయారీలో చాలా కీలకం. వీటిని పొడి ప్యాన్ లో వేసి కమ్మటి వాసన వచ్చేదాకా(నూనె వేయకుండా) వేగించాలి. ఇవి వెలువరించే సువాసనలేఈ మసాలా పాల అసలైన ప్రత్యేకత. ఈ నట్స్ ను వేగించిన తర్వాత బాగా చల్లారబెట్టాలి. ఆతర్వాత వాటిని గ్రైండ్ చేయాలి. ఈ నట్స్ ను వేడి మీద గ్రైండ్ చేస్తే ఆ పొడి ముద్దగా అవుతుంది. అందుకే వేగించిన నట్స్ బాగా చల్లారిన తర్వాతే వాటిని మిక్సర్ వేసి పొడి చేయాలి.

డ్రై ఫ్రూట్స్, నట్స్, పసుపు, కుంకుమపువ్వు, ఏలకుల పొడి, మిరియాలు, శొంఠి అన్నీ కలిపి గ్రైండ్ చేయాలి. ఈ పొడి కొద్దిగా గరిగా ఉండేలా చూసుకోవాలి. ఈ పొడిని ఒక గ్లాస్ జార్ లో పోయాలి. ఈ పొడి సహజసిద్ధమైన రుచి, వాసనలు పోకుండా ఉండాలంటే ఆ పొడిని ఫ్రిజ్ లో ఉంచాలి. అలా మసాలా మిల్క్ పొడి రెడీ . మీరు చేయాల్సిందల్లా రాత్రి నిద్రపోయేముందు వేడి వేడి పాలల్లో ఒక చెంచా దూద్ మసాలా పొడి వేసుకుని బాగా కలుపుకుని తాగాలి. అంతే…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News