Sunday, July 7, 2024
Homeహెల్త్No time to workout? ఎక్సర్ సైజ్ చేసే టైం లేదా?

No time to workout? ఎక్సర్ సైజ్ చేసే టైం లేదా?

ఇంట్లో ఉన్నప్పుడు కుర్చీలో కూర్చోకుండా కాసేపు గోడకుర్చీ వేస్తే మంచిది

ఇంట్లో ఇలా చేస్తే…

- Advertisement -

వ్యాయామలు చేయడానికి సమయం ఉండటం లేదని బాధపడొద్దు. ఇంటి పనులు కూడా మీ శరీరానికి మంచి వ్యాయామాన్ని ఇస్తాయంటున్నారు ఫిట్ నెస్ నిపుణులు. ఇందుకు ఇంటిపనులు చేసేటప్పుడు చిన్న చిన్న చిట్కాలు అనుసరిస్తే చాలంటున్నారు. అతి బరువులు మటుకు ఎత్తవద్దని హెచ్చరిస్తున్నారు కూడా. బట్టలు ఉతికేటప్పుడు నిటారుగా ఉండి బకెట్ ను భుజాల వరకూ ఎత్తి దించడానికి ప్రయత్నించమంటున్నారు. ఇలా ఐదుసార్లు చేసినా గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెప్తున్నారు. అంతేకాదు ఇలా చేయడం వల్ల చేతులు కూడా ద్రుఢంగా తయారవుతాయని చెప్తున్నారు. ఇంట్లో ఉన్నప్పుడు కుర్చీలో కూర్చోకుండా కాసేపు గోడకుర్చీ వేస్తే మంచిదంటున్నారు. కాఫీ తాగుతున్నప్పుడో లేదా ఫోను మాట్లాడుతున్నప్పుడు కనీసం పదిహేను సెకన్లు గోడకుర్చీవేస్తే పిరుదులు దగ్గర కొవ్వు కరుగుతుందని చెప్తున్నారు. వీటితో పాటు గ్లూట్ కండరాలు కూడా ఆరోగ్యంగా తయారవుతాయని చెప్తున్నారు. ఇలా వీలైనన్నిసార్లు చేయమంటున్నారు. నడుం కిందిభాగం తగ్గాలంటే కుదిరిరపుడల్లా స్క్వాట్స్ చేయమంటున్నారు.


ఇందుకు సింపుల్ గా కాళ్లను కాస్త ఎండంగా పెట్టి కింద కూర్చునేందుకు ప్రయత్నిస్తే చాలంటున్నారు. ఇలా కనీసం ఇరవైసార్లు చేస్తే ఛాతీ భాగానికి, చేతులకు బాగా వ్యాయామం అవుతుందంటున్నారు. ఇంట్లో పిల్లలతో ఆడేటప్పుడు బోర్లా పడుకుని కాళ్లు, చేతుల్ని ఆసరా చేసుకుని ప్లాంక్ ఆక్రుతిలో ఉండేందుకు ప్రయత్నిస్తే పొట్ట దగ్గర పేరుకున్న కొవ్వు తగ్గుతుంది. అంతేకాదు అక్కడి కండరాలు కూడా ఆరోగ్యంగా తయారవుతాయని సూచిస్తున్నారు. ఇవి చిన్నవే అయినప్పటికీ మీ శరీరాక్రుతిని ద్రుష్టిలో పెట్టుకుని వీటిని
చేసేటప్పుడు నడుం, కండరాలు పట్టకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా వైద్యులతో ఒకసారి సంప్రదించి వారిచ్చిన సలహాలను పాటించి చేస్తే రోజంతా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News