Sunday, July 7, 2024
Homeహెల్త్Obesity control: బరువును తగ్గించే ఫుడ్స్

Obesity control: బరువును తగ్గించే ఫుడ్స్

శరీరంలో పేరుకున్న కాలరీలను కరిగించే.. కొవ్వును వేగంగా తగ్గించే ఫుడ్స్ కొన్ని ఉన్నాయి. అవేమిటంటే…

- Advertisement -

 పెసల్లో ఎ, బి, సి, ఇ విటమిన్లతో పాటు కాల్షియం, ఐరన్, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిల్లో ఫ్యాట్ బాగా తక్కువగా, పీచుపదార్థాలు, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటిని కొద్దిగా తింటే చాలు కడుపు నిండినట్టు ఉంటుంది. బరువు కూడా తగ్గుతారు.

 పచ్చిమిరపకాయలు శరీర బరువును తగ్గించడంలో బాగా పనిచేస్తాయి. జీర్ణక్రియ బాగా జరగడానికి సహాయపడతాయి. జీర్ణక్రియ వేగం పెంచడం ద్వారా శరీరంలోని కొవ్వును పచ్చిమిరపకాయలు తగ్గిస్తాయి.

 మసాలాల్లో క్వీన్ ఏలకులు. ఇవి శరీరంలోని ఉష్ణోగ్రతను పెంచడం ద్వారా జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి.

 కరివేపాకు శరీరంలోని ఫ్యాట్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాదు చెడు కొలెస్ట్రాల్ ప్రమాణాలను తగ్గిస్తుంది. శరీరంలో పేరుకున్నఅదనపు కొవ్వును సైతం కరిగిస్తుంది.

 జీర్ణక్రియను వేగవంతం చేయడం ద్వారా గ్రీన్ టీ శరీర బరువును వేగంగా తగ్గిస్తుంది. ఇందులో యాంటాక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గడం సహజం. కారణం గ్రీన్ టీలో ఆకలిని తగ్గించే గుణం దాగుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News