High Blood Pressure: చాలా మంది నేటి బిజీ లైఫ్ లో తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం మానేశారు. ఇటువంటి పరిస్థితిలో ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. సరైన ఆహారపు అలవాట్లు, అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా రక్తపోటు సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అధిక రక్తపోటు ఒక తీవ్రమైన వ్యాధి. చాలా సార్లు దాని లక్షణాలను గుర్తించలేము. దీనిని సకాలంలో నియంత్రించకపోతే అనేక తీవ్రమైన వ్యాధులకు దారి తీస్తుంది.
ఇది వృద్ధులను మాత్రమే కాకుండా యువతను కూడా ప్రభావితం చేస్తోంది. అందువల్ల రక్తపోటు ఎక్కువగా ఉన్నప్పుడు మనకు ఏమి చేయాలో తెలిసి ఉండాలి. తద్వారా దానిని వెంటనే నియంత్రించవచ్చు. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతుంటే అకస్మాత్తుగా మీ బిపి ఎక్కువగా ఉంటే కొన్ని సహజ పద్ధతులను అవలంబించవచ్చు. ఎటువంటి మందులు, వైద్యుడు లేకుండా అధిక బిపిని వెంటనే నియంత్రించగల కొన్ని చిట్కాల గురుంచి మనం ఇక్కడ తెలుసుకుందాం.
లోతైన శ్వాస వ్యాయామం చేయడం
అధిక రక్తపోటు ఉన్నప్పుడు లోతైన శ్వాస వ్యాయామం చేయడం ద్వారా పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ సక్రియం అవుతుంది. ఇది హృదయ స్పందన రేటును నెమ్మదిస్తుంది. రక్త నాళాలను కూడా సడలిస్తుంది. ఇలా కొన్ని నిమిషాలు చేయడం ద్వారా పెరిగిన రక్తపోటు త్వరగా, సహజంగా నియంత్రించబడుతుంది.
ముఖాన్ని చల్లటి నీటితో కడుక్కోవడం
రక్తపోటు అకస్మాత్తుగా పెరిగితే, వెంటనే ముఖాన్ని చల్లటి నీటితో కడుక్కోవాలి. దీనితో పాటు, పాదాలను చల్లటి నీటిలో కొంత సమయం నానబెట్టడం వల్ల రక్త నాళాలు కుంచించుకుపోతాయి. ఇలా చేయడం వల్ల హృదయ స్పందన, రక్తపోటు తగ్గుతుంది. అంతే కాకుండా ఇది ఆందోళన, ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.
నిమ్మకాయ నీరు తాగడం
రక్తపోటు పెరిగినప్పుడల్లా, నిమ్మకాయ నీరు త్రాగాలి. పొరపాటున కూడా నిమ్మకాయ నీరులో చక్కెర లేదా ఉప్పు కలపకూడదని గుర్తుంచుకోవాలి. నిజానికి సాదా నిమ్మకాయ నీరు తాగడం వల్ల శరీరంలో పొటాషియం లోపం తీరుతుంది. సోడియం పొటాషియంతో నియంత్రించబడుతుంది. దీనితో పాటు, రక్త నాళాలు కూడా విశ్రాంతి పొందుతాయి. ఇది రక్తపోటును సాధారణీకరించడంలో సహాయపడుతుంది.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.