లాంగ్విటీ లాంజ్ అనేది ఖచ్చితత్వంతో కూడిన జన్యుపరమైన ఆరోగ్య స్క్రీనింగ్లకు అంకితమైన సెంటర్, ఇలాంటి సేవలను తొలిసారి హైదరాబాద్ లో ప్రారంభించింది ఒమేగా ఆసుపత్రి. ప్రివెంటివ్ హెల్త్ కేర్లో అత్యున్నత ప్రమాణాలను కోరుకునే వ్యక్తుల కోసం దీన్ని రూపొందించారు. ప్రత్యేకమైన హాస్పిటాలిటీ అనుభవంతో అత్యాధునిక వైద్య శాస్త్రాన్ని అనుసంధానంచేసేలా ఉండటమే దీని విశిష్టత.
ఆరోగ్యాన్ని ఆప్టిమైజ్ చెయ్యడం అనేది కష్టతరంగా కాకుండా సులభంగా ఉండాలని ఎలైట్ లైఫ్ స్టైల్ ఉండేందుకు అనువుగా దేశంలో తొలిసారి ఇలాంటి సేవలను తాము హైదరాబాద్ లో అందుబాటులోకి తెచ్చినట్టు ఒమేగా హాస్పిటల్స్ ఫౌండర్ డాక్టర్ మోహన వంశీ వివరించారు. ఒమేగా హాస్పిటల్స్ వైద్య విధానంలో అందుబాటులో ఉన్న నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. అల్ట్రా-ప్రీమియం, ప్రైవేట్ సెట్టింగ్ తో ప్రశాంతమైన వాతావరణంలో అత్యాధునిక సదుపాయాలతో వ్యక్తి గోప్యతను పాటిస్తూ పర్సనలైజ్డ్ కేర్ అందించాలనే ఉద్దేశంతో డిజైన్ చేసినట్టు ఒమేగా ఆసుపత్రి వెల్లడించింది.
స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ జెనెటిక్ టెస్టింగ్
క్యాన్సర్ తీవ్రత , గుండె ఆరోగ్యం, ముందస్తు వ్యాధి ప్రమాదాల గుర్తింపు , సంతానోత్పత్తి సమస్య, మెటబోలిక్ హెల్త్ తో పాటు మరిన్ని కీలకమైన ఆరోగ్య కారకాలపై లోతైన అధ్యయనం చేయడంతో పాటు ఖచ్చితమైన డయాగ్నోసిస్ అండ్ ట్రీట్ మెంట్ అందించే దిశగా వైద్యాన్ని అందుబాటులోకి ఒమేగా ఆసుపత్రి తేవటం విశేషం. ప్రతి ఒక్కరికి అనుభవజ్ఞులైన జెనెటిక్ స్పెషలిస్ట్స్ కన్సల్టేషన్ తో పాటు కచ్చితమైన డేటా తో కూడిన హెల్త్ గైడెన్స్ ఇస్తున్నట్టు సంస్థ సగర్వంగా ప్రకటించింది. ప్రపంచ స్థాయి లగ్జరీతో పాటు సైంటిఫిక్ ఎక్స్లెన్స్ ని అనుసంధానం చేస్తూ ఈ లాంగ్విటీ లాంజ్ ప్రివెంటివ్ హెల్త్ కేర్లో సరికొత్త బెంచ్ మార్క సెట్ చేసేలా ఈ సరికొత్త చికిత్సా విధానం ఉండబోతుండటం హైలైట్.