ఆలివ్ నూనెతో చర్మం, శిరోజాలు ఎంతో అందంగా తయారవుతాయి. ఆ బ్యూటీ టిప్స్ ఇవే..
ఆలివ్ నూనెను హెయిర్ ట్రీట్మెంటుకు వాడతారు.ఆలివ్ నూనెను వేడినీళ్లల్లో కాసేపు ఉంచి గోరువెచ్చగా చేయాలి. దాన్ని వెంట్రుకలకు, మాడుకు రాసుకొని పది నుంచి ఇరవై నిమిషాలు అలాగే ఉంచుకుని ఆ తర్వాత షాంపు పెట్టుకుని తలస్నానం చేయాలి.
టీస్పూన్ ఆలివ్ ఆయిల్ లో చక్కెరపలుకులు వేసి పగిలిన పెదాలకు స్క్రబ్ లా రాసుకోవాలి. నిమ్మచెక్కను పెదాలపై అప్లై చేసుకోవాలి. నిమ్మచెక్క చర్మాన్ని ఎక్స్ ఫొయిలేటింగ్ చేస్తుంది. ఈ స్క్రబ్ ను శరీరానికంతటికీ కూడా రాసుకోవచ్చు.
ఇది మేకప్ రిమూవర్. ముఖ్యంగా ఐ మేకప్ ను తొలగించడంలో ఆలివ్ ఆయిల్ ఎంతో బాగా పనిచేస్తుంది. దీన్ని కళ్లకు రాసుకుని మేకప్ తొలగించిన తర్వాత గోరువెచ్చని నీళ్లు, పిహెచ్ బాలెన్స్డు ఫేస్ వాష్ తో ముఖం కడుక్కోవాలి.
చెవిలో చేరిన గులుబును కూడా ఆలివ్ ఆయిల్ తొలగిస్తుంది. మీరు చేయాల్సిందల్లా రాత్రి పడుకోబోయే ముందు మూడు లేదా నాలుగు రోజుల పాటు వరుసగా గులుబుచేరిన చెవిలో ఆలివ్ ఆయిల్ కొన్ని చుక్కలు వేసుకుంటే చాలు.
ఆలివ్ ఆయిల్ షైన్ సిరమ్ లాగా కూడా వెంట్రుకలపై పనిచేస్తుంది.
ఆలివ్ ఆయిల్ గోళ్లను బలంగా ఉండేలా చేస్తుంది. గోళ్ల చిగుళ్లను సున్నితంగా మలుస్తుంది.
ఆలివ్ ఆయిల్ మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. ఎక్స్ ట్రా డ్రై స్కిన్ ఉన్నవారికి ఈ ఆయిల్ చాలా ఉపయోగపడుతుంది. ఎగ్జిమా వంటి వాటిపై కూడా ఇది బాగా పనిచేస్తుంది.
చిట్లిన పాదాలపై ఆలివ్ ఆయిల్ రాస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ప్యూమిక్ స్టోన్ తో పాదాలను ఎక్స్ ఫొయిలేట్ చేసిన తర్వాత ఆలివ్ ఆయిల్ ని పాదాలపై అప్లై చేయాలి.
మేకప్ బ్రషెస్ ను తరచూ శుభ్రం చేసుకుంటుండాలి. ఈ పనికి ఆలివ్ ఆయిల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందుకు రెండువంతులు యాంటీబాక్టీరియల్ , ఒక పాలు ఆలివ్ ఆయిల్ఉన్న డై క్లీన్సర్ ను ఉపయోగించాలి.
రఫ్ స్కిన్ ను కూడా ఆలివ్ ఆయిల్ ఎక్స్ ఫొయిలేట్ చేస్తుంది. అరకప్పు ఆలివ్ ఆయిల్ లో అరకప్పు రాళ్లు ఉప్పు వేసి స్క్రబ్ లా తయారుచేసి మోచేతులు, మోకాళ్లు, పాదాల మడమల దగ్గర నల్లగా ఉన్న చోట ఈ స్క్రబ్ ను రెండు నిమిషాల పాటు మసాజ్ చేస్తూ అప్లై చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి.
శిరోజాలకు డీప్ కండిషనింగ్ పెట్టుకొనేటప్పుడు కూడా ఆలివ్ ఆయిల్ ని వాడతారు. ఒక కప్పులో మూడవవంతు రెగ్యులర్ కండిషనర్ తీసుకుని అందులో రెండు లేదా మూడు టీస్పూన్ల ఆలివ్ ఆయిల్ కలపాలి. దాన్ని మాడుకు, వెంట్రుకలకు బాగా రాసుకుని పది నిమిషాలు అలాగే ఉంచుకుని తర్వాత నీళ్లతో కడిగేసుకోవాలి.
స్నానం చేసిన తర్వాత కొద్దిగా ఆలివ్ నూనె తీసుకుని ముఖానికి, శరీరానికి రాసుకొని మసాజ్ చేయాలి. దీంతో రెండునిమిషాల్లో ఈ నూనె చర్మంలోపలికి ఇంకి చర్మం ఎంతో మ్రుదువుగా తయారవుతుంది.
ఆలివ్ ఆయిల్, తేనె రెండింటినీ సమపాళ్లల్లో తీసుకుని పేస్టులా కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట సేపు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఈ ఫేస్ మాస్కు ముఖ చర్మాన్ని ఎంతో మ్రుదువుగా చేస్తుంది.
ఆలివ్ ఆయిల్ చర్మాన్ని బాగా హైడ్రేట్ చేస్తుంది. కావలసినంత తేమను చర్మానికి అందిస్తుంది. యాక్నే మచ్చలను తగ్గిస్తుంది. కళ్లకింద ఏర్పడ్డ నల్ల వలయాలను పోగొడుతుంది. అలాగే చర్మంపై ముడతలు, ఫైన్ లైన్స్ పోగొట్టి మ్రుదువుగా కనిపించేలా చేస్తుంది. మసాజ్ కు ఎంతో ఉపయోగపడుతుంది. దీంతో శరీరాన్ని మసాజ్ చేసుకోవడం వల్ల చర్మం మెరుపును సంతరించుకుంటుంది. అందుకే వారానికి ఒకసారి ఆలివ్ ఆయిల్ తో శరీరాన్ని మసాజ్ చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. మీది పొడిచర్మం అయితే అదనంగా ఇంకొన్ని రోజులు ఈ ఆయిల్ మసాజ్ చేసుకుంటే మంచి ఫలితాలు చూస్తారు. యాక్నే ఉన్న చోట ఈ ఆయిల్ తో నేరుగా మసాజ్ చేయాలి. ఆలివ్ ఆయిల్ లో కొద్దిగా నిమ్మరసం కలిపి యాక్నే మచ్చలపై రాసినా కూడా మంచి ఫ్రభావం కనిపిస్తుంది. అయితే ఆలివ్ ఆయిల్ ని తగినంత ప్రమాణంలో మాత్రమే చర్మంపై అప్లై చేసుకోవాలని మరవొద్దు. ఈ విషయంలో చర్మనిపుణుల సలహాను తీసుకోవడం మంచిది.