మాన్సూన్ డైట్ టిప్స్ …
గాలిలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల మన శరీరంలో ఇన్ఫెక్షన్లు తలెత్తే అవకాశాలు ఉంటుంది. అందులోనూ మాన్సూన్ సీజన్ లో ఈ ప్రమాదం మనకు ఎక్కువగా పొంచి ఉంటుంది. అందుకే ఈ సీజన్ లో మనం ఎలాంటి డైట్ తీసుకుంటున్నామన్నది కూడా చాలా ముఖ్యమైన విషయం. అందులో వర్షాలు పడేటప్పుడు ఎంతో రుచిగా ఉండే ఫుడ్స్ మీదకు మనకు మనసు పోతుంటుంది. ఆక్షణాల్లోనే మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే ఈ సీజన్ లో సీజనల్ ఇన్ఫెక్షన్ల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. జలుబు, జీర్ణశక్తికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు మనల్ని బాగా బాధపెడుతుంటాయి.
అందుకే మాన్పూన్ డైట్ టిప్స్ తప్పనిసరిగా పాటించాలి. అలా చేయడం వల్ల దీర్ఘకాలంపాటు ఇన్ఫెక్షన్ల బారిన పడం. ఇన్ఫెక్షన్ల ప్రమాదం మాన్సూన్ సీజన్ లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి శరీరంలో రోగనిరోధక శక్తిని బాగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. జీర్ణశక్తి దెబ్బ తినకుండా ఉండే ఫుడ్స్ అంటే ఇడ్లీ, దోసెల వంటివి తినాలి. అలాగే ఇంట్లో తయారుచేసుకునే హెర్బల్ టీలను తాగితే మంచిది. రోగనిరోధకశక్తిని పెంచే వేడి వేడి సూపులు కూడా తాగొచ్చు. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే మీ శరీరం పనితీరు ఎలా ఉందో జాగ్రత్తగా గమనించుకుంటుండాలి. వేడి పదార్థాలు, అదీ ఇంట్లో వండిన పదార్థాలు మాత్రమే ఈ సీజన్ లో తినాలి. పచ్చి కాయగూరలు వంటివాటి జోలికి పోకుండా ఉండడమే మంచిది. కొందరు పచ్చి
సలాడ్లను తీసుకుంటుంటారు. ఈ సీజన్ లో వీటికి కూడా దూరంగా ఉంటే మంచిది. అలాగే కూరగాయాలను ఉడకబెట్టుకుని తింటే చాలా మంచిది.
మాన్సూన్ సీజన్ లో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. అయినా కూడా ఈ టైములో రోజులో మధ్య మధ్యలో బాగా నీటిని తాగుతుండాలని పోషకాహారనిపుణులు చెప్తున్నారు. సీజనల్ పళ్లు అంటే నేరేడు, యాపిల్,దానిమ్మ, అనాస, చెర్రీల వంటివి బాగా తినాలి. వీటిని తినడం వల్ల శరీరానికి సరిపడినంత నీరు అందుతుంది. వేడి వేడి పలుచటి సూప్స్, స్ట్యూయ్స్ తాగితే కూడా చాలా మంచిది. ఈ సీజన్ లో చల్లటి డ్రింకుల జోలికి అస్సలు వెళ్లకూడదు. దగ్గువంటి వాటికి కారణమయ్యే డ్రింకులకు చాలా దూరంగా ఉండాలి. అలాగే ఈ సీజన్ లో కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినడం వల్ల శరీరం ఎనర్జీగా ఉండడంతో పాటు జీర్ణశక్తి కూడా బాగుంటుంది. బయట ఫుడ్స్, తినుబండరాలను కూడా తినకూడదు. ఇంట్లో చేసుకున్న వాటిని తింటేనే ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది.
మసాలా, మైదా ఫుడ్స్ జోలికి అసలు వెళ్లకూడదు. నీళ్లు బాగా తాగడం వల్ల ఆహారం బాగా జీర్ణమవుతుంది. మాన్సూన్ సీజన్ లో చర్మం ఎలా స్పందిస్తోందో తప్పనిసరిగా గమనించుకుంటుండాలి. మన శరీర స్థితిని మొదట మనకు తెలియజెప్పేది చర్మమే అని మరవొద్దు. అందుకే చర్మం ఆరోగ్యంగా ఉండేట్టు చూసుకోవాలి. మాయిశ్చర్ ఫ్రీగా ఉంచుకోవాలి. లేకపోతే బాక్టీరియా సంబంధిత జబ్బులు చర్మంపై తలెత్తే అవకాశం ఉంది. ఇందుకు పోషకాలతో కూడిన స్కిన్ టానిక్ ఒకటి ఉంది. ఒక నిమ్మకాయ తీసుకుని దాని రసం పిండుకుని రెడీగా పెట్టుకోవాలి. అలాగే ఒక అంగుళం సైజు అల్లం ముక్క, పసుపు కొమ్ము ముక్క,
ఆరు మిరియాలు, 300 ఎంఎల్ నీరు రెడీగా పెట్టుకోవాలి. వీటన్నింటీనీ కలిపి బ్లెండర్ లో కొట్టి ఆ డ్రింకును తాగితే శరీరంలోని మలినాలన్నీ బయటకుపోతాయి. దీంతో శరీరం, చర్మం రెండూ ఎంతో
ఆరోగ్యంగా, మరెంతో తాజాగా ఉంటాయి. మరి ఇవి పాటిస్తారు కదూ..