ఈ రోజుల్లో చాలా మంది ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా బయట తిండి తినే అలవాటు ఉన్నవారు మలబద్ధకం (Constipation) వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వారంలో మూడు కంటే తక్కువసార్లు మలవిసర్జన చేసేవారికి మలబద్ధకం సమస్య ఉందని చెప్పవచ్చు. మలబద్ధకం వల్ల మలం గట్టిపడి విసర్జన కష్టమవుతుంది. ఫైబర్ తక్కువగా ఉన్న ఆహారం, నీరు తక్కువగా తాగడం, వ్యాయామం లేకపోవడం వంటివి దీనికి ప్రధాన కారణాలు. అయితే, ఉదయాన్నే కొన్ని సహజ పానీయాలు తాగడం వల్ల ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.
గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం చాలా మంచిది. నిమ్మలోని సిట్రిక్, ఆస్కార్బిక్ యాసిడ్స్ శరీరంలో బైల్ (Bile) ఉత్పత్తిని పెంచుతాయి. బైల్ అనేది ఆహారాన్ని డైజెస్ట్ చేసే ఒక రసాయనం. గోరువెచ్చని నీరు శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. దీంతో మలం మెత్తగా తయారై, సులభంగా బయటకు వస్తుంది. లెమన్ వాటర్‌తో డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇదే కాకుండా
కొబ్బరి నీళ్లు శరీరాన్ని హైడ్రేట్ చేస్తాయి. ఇందులో ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిలోని నేచురల్ షుగర్స్ పేగుల్లో కదలికలను ప్రేరేపిస్తాయి.అందుకే ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొబ్బని నీళ్లు తాగితే తిన్న ఆహారం బాగా అరుగుతుంది. మలం మెత్తగా మారి, విరేచనం సాఫీగా అవుతుంది.
యాపిల్ సైడర్ వెనిగర్ (Apple Cider Vinegar) కూడా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఒక స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్‌ను గోరువెచ్చని నీటిలో కలిపి తాగవచ్చు. పెప్పర్‌మింట్ టీ, చామంతి టీలు కూడా జీర్ణ ఆరోగ్యానికి మంచివి. దీనితో పాటు అల్లం టీ జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, మలబద్ధకాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
ఎండు ద్రాక్ష (Prunes) తో తయారు చేసిన జ్యూస్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. అలోవెరా జ్యూస్ కూడా మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. 2-3 టీ స్పూన్ల అలోవెరా గుజ్జును నీటిలో కలిపి ఉదయాన్నే తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించడం లేదు)