Saturday, October 5, 2024
Homeహెల్త్Massage Mantra: ఆరోగ్యానికి మసాజ్ మంత్ర

Massage Mantra: ఆరోగ్యానికి మసాజ్ మంత్ర

ఆరోగ్యంగా ఉండడానికి ఫిట్ నెస్, మంచి డైట్ , నిద్ర వంటివి ఎంత అవసమరమో శరీరానికి మసాజ్ కూడా అంతే అవసరం. ఇది నరాలకు బలం ఇవ్వడమే కాకుండా మనల్ని వేధించే రకరకాల ఒత్తిడుల నుంచి గొప్ప ఉపశమనం ఇస్తుంది. అంతేకాదు మనల్ని మానసికంగా, శారీరకంగా ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే మసాజ్ వల్ల పొందే ప్రయోజనాలు కొన్ని మీకోసం..
 లోషన్, ఆయిల్స్ తో శరీరం మసాజ్ చేసుకోవడం వల్ల చర్మానికి జంటిల్ ఎక్స్ ఫొయిలేషన్ అవుతుంది. దీంతో చర్మంలో కొత్త కణాలు పుట్టడంతోపాటు చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.
 శరీరంలో నొప్పులు, టెన్షన్ ఉంటే దానికి కారణం బిగుసుపోయిన కండరాల కారణంగా నరాలపై ఒత్తిడి పడడమే. దీని నుంచి బయటపడడానికి మసాజ్ బాగా పనిచేస్తుంది. శరీరం రిలాక్స్ అయితే నరాలు సేదదీరుతాయి.

- Advertisement -

 నరాలు రిలాక్సింగ్ గా ఉంటే శరీరంలోని హార్మోన్ల ఉత్పత్తి కూడా సమతుల్యంగా ఉంటుంది. కోర్టికోస్టరాయిడ్స్ లాంటి స్ట్రెస్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గి ఎండార్ఫిన్ లాంటి ‘ఫీల్ గుడ్’ హార్మోన్లు శరీరంలో పెరుగుతాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మసాజ్ కారణంగా హార్మోన్లు స్లీప్\వేక్ సైకిల్ ను క్రమబద్ధమవుతుంది. అంతేకాదు బషిష్టులను, రోగనిరోధక కణాలను, బ్లడ్ షుగర్ ను క్రమబద్ధీకరిస్తుంది. అలాగే ఎంత తినాలి అన్న వాటినీ మసాజ్ శక్తివంతంగా క్రమబద్ధీకరిస్తుంది. మసాజ్ వల్ల కండరాలు రిలాక్స్ అయి శరీర క్రియలన్నీ పద్ధతిగా జరుగుతాయి.
 మసాజ్ చేసేటప్పుడు బాడీ స్ట్రెచ్ మూవ్ మెంట్స్ కూడా చేస్తే కీళ్లు బాగా పనిచేస్తాయి. మసాజ్ వల్ల కండరాలు, లిగమెంట్ల మీద సరిపడినంత టెన్షన్ పడి ద్రుఢంగా పనిచేస్తాయి.
 మసాజ్ వల్ల ఎముకలకు రక్త సరఫరా మెరుగుపడుతుంది. ఎముకలకు రక్త ప్రవాహం బాగా జరగడం వల్ల కాల్షియం, ఇతర ఖనిజాలు వాటికి బాగా అంది ద్రుఢంగా తయారవుతాయి.
 మసాజ్ గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరంలోని అన్ని అవయవాలకు రక్తప్రవాహంతో పాటు ఆక్సిజన్ బాగా జరిగేలా చేస్తుంది. కార్డియోవాస్క్యులర్ వ్యవస్థ రిలాక్స్ అవుతుంది.
 ఒత్తిడి జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. జీవక్రియ సరిగా జరగదు. మసాజ్ వల్ల శరీరానికంతటికీ ఆహారం, పోషకాలు సరిగా అందేలా జీర్ణక్రియ బాగా జరుగుతుంది.
 మసాజ్ చేయడానికి ముందు ఊపిరి లోపలికి బాగా తీసుకోవాలని థెరపిస్టులు అడుగుతుంటారు. ఊపిరి సరిగా తీసుకోవడం వల్ల కండరాలపై ఒత్తిడి తగ్గుతుంది. మసాజ్ తో టెన్స్ మజిల్స్ ను రిలాక్స్ చేయడం వల్ల కండరాలు బిగుసుకుపోవడం తగ్గి ఊపిరి బాగా తీసుకోగలం.
 మసాజ్ వల్ల మైగ్రైన్, తలనొప్పుల్లాంటివి కూడా తగ్గుతాయి. శరీరం మసాజ్ నిత్యం చేసుకోవడం వల్ల శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. జీవనశైలికి సంబంధించిన పలు ఆరోగ్యసమస్యలు తలెత్తవు.
 మసాజ్ మూడ్ బూస్టర్ కూడా. నరాల వ్యవస్థ రిలాక్సు అవడం వల్ల మానసికంగా ఎంతో ఉత్సాహంగా ఉంటారు. యాంగ్జయిటీ, డిప్రషన్ లాంటి వాటిని కూడా మసాజ్ తగ్గిస్తుంది. వెన్నునొప్పిపై కూడా మసాజ్ బాగా పనిచేస్తుంది.
 మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
 మసాజ్ స్ట్రెస్ బస్టర్ గా పనిచేస్తుంది. ఎప్పుడైతే ఒత్తిడి తగ్గుతుందో ప్రశాంతమైన నిద్ర పడుతుంది. మెంటల్ క్లారిటీ తో పాటు ఏకాగ్రత పెరుగుతుంది. బ్రెయిన్ కు రక్తప్రవాహం సరిగా జరిగి మానసిక అలసట పోయి రిలాక్సు అవుతారు.
 మసాజుల్లో వివిధ రకాలు ఉన్నాయి. ఉదాహరణకు స్వీడిష్ మసాజ్. ఇది ఎంతో జంటిల్ మసాజ్ టెక్నిక్. ఇది శరీరాన్ని బాగా రిలాక్స్ చేస్తుంది. ఈ మసాజ్ చేసేటప్పుడు థెరిపిస్టు లాంగ్ స్ట్రోక్స్, నెడింగ్, డీపర్ సర్క్యులర్ మూవ్ మెంట్స్ అనుసరిస్తారు. డీప్ మసాజ్ ఇంకొకరకం. లిటిల్ స్ట్రోక్స్ తో కొద్దిగా ఎక్కువ ప్రెషర్ పెడుతూ దీన్ని చేస్తారు. ఇది కండరాలలోని పొరలపై, టిష్యూల్లోపలికి సైతం మంచి ప్రభావం చూపుతుంది. గాయాలైనపుడు ఈ రకమైన మసాజ్ చేస్తారు. స్పోర్ట్స్ మసాజ్ మరోరకం. ఇది కూడా స్వీడిష్ మసాజ్ లాగే ఉంటుంది.

గాయాల నుంచి తేరుకుంటున్న క్రీడాకారులు, గాయాలు కాకుండా ఉండేందుకు కొంతమంది క్రీడాకారులు ఈ రకమైన మసాజ్ ను చేయించుకుంటారు. ట్రిగ్గర్ పాయింట్ మసాజ్ ఇంకొకటి. దీన్ని టెన్షన్, టైట్ నెస్ లు ఉన్నచోట చేస్తారు. దీన్ని చేయించుకోవడం వల్ల ఆ భాగాల్లో ప్రెషర్ పోతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News