టీపొడిని ఒక పాత్రలో వేసి కాల్చితే ఆ ఘాటుకు ఇంట్లోని దోమలు పోతాయి. పుదీనా మొక్కను ఒక కుండీలో నాటి ఇంట్లో పెట్టుకుంటే ఆ ఘాటుకు దోమలు పారిపోతాయి. ఒక గ్లాసులో సగానికి నీళ్లు పోసి అందులో కర్పూరం బిళ్లలు వేస్తే వాటి వాసనకు దోమలు బయటకు పోతాయి. ఇలా ఈజీగా, సింపుల్ గా, చవకగా దోమలకు చెక్ పెట్టండి. మస్కిటో రెపిలెంట్స్, జెట్ మ్యాట్స్, అగర్బత్తీలతో లంగ్స్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ప్రమాదాలున్నాయి. పైగా కొంతమందికి ఈ వాసన అంటే అలర్జీ. ఆన్ టాప్ ఆఫ్ ఆల్ దిస్..ఇవన్నీ చాలా ఖరీదైనది. అదే రోజూ మనం తాగే చాయ్ పత్తా పడేయకుండా మొక్కల కోసమో లేక ఇలా దోమలు పారద్రోలేందుకో వాడితో బెస్ట్ కదా. పైగా ఇదంతా ఎకో ఫ్రెండ్లీ.