Kidney Stones: నేటి అనారోగ్యకరమైన జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. దీని కారణంగానే బిపి, షుగర్, గుండె సంబంధిత సమస్యలు, కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే, మూత్రపిండాల సంబంధిత సమస్యలలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం సాధారణ సమస్యగా మారిపోయింది.
మన శరీరంలో కాల్షియం యూరిక్ యాసిడ్ లేదా ఆక్సలేట్ వంటి ఖనిజాలు అధికంగా పేరుకుపోయి మూత్రం ద్వారా బయటికి రాలేనప్పుడు, అవి క్రమంగా పేరుకుపోయి చిన్నచిన్న గట్టిగ ఏర్పడతాయి. ఇవి క్రమంగా రాలుగా మారుతాయి. మూత్రపిండాల్లో రాళ్లు ఉంటే రోగి నడుము, కడుపు లేదా మూత్ర నాళంలో తీవ్రమైన నొప్పిని అనుభవిస్తాడు. అయితే తీసుకునే ఆహారం, జీవన శైలిలో కొన్ని మార్పులు చేయడం ద్వారా మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
పుష్కలంగా నీరు త్రాగాలి
మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి నీరు త్రాగడం సులభమైన, అత్యంత ప్రభావంవంతమైన మార్గం. రోజులో పుష్కలంగా నీరు త్రాగితే శరీరంలోని మురికి బయటకు వెళుతుంది. రోజుకు కనీసం 2.5 నుండి మూడు లీటర్ల నీరు త్రాగడానికి ప్రయత్నించాలి. అంతేకాదు మూత్రం రంగుపై కూడా నిఘా ఉంచాలి.
Also Read: Pumpkin Seeds: ఉదయాన్నే నానబెట్టిన గుమ్మడికాయ గింజలు తింటే శరీరంలో జరిగే మార్పులు ఏమిటో తెలుసా..?
ఆహారం పై శ్రద్ధ వహించడం
తీసుకునే ఆహారం కూడా ముద్ర పిండాల్లో రాల ప్రమాదంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఆక్సలైట్ అధికంగా ఉండే ఆహారాలు, పాలకూర, బీట్రూట్ మొదలైనవి తీసుకోవడం ద్వారా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. కావున వాటిని పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. అంతేకాదు అధిక ప్రోటీన్ కంటెంట్ ఆహారాలు కూడా మూత్రపిండాలను దెబ్బతీస్తాయి. కావున తీసుకునే ఆహారంపై శ్రద్ధ వహించాలి. దీంతోపాటు, ఉప్పు తినడం వల్ల రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది.
సిట్రస్ పండ్లు
సిట్రస్ యాసిడ్ నిమ్మ, నారింజ, సీజన్ ఫ్రూట్ వంటి సిట్రస్ పండ్లలో కనిపిస్తుంది. ఇది సహజంగా కాల్షియం ఆక్సలైట్ రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది. ప్రతిరోజు నీటితో కలిపిన ఒక నిమ్మరసం తాగడం కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉండడానికి అద్భుతమైన నివారణ.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం
ఊబకాయం ఉండడం వల్ల కూడా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి ప్రధాన కారకం. కావున క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. దీనివల్ల శరీర జీవక్రియ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అయితే వ్యాయామం చేసిన తర్వాత శరీరం డిహైడ్రేట్ కు గురికాకుండా ఉండడానికి పుష్కలంగా నీరు త్రాగాలని గుర్తించుకోవాలి.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.


