Homeహెల్త్Mouth taping: సైంటిఫిక్‌ ట్రెండ్‌గా మౌత్ టేపింగ్.. దీని గురించి తెలుసా?

Mouth taping: సైంటిఫిక్‌ ట్రెండ్‌గా మౌత్ టేపింగ్.. దీని గురించి తెలుసా?

Scientific trend mouth taping: ఈ మధ్య బాగా పాపులర్ అవుతున్న లేటెస్ట్ అండ్ సైంటిఫిక్ ట్రెండ్ మౌత్ టేపింగ్! రాత్రి పడుకునేటప్పుడు నోటికి ప్రత్యేకమైన పేపర్ టేప్ వేసుకోవడమే మౌత్ టేపింగ్. ముక్కు నుంచి శ్వాస తీసుకోవడమే ఆరోగ్యదాయకమైన శ్వాస విధానం. నోటితో గాలి పీల్చుకోవడం చాలా అనారోగ్యకరం. కానీ నోటితో గాలి పీల్చుకునే అలవాటు చాలా మందిలో ఉంటుంది. ముఖ్యంగా నిద్రలో నోరు తెరచి గాలి పీలుస్తుంటారు. ఇది క్రమంగా స్లీప్ ఆప్నియాకు దారి తియ్యవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దాన్ని నివారించేందుకే ఈ మౌత్ టేపింగ్.

- Advertisement -

ఇదొక గేమ్ ఛేంజర్?

నోటి శ్వాస వర్సెస్ ముక్కు శ్వాస: చాలామందికి తెలియకుండానే రాత్రి నోటితో శ్వాస తీసుకుంటారు. దీనివల్ల నిద్రలేమి, గురక, చిగుళ్ల సమస్యలు, ఉదయాన్నే నోరు పొడిబారడం జరుగుతాయి.

నైట్రిక్ ఆక్సైడ్ అద్భుతం: ముక్కు ద్వారా మాత్రమే శ్వాస తీసుకోవడం వల్ల శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి, బీపీని అదుపులో ఉంచుతుంది.

గాఢమైన నిద్ర: ముక్కు శ్వాస మన నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది. ఫలితంగా ఉదయాన్నే శరీరం అద్భుతమైన శక్తితో నిద్రలేస్తుంది.

ఎలా మొదలుపెట్టాలి?

మెడికల్ షాప్‌లో దొరికే సున్నితమైన ‘మైక్రోపోర్ పేపర్ టేప్’ చిన్న ముక్కను పెదవులపై నిలువుగా వేసుకోవాలి. సహజంగా ముక్కు ద్వారా మాత్రమే శ్వాస తీసుకోవడం తిరిగి అలవాటు చేసే ఈ ట్రెండ్ నిద్ర నాణ్యతను, ఆరోగ్యాన్ని తక్షణమే మారుస్తుంది.

—– భవాని

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News