Saturday, November 15, 2025
Homeహెల్త్Nail Health: గోర్లపై గీతలు ఉన్నాయా? అయితే ఆ భయంకరమైన వ్యాధికి సూచనలే!

Nail Health: గోర్లపై గీతలు ఉన్నాయా? అయితే ఆ భయంకరమైన వ్యాధికి సూచనలే!

Nail Diseases:ప్రతిరోజూ అద్దంలో మన ముఖాన్ని చూసుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. కానీ చేతివేళ్ల గోళ్లను అంతగా పరిశీలించే వారు తక్కువే. చాలామందికి గోళ్లు అందానికి మాత్రమే సంబంధించినవిగా అనిపిస్తాయి. కానీ వైద్య నిపుణులు చెప్పేది వేరే. గోళ్లలో కనిపించే రంగు, ఆకారం, పొడవు లేదా నిర్మాణంలో వచ్చే మార్పులు మన శరీరంలోని అనేక రుగ్మతలను ముందుగానే తెలియజేస్తాయి. అంటే గోళ్లు మన ఆరోగ్యానికి అద్దంలా పనిచేస్తాయి.

- Advertisement -

అలంకార సమస్యలు..

గోళ్లపై చిన్న చిన్న మార్పులు కూడా కేవలం అలంకార సమస్యలు కావు. ఇవి శరీరంలో జరుగుతున్న ముఖ్యమైన హెచ్చరికలను తెలియజేయగలవు. ఉదాహరణకు రక్తహీనత, ఇన్ఫెక్షన్లు, గుండె సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు, కాలేయ వ్యాధులు, చివరికి క్యాన్సర్ వరకు గోళ్ల ద్వారా సంకేతాలు అందవచ్చు. ఈ మార్పులను చాలా సార్లు మనం నిర్లక్ష్యం చేస్తాం. కానీ వాటిని సకాలంలో గమనించి డాక్టరును సంప్రదిస్తే అనేక సమస్యలను ముందే నివారించుకోవచ్చు.

Also Read: https://teluguprabha.net/health-fitness/health-benefits-of-methi-sprouts-from-sugar-control-to-immunity/

అడ్డంగా గీతలు…

కొన్ని సందర్భాల్లో గోళ్లపై అడ్డంగా గీతలు ఏర్పడతాయి. వీటిని వైద్య భాషలో బ్యూస్ లైన్స్ అంటారు. ఇవి సాధారణంగా పెద్ద జ్వరం, శరీరానికి జరిగిన ప్రధాన శస్త్రచికిత్స లేదా తీవ్రమైన ఒత్తిడి తరువాత కనిపించవచ్చు. కానీ ఎటువంటి కారణం లేకుండా కొత్తగా ఇలాంటి గీతలు కనిపిస్తే అది శరీరం ఇచ్చే సీరియస్ హెచ్చరిక కావచ్చు. అప్పుడు వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.

పల్చబడి, మధ్యలో గుంత లాగా మారి

కొన్నిసార్లు గోళ్లు పల్చబడి, మధ్యలో గుంత లాగా మారి, అంచులు పైకి లేస్తాయి. ఇవి చెంచా ఆకారంలోకి మారతాయి. దీన్ని స్పూన్ నెయిల్స్ అని అంటారు. ఇది ఐరన్ లోపం వల్ల లేదా రక్తహీనతకు స్పష్టమైన సంకేతం. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే రక్త పరీక్ష చేయించుకోవడం, అవసరమైన చికిత్స పొందడం అత్యవసరం.

పసుపు రంగులోకి

కొంతమందికి గోళ్లు పసుపు రంగులోకి మారుతూ మందపోతాయి. గోళ్ల పెరుగుదల కూడా చాలా నెమ్మదిస్తుంది. చాలా సార్లు దీన్ని ఫంగస్ ఇన్ఫెక్షన్‌గా అనుకుంటారు. కానీ అదే సమయంలో శ్వాసలో ఇబ్బంది, పాదాల్లో వాపు లేదా దీర్ఘకాలిక దగ్గు వంటి లక్షణాలు ఉంటే అది పసుపు గోళ్ల సిండ్రోమ్ అనే సమస్య కావచ్చు. ఇది ఊపిరితిత్తుల వ్యాధులకు సంకేతం కావడంతో దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు.

పెళుసుగా, బలహీనంగా

గోళ్లు కొన్నిసార్లు పెళుసుగా, బలహీనంగా మారుతూ రంగు మారతాయి. దీనికి కారణం ఒనికోమైకోసిస్ అనే ఫంగస్ ఇన్ఫెక్షన్ కావచ్చు. ఈ ఇన్ఫెక్షన్ వదిలేస్తే అది తానే తగ్గిపోదు. చికిత్స చేయకపోతే నొప్పి పెరగడంతో పాటు ఇతర సమస్యలు కూడా వస్తాయి. నడకలో ఇబ్బందులు కలిగే స్థితి వరకు చేరవచ్చు.

ఎరుపు లేదా గోధుమ రంగులో

గోళ్ల కింద ఎరుపు లేదా గోధుమ రంగులో నిలువు చారలు కనిపించవచ్చు. చిన్న గాయాల వల్ల ఒకటి రెండు చారలు కనిపించడం సహజం. కానీ ఎటువంటి గాయం లేకుండా అనేక గోళ్లలో ఇలాంటి చారలు ఏర్పడితే అది గుండె లోపలి పొరలో ఇన్ఫెక్షన్ లేదా రక్తనాళాలకు సంబంధించిన సమస్య కావచ్చు. ముఖ్యంగా జ్వరం, అలసట వంటి లక్షణాలతో కలిపి ఇవి ఉంటే వెంటనే వైద్యుడిని కలవాలి.

Also Read:https://teluguprabha.net/health-fitness/snoring-in-children-may-signal-adenoids-problem/

నల్లటి లేదా ముదురు గోధుమ రంగులో

కొన్నిసార్లు గోరు కింద నల్లటి లేదా ముదురు గోధుమ రంగులో పొడవైన గీత ఏర్పడుతుంది. ఇది పెద్దవారిలో కొత్తగా కనబడితే జాగ్రత్త అవసరం. ఎందుకంటే ఇది సబ్‌ంగువల్ మెలనోమా అనే అరుదైన చర్మ క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు. గోళ్లలో ఈ విధమైన మార్పు గమనించిన వెంటనే చర్మ నిపుణుడిని సంప్రదించడం ద్వారా ప్రాణాపాయ సమస్యలను నివారించవచ్చు.

ఉబ్బిపోవడం

గోళ్ల చుట్టూ వేళ్ల చివరలు ఉబ్బిపోవడం, గోళ్లు కిందికి వంగి గుండ్రంగా మారడం కూడా కొన్ని రుగ్మతల సూచన. దీన్ని క్లబ్బింగ్ అంటారు. ఇది శరీరంలో ఆక్సిజన్ కొరత వల్ల వస్తుంది. దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్యలు లేదా గుండె సంబంధిత రుగ్మతలకు ఇది ముఖ్యమైన సంకేతం.

పలుచని గులాబీ గీత

కొన్ని సందర్భాల్లో గోళ్లు దాదాపుగా పూర్తిగా తెల్లగా మారి, చివర్లో మాత్రమే పలుచని గులాబీ గీత కనిపిస్తుంది. దీన్ని టెర్రీ నెయిల్స్ అంటారు. ఇది కాలేయ వ్యాధులు, మధుమేహం లేదా గుండె వైఫల్యానికి సూచనగా భావిస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad