Friday, September 20, 2024
Homeహెల్త్Mushroom coffee a must try: మష్రూం కాఫీ ట్రై చేశారా?

Mushroom coffee a must try: మష్రూం కాఫీ ట్రై చేశారా?

మష్రూమ్ కాఫీలో ఆరోగ్యం ఎంత?

ష్రూమ్ కాఫీ ఎప్పుడైనా తాగారా? అదేం కాఫీ అంటారా? మంచి స్టిమ్యులెంట్ కాఫీ… ఎంతో ఆరోగ్యాన్ని కూడా ఇచ్చే కాఫీట. ఆరోగ్యంగా ఉండడానికి నేడు ఎందరో సూచిస్తున్న బెవరేజ్ ఇది. ష్రూమ్ కాఫీ అంటే మష్రూమ్ కాఫీనే. మష్రూమ్ తో కాఫీ ఎలా సాధ్యం అంటారా? సాధ్యమే. నేడు మనం చూస్తున్న పలు ట్రెండీ ఫుడ్స్ లో ష్రూమ్ కాఫీ కూడా వచ్చి చేరింది. మనం తినే పుట్టగొడుగులు (మష్రూమ్స్)తో ఈ కాఫీని తయారుచేస్తారు. ఇందులో ఆరోగ్యప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ కాఫీని తాగడం వల్ల ఏకాగ్రత పెరగడమే కాదు ఒత్తిడి సైతం తగ్గుతుందిట. అంతేకాదు ఈ కాఫీలో యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా అధికంగా ఉన్నాయిట. జీర్ణవ్యవస్థను సైతం ఇది బాగా పనిచేసేలా చేయడంతో పాటు ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుందిట. పుట్టగొడుగుల పొడితో చేసిన ఈ కాఫీని ఉదయం తాగితే ఆ రోజంతా ఎంతో జోష్ గా ఉంటారని ఈ బివరేజ్ కి ష్రూమ్ కాఫీ ప్రియులు కితాబులిస్తున్నారు.

- Advertisement -

ఇందులో వైద్య గుణాలున్న మష్రూమ్ (నాణ్యత గల లయన్స్ మేన్ లాంటివి)ల పొడిని, మెత్తటి కాఫీ గింజల పొడిని తీసుకుని రెండిటినీ కలపాలి. కావాలనుకుంటే ఆ మిశ్రమంలో అశ్వగంధ, కొబ్బరినూనె వంటివి కూడా కలుపుకోవచ్చు. ఇందులో వాడుతున్న మష్రూమ్స్ లో ఎలాంటి సైకోయాక్టివ్ గుణాలు ఉండవు. రకరకాల మష్రూమ్ కాఫీ ఉత్పత్తులను మనదేశంలో నేడు ఎన్నో చూస్తున్నాం. ఇవన్నీ మనకు ఆరోగ్యాన్ని అందించేవే అంటున్నారు చాలామంది. పనిమీద ఏకాగ్రత పెట్టడంలో ష్రూమ్ కాఫీ ఎంతో
సహకరిస్తుందిట. బ్రెయిన్ పనితీరును సైతం పెంచుతుంది. చురుగ్గా ఉంచుతుంది. మిమ్మల్ని నలుగురు ముందూ ఎంతో ప్రొడక్టివ్ గా నిలుపుతుంది కూడా.

ఒత్తిడి హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు ఆరోగ్యకరమైన గట్ మైక్రోబియామ్ ను పెంపొందిస్తుంది. అయితే మష్రూమ్ కాఫీ గట్ హెల్త్ ను బాగుపరుస్తుందన్న మాటను కొందరు పోషకనిపుణులు అంగీకరించడం లేదు. గట్ హెల్త్ అనేది సంక్లిష్టమైన ఎకోసిస్టమ్ అని, దీనిని కేవలం ఒక్క పదార్థం నియంత్రించలేదని కొందరు అంటున్నారు. మీరు తాగే కాఫీ పొడిలో మష్రూమ్ పొడి కలిపి తాగితే జీర్ణశక్తి బాగా పనిచేస్తుందని ఎందరో అంటున్నా కూడా నమ్మలేమంటున్నారు కొందరు. తినే పుట్టగొడుగుల్లో కొన్నింటిలో డి విటమిన్ , విటమిన్ బి6, పొటాషియం, ఫోలేట్ లాంటి మంచి న్యూట్రియంట్లు ఉన్నాయి.

వీటిని డైట్ లో సమతులాహారంగా తీసుకోవచ్చు కూడా. వీటిల్లోని యాంటి ఇన్ఫ్లమేటరీ, యాంటి, యాంటి ఆక్సిడెంట్ లక్షణాల వల్ల , ఇది ఇమ్మూనిటీ బూస్టర్ గా పనిచేస్తుందనడం వల్ల వెల్నెస్ ఉత్పత్తుల్లో సైతం మష్రూమ్ కాఫీ చేరింది. వీటితో సప్లిమెంట్లు కూడా వస్తున్నాయి. దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా లేకపోయినా కూడా ఈ కాఫీ స్టిమ్యులెంట్ గా ఉంటుంది కాబట్టి చాలామంది తాగుతున్నారనే వారు కూడా ఉంటున్నారు. ఈ కాఫీలో వాడే మష్రూమ్స్ ఆరోగ్యానికి మంచివే కానీ అది మ్యాజిక్ బుల్లెట్ కాదని కొందరు అంటున్నారు. ఏదేమైనా మష్రూమ్ కాఫీ తాగాలనుకుంటున్న వారు వైద్యుల సలహాను తీసుకోవాలి. ఎలాంటి సూటబుల్ మష్రూమ్స్ తినాలి, ఎంత తీసుకోవాలి వంటి వన్నీ వైద్యుని సూచనలకనుగుణంగా
పాటించాలి…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News