Saturday, November 23, 2024
Homeహెల్త్Recipe to grow hair: ఇది తింటే జుట్టు పెరుగుతుంది

Recipe to grow hair: ఇది తింటే జుట్టు పెరుగుతుంది

30 గ్రాములు తీసుకోండి, మిరకిల్స్ జరుగుతాయి

జుట్టును పెంచే రెసిపీ

- Advertisement -

జుట్టు బాగా రాలిపోతోందా? ఆందోళన చెందొద్దు. శిరోజాలు బాగా పెరిగే పౌడర్ రెసిపీ ఉందంటున్నారు డైటీషియన్లు. అంతేకాదు దీన్ని మీ వంటింట్లోనే సులువుగా తయారుచేసుకోవచ్చని కూడా చెపుతున్నారు. ఈ రెసిపీ తీసుకుంటే జుట్టు రాలిపోవడంతో పాటు వెంట్రుకల ఒత్తుదనం, మెరుపు పోతున్నాయనే ఆందోళనను ఆమడదూరం పోగొట్టొచ్చంటున్నారు. డైటీషియన్ రిచా గంగానీ అలాంటి అద్భుతమైన ‘మిక్స్ రెసిపీ’ని మీకు చెపుతున్నారు. ఈ హెయిర్ కేర్ రెసిపీ తయారీ కూడా చాలా సింపుల్ అని
అంటున్నారామె.

ఒక కప్పు అవిశెగింజలు, ఒక కప్పు నువ్వులు, ఒక కప్పు పొద్దుతిరుగుడు గింజలు, ఒక కప్పు జనపనార విత్తనాలు ఒక కప్పుడు గుమ్మడి గింజలు, ఒక కప్పు బాదం గింజలు వీటన్నింటినీ కలిపి బ్లెండర్ లో వేసి మెత్తటి పొడిలా చేసి ఆ పొడిని గాలి చొరబడని గాజు జార్ లో పోసి భద్రం చేసుకోమంటున్నారు. ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ గింజల పొడిని 30 గ్రాములు తీసుకుని దాన్ని ఒక గ్లాసుడు పాలలో వేసి బాగా కలిపి నిత్యం తాగితే చాలంటున్నారు. అంతేకాదు ఈ పొడిని సలాడ్స్ పై కూడా చల్లుకోవచ్చు. అలాగే ఈ పొడితో లడ్డూలను కూడా చేసుకోవచ్చు. ఈ పిండితో చేసే లడ్డూల్లో ఖర్జూరం పండు ముక్కలు కూడా కలిపితే మరింత మంచిదని డైటీషియన్ రీచాన్ సూచిస్తున్నారు. అయితే ఏదైనా అతి ఎప్పుడూ
మంచిది కాదు కాబట్టి ఈ పొడిని తగిన పాళ్లల్లో మాత్రమే తీసుకోవాలని కూడా ఆమె చెపుతున్నారు.

ఈ పొడిలో కలిపిన రకరకాల గింజలు జుట్టు పెరుగుదలకు ఎంతో సహకరిస్తాయని ఆమె వివరించారు. ముఖ్యంగా అవిశెగింజల్లో యాంటాక్సిడెంట్లు, ఇతర ఎసెన్షియల్ న్యూట్రియంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి నాణ్యమైన శిరోజాల పెరుగుదలకు ఎంతగానో తోడ్పడతాయి. జుట్టు రాలిపోకుండా సరంక్షిస్తాయి. ఈ పొడిలో ఉపయోగించిన జనపనార గింజల్లో ఎన్నో వైద్య సుగుణాలు దాగున్నాయి. ఈ గింజల నుంచి తయారుచేసిన ఆయిల్ లో ఎన్నో విటమిన్లు, ప్రొటీన్లు, ఆరోగ్యవంతమైన ఫ్యాటీయాసిడ్లు ఉన్నాయి. ఇవి జుట్టును పట్టులా చేయడమే కాదు వెంట్రుకలు సిల్కీగా ఉండి మెరుస్తుంటాయి. ఈ పౌడర్ లో కలిపిన నువ్వుల్లో ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 9 ఫ్యాటీయాసిడ్లు ఉన్నాయి. ఇవి శిరోజాల పెరుగుదలకు ఎంతో తోడ్పడతాయి. అంతేకాదు ఇవి శిరోజాలకు మంచి కండిషనర్ గా పనిచేస్తూ, వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.

ఇక ఈ పొడిలో వాడిన పొద్దుతిరుగుడు గింజల్లో గమ్మ లినోలెనిక్ యాసిడ్ ఫ్రీ రాడికల్ డ్యామేజిపై పోరాడుతుంది. వెంట్రుకల డీప్ కండిషనింగ్ ను పరిరక్షిస్తుంది. జుట్టు కుదుళ్లను ద్రుఢంగా చేస్తుంది. ఇక గుమ్మడి గింజలను కూడా ఈ పొడిలో వేశాం కదా. ఈ గింజల్లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. అలాగే లినోలెనిక్ యాసిడ్ కూడా బాగా ఉంటుంది. ఇవి శరీరంలోని పోషకాహారలేమిని పోగొట్టి శిరోజాలు రాలకుండా కాపాడతాయి. వీటిల్లోని యాంటి ఇన్ఫ్లమేటరీ సుగుణాలు శిరోజాల పెరుగుదలకు సైతం ఎంతో తోడ్పడతాయి. చివరిగా ఈ పొడిలో బాదం పప్పులను కూడా కలిపాం కదా. బాదం పప్పుల్లో విటమిన్ బి7, విటమిన్ ఇ, ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్లు ఉన్నాయి.


ఇవన్నీ శిరోజాలు బాగా పెరిగేలా చేస్తాయి. జుట్టు కుదుళ్లను పరిరక్షిస్తాయి. జుట్టు మరింతగా పెరగడానికి సహకరిస్తాయి కూడా. మీ ఆరోగ్య పరిస్థితులను బట్టి వైద్యుల సలహా తీసుకుని ఈ పొడిని వాడితే మంచి ఫలితాలు చూస్తారంటున్నారు పలువురు డైటీషియన్లు కూడా.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News