Sunday, September 8, 2024
Homeహెల్త్Massage mantra to skin: మీ చర్మాన్ని మెరిపించేది మసాజే

Massage mantra to skin: మీ చర్మాన్ని మెరిపించేది మసాజే

చర్మాన్ని చమక్ మనిపించే ఫేషియల్ మసాజ్
ఫేషియల్ మసాజ్ చర్మాన్ని మెరిపిస్తుంది. ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు స్కిన్ టెక్స్చెర్, టోన్లను మెరుగుపరుస్తుంది. ఫేషియల్ మసాజ్ వల్ల రక్త ప్రసరణ బాగా జరగడమే ఇందుకు కారణం. అంతేకాదు ఫేషియల్ మసాజ్ చేసుకుంటే కళ్ల కింద ఉబ్బరించడం కూడా తగ్గుతుంది. కొల్లేజెన్ ఉత్పత్తిని ఇది పెంచుతుంది. నిత్యం ఫేస్ మసాజ్ చేసుకోవడం వల్ల చర్మం అన్ని రకాల బ్యూటీ ఉత్పత్తులను లోపలికంటా సులభంగా గ్రహిస్తుంది. దీంతో ముఖం మరింత కాంతివంతంగా తయారవుతుంది. ఫేషియల్ మసాజ్ అనేది కాస్మొటిక్ ట్రీట్మెంట్. ముఖాన్ని, మెడభాగాన్ని చేతులతో లేదా ఫేషియల్ మెషినరీని ఉపయోగించి మసాజ్ చేస్తారు. ఇలా మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. అంతేకాదు ఫేషియల్ మసాజ్ మనకు ఎంతో రిలాక్సేషన్ కూడా ఇస్తుంది. దీంతో చర్మం కూడా చూడడానికి కాంతివంతంగా తయారవుతుంది. దీంతో చర్మం ఎంతో యవ్వన మెరుపుతో కనిపించడమే కాదు చర్మ రంగు కూడా మెరుగుపడుతుంది. అందుకే మీ మోము లేదా చర్మం అందంగా కనిపించాలంటే ఫేషియల్ మసాజ్ ను సూచిస్తుంటారు ఎంతోమంది బ్యూటీ నిపుణులు.
ఫేషియల్ మసాజ్ లో ఎన్నో రకాల పద్ధతులు కూడా ఉన్నాయి. వీటిల్లో స్వీడిష్ మసాజ్ ఒకటి. ఇది రక్తప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. ఫేషియల్ కండరాలకు ఎంతో రిలాక్సేషన్ అందిస్తుంది. చర్మం కూడా చూడడానికి ఎంతో అందంగా తయారవుతుంది. ఆక్యుప్రెషర్ అనే మసాజ్ ఉంది. ఇది ముఖంపై, మెడపై, తలపై ఉండే ప్రెషర్ పాయింట్స్ కు రక్తప్రసరణ బాగా అయ్యేట్టు చేయడం ద్వారా ఎనర్జీని పెంచుతుంది. లింఫటిక్ డ్రైనేజ్ అనే మసాజ్ ఉంది. ఇది లింఫటిక్ వ్యవస్థను శక్తివంతం చేయడం ద్వారా చర్మం ఉబ్బరింపును, వాపును తగ్గిస్తుంది. గువా షా అనే చైనా మసాజ్ టెక్నిక్ ఉంది. ఇది శరీరంలోని విషతుల్యమైన పదార్థాలను బయటకు పోగొడుతుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. హాట్ స్టోన్ మసాజ్ అని ఉంది. ఇందులో గోరువెచ్చదనంతో ఉన్న స్టోన్స్ ను ఉపయోగించి మసాజ్ చేయడం ద్వారా రక్తప్రసరణను మెరుగుపరచడంతో పాటు కండరాలకు కావలసినంత సాంత్వనను ఈ మసాజ్ టెక్నిక్ అందిస్తుంది. సైనస్ మసాజ్ అని కూడా ఉంది. ఇదొక రకమైన ఫేషియల్ మసాజ్.

- Advertisement -

ఇందులో ముఖంపై ఉన్న కొన్ని ప్రెషర్ పాయింట్లపై సున్నితంగా ఒత్తిడి తీసుకొచ్చి తద్వారా సైనస్ ప్రెషర్, ఇబ్బంది నుంచి సాంత్వననిస్తుంది. ఇంకా కప్పింగ్ వంటి అనేక రకాల ఫేషియల్ మసాజ్ పద్ధతులు ఉన్నాయి. ఫేషియల్ మసాజ్ చేయడానికి ముందు మీ చర్మం టైపు, చర్మసమస్యలు ఏవైనా ఉంటే ఆ వివరాలు, అలాగే ఫేషియల్ మసాజ్ ద్వారా ఎలాంటి ప్రయోజనాలను పొందాలనుకుంటున్నారు అనే విషయాలను ఫేషియల్ మసాజ్ థెరపిస్టులు మిమ్మల్ని అడిగి
తెలుసుకుంటారు. ఈ థెరపీని ప్రారంభించేటప్పుడు వారు చేసే మొదటి పని ముఖాన్ని బాగా శుభ్రం చేయడం. అంతేకాదు ముఖానికి ఉన్న మేకప్ ను తొలగించడంతో పాటు చర్మంపై పేరుకున్న మురికిని, ఇతర మలినాలను పూర్తిగా పోయేలా క్లీన్ చేస్తారు. మీ ముఖం, చర్మాలను పరిశుభ్రం చేసిన తర్వాత స్ట్రోకింగ్, నెడింగ్, ప్రెషర్ అప్లికేషన్ల వంటి అనేక మసాజ్ టెక్నిక్స్ ను థెరపిస్టు ఉపయోగిస్తారు. ఇవన్నీ ముఖంలో రక్తప్రసరణ బాగా జరిగేలా చేస్తాయి. అంతేకాదు చర్మం రిలాక్స్ అవడంతో పాటు ఎంతో కాంతివంతంగా, ఆరోగ్యంగా తయారవుతుంది.

