Thursday, December 12, 2024
Homeహెల్త్12 year girl got successful brain tumor surgery: 12 ఏళ్ళ చిన్నారికి...

12 year girl got successful brain tumor surgery: 12 ఏళ్ళ చిన్నారికి నూతన జీవితాన్ని అందించిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు

ఇది మెడికవర్ వైద్యుల అద్భుతం

మూడు నెలలు కోమాలో నుంచి కోలుకున్న చిన్నారి అక్షర, విజయవంతమైన మెడులోబ్లాస్టోమా బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ, 12 ఏళ్ళ చిన్నారికి నూతన జీవితాన్ని అందించిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు.

- Advertisement -

నిద్రపోతున్న పాపను చూసి

ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న 12 ఏళ్ల అక్షర తరగతిలో నిద్రపోవడం గమనించిన టీచర్లు మొదట చిన్న పాప అన్నం తినడం వల్ల నిద్రవస్తుందేమో అని అనుకున్నారు. కానీ అలా తరుచు నిద్రపోవడం గమనించిన టీచర్లు ఆమె తల్లిదండ్రులకు ఈ విషయాన్నీ తెలియచేసి వెంటనే డాక్టర్‌ను సంప్రదించమని సూచించారు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు పలు వైద్యులను సంప్రదించగా, అక్షరకు మెదడులో మెడులోబ్లాస్టోమా అనే మెదడు ట్యూమర్ ఉన్నట్టు తెలిసింది, ఇది బ్రెయిన్‌స్టెమ్‌ను ఒత్తిడి చేస్తూ నరాలకు అతుక్కొని ఉన్నది అని గుర్తిచడం జరిగింది. ట్యూమర్ స్థానం క్లిష్టమైనదిగా ఉండటం వల్ల, ఆపరేషన్‌లో పక్షవాతం లేదా ప్రాణాపాయం వంటి సమస్యలు రావచ్చని వయసు రీత్యా చిన్న పాపా అవ్వడం చేయటానికి కూడా ముందుకు రాలేక పోయారు.

రెండవ సర్జరీ కూడా
అటువంటి సమయంలో, అక్షర కుటుంబం సీనియర్ కన్సల్టెంట్ న్యూరో & స్పైన్ సర్జన్ డా. శ్రీకాంత్ రెడ్డిని సంప్రదించారు. పరిస్థితిని పూర్తిగా విశ్లేషించిన డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, ఆపరేషన్ చేసి మొదట ట్యూమర్ గడ్డని తొలగించడం పాప ప్రాణాలను కాపాడారు. ట్యూమర్‌ను పూర్తిగా తొలగించ గలిగారు, కానీ ఆపరేషన్ తరువాత అక్షర హైడ్రోసెఫలస్ అనే సమస్యకు గురైంది, దీనిని సరిచేయడానికి వెంట్రికులో పెరిటోనియల్ (వీపీ) షంట్ కోసం రెండవ సర్జరీ చేయాల్సి వచ్చింది. క్లిష్టమైన ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిన తర్వాత, అక్షర మూడు నెలలపాటు కోమాలోకి వెళ్లింది. ఈ కఠిన పరిస్థితుల్లో డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి మరియు ఆయన బృందం నిరంతర చికిత్స అందించారు. ఒక రాత్రి, అక్షర ఆకస్మాత్తుగా మేల్కొని తన తండ్రితో మాట్లాడింది, ఇది ఆమె కోలుకోవడంలో ముఖ్యమైన ఘట్టమైంది. ఆ తర్వాత తీసిన స్కాన్లు ఆమె పూర్తిగా కోలుకున్నదని నిర్ధారించాయి.

ఆసుపత్రికి టైంకి వచ్చారు
అనంతరం డాక్టర్ మాట్లాడుతూ అత్యంత క్లిష్టమైన ప్రేదేశంలో చిన్న మెదడుకు ట్యూమర్ వత్తుకొంటూ అతుక్కొని ఉండటం సర్జరీ చాల ఖచ్చితత్వంతో చేయడం, పాప సరైన సమయంలో రావడం వల్ల ప్రాణాలతో బైట పడింది అని అన్నారు.

డాక్టర్ కి థాంక్స్
తమ కూతురి ప్రాణాలను కాపాడినందుకు మరియు కుటుంబంలో సంతోషాన్ని పునరుద్ధరించినందుకు అక్షర కుటుంబం డాక్టర్ శ్రీకాంత్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసి ఆయనను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ నిత్య పాలపాటి, అనస్థీషియాలజిస్ట్ ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News