Friday, November 22, 2024
Homeహెల్త్Obesity: పొట్ట చుట్టూ కొవ్వు తగ్గాలంటే..

Obesity: పొట్ట చుట్టూ కొవ్వు తగ్గాలంటే..

పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం చాలామందిలో చూస్తుంటాం. ముఖ్యంగా మహిళలు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటుంటారు. దీనికి కొన్ని సహజమైన టిప్స్ ఉన్నాయి. అవి పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. అవి:

- Advertisement -

 గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల నిమ్మరసం వేసి ఉదయమే ఖాళీ కడుపుతో తాగితే పొట్ట చుట్టూ చేరిన కొవ్వు కరుగుతుంది. కావస్తే ఇందులో ఒక టీస్పూను తేనె, పిసరంత ఉప్పు కూడా వేసుకోవచ్చు.

 ఒక గ్లాసుడు నీళ్లల్లో టీ స్పూను జీలకర్ర వేసి రాత్రంతా అలాగే ఉంచి పొద్దున్నేవడగట్టి ఆ నీళ్లను తాగాలి. ఈ జీలకర్ర నీళ్లల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి.

 వెల్లుల్లిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. జీర్ణక్రియ మీద కూడా ఇది బాగా పనిచేస్తుంది. బరువు తగ్గేట్టు చేస్తుంది. పొద్దున్నే ఖాళీ కడుపున రెండు మూడు పచ్చి వెల్లుల్లి రెబ్బలను చప్పరించాలి. ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. విషపదార్థాలను శరీరం నుంచి బయటకు పంపివేస్తుంది. డైట్ లో నిత్యం వెల్లుల్లి వాడితే శరీరంలోని కొవ్వు కూడా తగ్గుతుంది.

 నీళ్లు ఎక్కువ తాగడం వల్ల శరీరంలో ఉన్న అదనపు కొవ్వు బయటకుపోతుంది. అలాగే మలినాలను కూడా నీళ్లు బయటకు పంపేస్తాయి. ఎక్కువ నీళ్లు తాగడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కూడా తగ్గుతుంది.

 వంటల్లో కొబ్బరినూనె వాడితే మంచిది. ఇందులో ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కొబ్బరినూనె థెర్మోజెనిక్ కావడంతో శరీరంలో వేడి పుట్టి ఫ్యాట్ కరుగుతుంది.

 చక్కెరలో కాలరీలు ఎక్కువగా ఉంటాయి. బరువు పెరుగుతారు. పొట్ట చుట్టూ కూడా ఎక్కువ ఫ్యాట్ చేరుతుంది. అందుకే నేచురల్ షుగర్స్ ను ఎంజాయ్ చేయండి. ఇవి పండ్లల్లో ఎక్కువగా ఉంటాయి. పండ్లు తింటే ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.

 అల్లం, పుదీనా లాంటి వాటి హెర్బ్ తో టీ చేసుకుని అందులో తేనె కలుపుకుని భోజనానికి ముందు తాగితే మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News