ఫేషియల్ మసాజ్ చేసేటప్పుడు థెరపిస్టులు ఫేషియల్ మసాజ్ రోలర్, స్కిన్ మసాజింగ్ డివైజ్, క్లీన్ బ్రషెస్ వంటివాటిని ఉపయోగిస్తారు. ఇవి చేయించుకున్న తర్వాత మీరు ఎంతో స్ట్రెస్ ఫ్రీ అవుతారు. ఫేస్ మసాజ్ లో హైఫ్రీక్వెన్సీ టెక్నిక్ అని ఉంది. ఇది యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ కి ఎంతో తోడ్పడుతుంది. ఈ తరహా టెక్నిక్ ఎలాస్టిన్ స్వభావాన్ని మెరుగుపరచడమే కాకుండా కొల్లాజిన్ ఉత్పత్తిని సైతం పెంచుతుంది. ఫేస్ మసాజ్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ కేర్ పట్ల తప్పకుండా శ్రద్ధవహించాలి. ముఖానికి క్రీము రాసుకోవడం నుంచి చర్మానికి మాయిశ్చరైజర్ అందించే వరకూ జాగ్రత్త వహించాలి. అలాగే చర్మంపై చేయకూడని ప్రయోగాలేమిటో కూడా తెలుస్తుంది. ఫేషియల్ ట్రీట్మెంటు పూర్తవడానికి అరగంట నుంచి గంట సమయం పడుతుంది. ఫేషియల్ చేయించుకున్న వెంటనే మీ చర్మం ఎంతో కాంతివంతంగా ఉండడమే కాదు ముఖం రెట్టింపు తాజాదనంతో మెరిసిపోతుంది.

ఫేషియల్ మసాజ్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇది చేయించుకుంటే ఒత్తిడి తగ్గుతుంది. రక్తప్రసరణ బాగా జరుగుతుంది. చర్మం ఎలాస్టిసిటీ పెరుగుతుంది. అలాగే చర్మం మంచి బిగువును సంతరించుకుంటుంది. అంతేకాదు చర్మం టెక్స్చెర్ , టోన్లు మెరుగుపడతాయి. ముఖంపై గీతలు, ముడతలు పడ్డం తగ్గుతాయి. ఫేషియల్ మసాజ్ వల్ల మానసిక ఆరోగ్యం కూడా ఎంతో బాగుంటుంది. ఒత్తిడి నుంచి విముక్తిపొందుతారు. ఫేషియల్ మసాజ్ మానసికంగా ఎంతో రిలాక్సేషన్ ఇస్తుంది. మూడ్స్ బాగుంటాయి. అందరితో ఎంతో ఆత్మగౌరవంతో, స్థైర్యంతో మసలుకుంటారు. మీ ఆరోగ్యం కూడా బాగుండి ఎప్పుడూ ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. మైండ్ రీసెట్ అయి మరింత శక్తిని పుంజుకుంటుంది.

చర్మం కాంతివిహీనంగా ఉన్నా, యాక్నే సమస్యతో బాధపడుతున్నా వాటిని సైతం ఫేషియల్ మసాజ్ పరిష్కరిస్తుంది. ఫేషియల్ మసాజ్ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ గా కూడా పనిచేస్తుంది. ఈ ఫేషియల్ మసాజ్ తో అందరూ అంటే ఎలాంటి చర్మం టైపు ఉన్నవారైనా, వయసు వారైనా, రకరకాల స్కిన్ కండిషన్లతో బాధపడుతున్న వారైనా మంచి ఫలితాలు పొందుతారు. తలనొప్పి, మైగ్రేన్, ఫేషియల్ మజిల్ టెన్షన్ తో బాధపడుతున్న వారు కూడా ఫేషియల్ మసాజ్ తో వీటి నుంచి వెంటనే సాంత్వన పొందుతారు. తరచూ ఫేషియల్ మసాజ్ చేయించుకుంటే తలనొప్పి, మైగ్రేన్లు తరచూ రావడం కూడా బాగా తగ్గుతుంది. ఫేషియల్ మసాజ్ థెరపిస్టు నిపుణుల దగ్గర మీరూ ఈ ట్రీట్మెంట్ పొంది అందరిలో చమక్ అంటూ మెరిసిపోండి…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News