Not to boil in Pressure Cooker: మన దైనందిన జీవితంలో ప్రెషర్ కుక్కర్‌కు ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాదాపు ప్రతి ఇంట్లో ప్రెషర్ కుక్కర్ కంపల్సరీగా మారింది. ఇన్‌స్టంట్‌గా అన్నం వండుకోవడానికి ప్రెషర్ కుక్కర్ బాగా ఉపయోగపడుతుంది. అందుకే, దీనికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అయితే, ప్రెషర్ కుక్కర్ వల్ల లాభాలెలా ఉన్నా.. నష్టాలు చాలానే ఉన్నాయి. ప్రెషర్ కుక్కర్‌లో కొన్ని ఆహార పదార్థాలను అధిక ఉష్ణోగ్రత వద్ద ఉడికించినప్పుడు వాటిలో ఉండే సహజ లక్షణాలు మారిపోయి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ప్రెషర్ కుక్కర్ వంట సమయాన్ని తగ్గిస్తుంది. కానీ కొన్ని ఆహారాలను ఇందులో వండటం వలన వాటి పోషక విలువలు తగ్గిపోయి.. కొన్ని సందర్భాల్లో విషపూరితంగా మారే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రెషర్ కుక్కర్‌లో అస్సలు వండకూడని నాలుగు ప్రధాన ఆహారాల పదార్థాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
ప్రెషర్ కుక్కర్‌లో వండకూడని ఆహారాలివే..
బంగాళాదుంపలు
ప్రెషర్ కుక్కర్‌లో బంగాళాదుంపలతో చేసిన కర్రీలు అస్సలు వండకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కుక్కర్‌లో బంగాళాదుంపలను ఉడికించడం వల్ల వీటిలో ఉండే సహజ పోషకాలు చాలా వరకు నశించిపోతాయి. అంతేకాకుండా అధిక వేడి వద్ద వీటిలో ఎక్రిలమైడ్ అనే హానికరమైన పదార్థం ఏర్పడుతుంది. ఇది ఆరోగ్యానికి చేటు చేస్తుంది.
బచ్చలికూర
బచ్చలికూరను ప్రెషర్ కుక్కర్‌లో వండటం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. దీనిని అధిక వేడిలో వండటం వలన అందులోని ఆక్సలేట్లు, ఇతర సమ్మేళనాలు భారీగా పెరుగుతాయి. ఇది మీ కిడ్నీలపై ఒత్తిడి పెంచి దీర్ఘకాలంలో కిడ్నీలో రాళ్లకు దారి తీస్తుంది. తద్వారా త్వరగా కిడ్నీలు పాడయ్యే ప్రమాదం పొంచి ఉంది.
బియ్యం
ప్రెషర్ కుక్కర్‌లో అన్నం వండటం ఆరోగ్యకరం కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బియ్యంలో ఉండే ఫైటిక్ యాసిడ్ అధిక ఉష్ణోగ్రతలో పూర్తిగా విచ్ఛిన్నం కాదు. దీనివల్ల జీర్ణ సమస్యలు తలెత్తి.. రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
గుడ్లు
గుడ్లను కుక్కర్‌లో ఉడికించడం వల్ల వాటిలోని ప్రోటీన్ల నిర్మాణం మారుతుంది. ఇది జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా అధిక వేడికి లోనవడం వల్ల గుడ్లలోని విటమిన్ డీ, విటమిన్ బీ12 వంటి ముఖ్యమైన పోషకాలు నశించిపోతాయి. త్వరగా వంట పూర్తి చేయాలనుకునేవారు ఈ నాలుగు ఆహారాలను ప్రెషర్ కుక్కర్‌లో వండకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇన్‌స్టంట్‌గా తయారు చేసుకోవచ్చనే ఉద్దేశ్యంతో ప్రెషర్ కుక్కర్‌ను అదేపనిగా వాడితే అనారోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.


