Homeహెల్త్Heart Attack: ఆ సమయంలోనే హార్ట్‌ ఎటాక్‌ రిస్క్ ఎక్కువ.. ఎందుకు?

Heart Attack: ఆ సమయంలోనే హార్ట్‌ ఎటాక్‌ రిస్క్ ఎక్కువ.. ఎందుకు?

Heart Attack Risk: ఎంతోమంది తరచూ గుండెపోటుకు గురవుతుంటారు. ఈ మధ్య హార్ట్‌ ఎటాక్‌ మరణాలు ఎక్కువగా వింటున్నాం. ఎలాంటి వ్యాధి అయిన ముందుగా మనకు కొన్ని సంకేతాలు ఇస్తుంది. అవి మనం గుర్తించగలం కూడా. కానీ, హార్ట్‌ ఎటాక్‌ని ముందుగా గుర్తించడం కష్టం. ఇది ఇచ్చే సంకేతాలను కూడా మనం గమనించలేం.

- Advertisement -

అందుకే గుండెపోటు మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. అయితే, బాధితుల్లో చాలా మంది ఉదయం పూట మాత్రమే గుండెపోటుకు గురవుతున్నారని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. మిగతాసమయాలతో పోలిస్తే కేవలం మార్నింగ్‌ అవర్స్‌లోనే 20 నుంచి 40 శాతం హార్ట్ ఎటాక్స్ సంభవిస్తుంటాయని యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ(ESC) స్టడీ తమ ఆధ్యయంలో వెల్లడించింది. దీనికి కారణం శరీరంలోని సిర్కాడియన్ రిథమ్ (Circadian Rhythm) అని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

సిర్కాడియ్‌ రిథమ్‌ అంటే
నిజానికి సిర్కాడియన్ రిథమ్ అనేది సహజమైన అంతర్గత శారీరక ప్రక్రియ. ఇది నిద్రపోవడం, మేల్కోవడం వంటి శరీర ధర్మాన్ని నిర్వర్తించడం.. నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాదు ఈ ప్రక్రియ ప్రతీ 24 గంటలకు పునరావృతం అవుతూ ఉంటుంది. అంటే.. శరీర గడియారంగా పనిచేస్తూ రక్తపోటు, హార్మోన్ల స్థాయిలు, గుండె పనితీరును నియంత్రిస్తుంది. ఈ ప్రాసెస్‌లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య సహజంగానే రక్తపోటు, ఒత్తిడి హార్మోన్ (Cortisol) స్థాయిలు గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

Also Read: DMHO Office: స్వచ్ఛత చెప్పే శాఖే.. చెత్తలో కూరుకుపోయింది..?

లక్షణాలు ఉంటే రిస్కే..
రక్తం గడ్డకట్టే సామర్థ్యం కూడా ఉదయంపూట ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రక్తనాళాలలో అడ్డంకులు ఏర్పడే ప్రమాదం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వంశ పారంపర్యంగా గుండె జబ్బులు ఉన్నావారిలో ఈ రిస్క్‌ ఎక్కువని చెబుతున్నారు. అందుకే ఉదయం పూట ఛాతీలో నొప్పి లేదా అసౌకర్యం (Center or left), శ్వాస ఆడకపోవడం, అకస్మాత్తుగా చెమటలు పట్టడం, వికారం, మైకం, లేదా భుజం, చేయి, దవడ, వీపు భాగాల్లో నొప్పి వంటి లక్షణాలు క్రమంగా పెరుగుతూ ఉంటాయి. తరచూ ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్లను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News