High Blood Pressure Foods: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది తమ ఆరోగ్యం పై శ్రద్ధ చూపడం పూర్తిగా మానేశారు. తప్పుడు ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు కారణంగా అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. ఇందులో అధిక రక్తపోటు సమస్య కూడా ఒకటి. ఇటీవల ఈ సమస్యల చాలా వేగంగా పెరుగుతోంది. చాలామంది అధిక రక్తపోటును చిన్న సమస్య గా భావించి లైట్ తీసుకుంటున్నారు. కానీ, ఈ వ్యాధి క్రమంగా ప్రాణాంతకం కావొచ్చు కూడా! శరీరంలో రక్తపోటు నియంత్రణలో లేకుంటే ఇది గుండె, మూత్రపిండాలు, మెదడును నేరుగా ప్రభావితం చేస్తుంది. అయితే, చాలామంది రక్తపోటును నియంత్రించడానికి, కేవలం ఉప్పు మాత్రమే తక్కువ తినాలని అనుకుంటారు. వాస్తవానికి అది నిజం కాదు. ఉప్పుతో పాటు, అధిక రక్తపోటును పెంచే ఆహారాలు కూడా ఉన్నాయి. మనం వాటిని తెలియకుండానే మన ఆహారంలో భాగం చేసుకుంటాము. వీటిపై సకాలంలో జాగ్రత్తగా పడకపోతే ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
ఉప్పుతో పాటు, అధిక రక్తపోటును పెంచే ఆహార పదార్థాలు
రక్తపోటు సమస్య ఉన్నవారు రుచిగా ఉందని జంక్ ఫుడ్‌లను తినకూడదు. వీలైనంత తక్కువగా వీటిని తినాలి. ఎందుకంటే దీనిలో ఉండే ట్రాన్స్ ఫ్యాట్ రక్తపోటు స్థాయిని పెంచుతుంది. ఒకవేళ మీకు జంక్ ఫుడ్ తినాలని కోరిక కలుగుతే, దీన్ని ఇంట్లో తయారు చేసుకుని తినవచ్చు. అదికూడా నెలకు ఒకసారి తినాలి.
పిజ్జా, నూడుల్స్, చిప్స్ మరియు కుర్కురేలను బిపి రోగులు అసలు తినకూడదు. దీని కారణం ఇందులో అధిక సోడియం, ప్రిజర్వేటివ్‌ల పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి బిపిని పెంచుతాయి.
రెడ్ మీట్ ఎక్కువగా తింటే కూడా అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇందులో అధిక సంతృప్త కొవ్వు పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో ఇది గుండెకు మంచిది కాదు.
ఎక్కువ తీపి ఉన్న పదార్థాలను తినడం ద్వారా కూడా రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. స్వీట్స్, ప్యాకేజ్డ్ జ్యూస్, కూల్ డ్రింక్ వంటివి అధిక బిపి రోగులకు చాలా ప్రమాదకరం.
ఎక్కువగా టీ, కాఫీ తాగడం కూడా అధిక రక్తపోటుకు కారణమవుతుంది. ఇందులో అధిక మొత్తంలో కెఫిన్ ఉంటుంది. ఇది రక్తపోటు రోగులకు చాలా ప్రమాదకరం.
సహజంగా బిపిని నియంత్రించే మార్గాలు
1. బరువును అదుపులో ఉంచుకోవాలి.
2. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
3. ఆరోగ్యకరమైన ఆహారాలు డైట్ లో చేర్చుకోవాలి.
4. ఉప్పు, సోడియం వాడకం తగ్గించాలి.
5. 7-8 గంటలు నిద్ర పోవాలి.
6. వ్యాయామం చేసి ఒత్తిడిని తగ్గించుకోవాలి.


