అల్లంతో బరువు తగ్గొచ్చు. అందుకు కొన్ని వంటింటి టిప్స్ ఉన్నాయి.
నిమ్మ రసంలో అల్లంరసం కలిపి తాగితే ఆకలి తగ్గుతుంది. దీంతో బరువు తగ్గుతాం.
అల్లం టీలో ఒక నిమ్మరసం పిండుకుని రోజుకు రెండుసార్లు తాగితే బరువు తగ్గుతాము.
యాపిల్ సిడార్ వెనిగర్ లో అల్లం రసం కలిపి తాగితే కూడా బరువు తగ్గుతాము.
గ్రీన్ టీలో అల్లం రసం కలిపి తాగితే శరీర బరువు పెరగదు.
నీటిలో అల్లం, తేనె, నిమ్మరసాలను కలిపి తాగితే డీహైడ్రేషన్ సమస్య ఎదురవదు.
- Advertisement -
కడుపునిండిన భావాన్ని అల్లం కలుగచేస్తుందని పలు అధ్యయనాలలో కూడా తేలింది. బ్లడ్ షుగర్ ని అల్లం క్రమబద్ధీకరిస్తుందని కూడా వెల్లడైంది.
అల్లం, నిమ్మ రసం కలిపి తాగితే జీర్ణవ్యవస్థ వేగంగా పనిచేస్తుంది.