Neem Leaves Benefits: వేప ఆకు రుచికి చేదుగా ఉంటుంది. కానీ దానిలో ఏన్నో ఔషధగుణాలు ఉన్నాయి. ఉదయం ఖాళీ కడుపుతో.. ఆరోగ్యానికి ఒక అద్భుత ఔషధంగా పని చేస్తుంది. అయితే వేప ఆకులు మన ఆరోగ్యానికి ఎలా సాయపడతాయో తెలుసుకుందాం!
Neem Leaves Benefits: వేప ఆకులు చేదుగా ఉన్నా.. వాటి ప్రయోజనం అంతా ఇంతా కాదు. రక్తాన్ని శుభ్రం చేయడంలో వేపాకుకు మించిన ప్రకృతి ఔషధం మరోటిలేదని చెప్పవచ్చు. రక్తాన్ని శుభ్రపరచడమే కాకుండా మన ఆరోగ్యానికి ఒక వరంగా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేప ఆకు రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. చర్మంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ఖాళీ కడుపుతో వేప ఆకు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అంతా ఇంతా కాదు.
ఖాళీ కడుపుతో వేప ఆకులను నమిలితే: ఖాళీ కడుపుతో వేప ఆకులను నమలడం వలన నోటిని శుభ్రపరుస్తుంది. దంతాలు, చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణక్రియను సైతం మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం.. వేప ఆకులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు చాలా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తాయి. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో 3-4 లేత వేప ఆకులను నమిలి తింటే.. కడుపులోని హానికరమైన కీటకాలు నశిస్తాయి. అంతేకాకుండా గ్యాస్, మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలను సైతం దూరం చేస్తాయి.
డయాబెటిస్ వారికి వరం: వేప ఆకు రసాన్ని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. మధుమేహం వారికి వేప ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాటిలో ఫ్లేవనాయిడ్లు, గ్లైకోసైడ్లు, టెర్పెనాయిడ్లు వంటి అనేకు యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. వీటి కారణంగా రక్తంలో చక్కెర స్థాయి సమతుల్యంగా ఉంటుంది. అంటే డయాబెటిస్ రోగులు ప్రతిరోజూ వేప ఆకులు నమిలితే వారి రక్తంలో చక్కెర ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంటుంది.


