Mosquito coil side effects: దోమల బెడద ప్రతీ ఇంట్లో ఉంటుంది. వర్షాకాలంలో అయితే వాటి తీవ్రత మరీ ఎక్కువ. అయితే చాలా మంది దోమల నుంచి రక్షించుకునేందుకు మాస్కిటో కాయిల్స్ వాడుతారు. కానీ వాటి తీవ్రత దోమల కంట్ మనుషుల మీదే ఎక్కుగా ఉంటుందనే విషయం చాలా మందికి తెలియదు. అవి దోమలను మాత్రమే కాకుండా మన ఆరోగ్యాన్ని సైతం నాశనం చేస్తాయి. మాస్కిటో కాయిల్స్ నుంచి వచ్చే పొగను పీల్చడం వల్ల వివిధ ఆరోగ్య సమస్యలు వస్తాయి. మాస్కిటో కాయిల్స్ మనకు స్లో పాయిజన్‌లా పనిచేస్తాయని వైద్య నిపుణుల అంటున్నారు. ఇంతకీ మన ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం!
మాస్కిటో కాయిల్స్ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు: మాస్కిటో కాయిల్స్ విపరీతంగా వాడడంతో శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. కాయిల్స్ నుంచి వచ్చే పొగ ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. నిరంతరంగా ఈ పొగను పీలిస్తే ఆస్తమా, శ్వాస సమస్యలు మరియు దగ్గు వంటి వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా పిల్లలు ఉన్న ఇళ్లల్లో ఇది చాలా ప్రమాదకరం. మాస్కిటో కాయిల్స్‌లో క్యాన్సర్ కారకాలు సైతం ఉంటాయి. వీటిని రోజూ పీల్చడం వల్ల ఊపిరితిత్తులలో క్యాన్సర్ కణాలు పెరిగి.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మాస్కిటో కాయిల్స్ వల్ల చర్మంపై దద్దుర్లు మంటలు సైతం వచ్చే అవకాశం ఉంది. చర్మ అలెర్జీలు ఉన్నవారు వీటిని వాడకపోవడం మంచిది. కాయిల్స్ లోని వివిధ రసాయనాలు కొందరిలో తలనొప్పిని కూడా ప్రేరేపిస్తాయి. సాధారణంగా చాలా మందికి కాయిల్ వాసన చూడగానే తలనొప్పి వస్తుంది.
Also Read: https://teluguprabha.net/health-fitness/social-media-medical-advice-dangers-reels/
తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మస్కిటో కాయిల్స్‌ను ఎల్లప్పుడూ గాలి తగిలే ప్రదేశాలలో మాత్రమే ఉపయోగించాలి. ఎందుకంటే వాటి నుంచి వచ్చే పొగ ప్రభావం మనపై చాలా ఉంటుంది. పిల్లలు, పెంపుడు జంతువులకు మస్కిటో కాయిల్స్ దూరంగా ఉంచాలి. వీలైనంత వరకు.. ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు మస్కిటో కాయిల్స్ వాడటం మానేయడమే మంచిది. కాయిల్స్ వాడేటప్పుడు పొగను నేరుగా పీల్చడం చేయకూడదు. కాయిల్స్ నుండి వచ్చే పొగ ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. శరీరం ఏదైనా అసాధారణ లక్షణాలను చూపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. మాస్కిటో కాయిల్స్ వల్ల కలిగే చెడు ప్రభావాన్ని తగ్గించేందుకు వాటికి దూరంగా ఉండటం చాలా ఉత్తమని వైద్య నిపుణుల అంటున్నారు. వాటి బదులుగా, దోమల తెరలు లేదా సహజసిద్ధమైన పద్ధతులను ఉపయోగించడం మంచిదని చెబుతున్నారు.


